Education
గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించిన విద్యార్థి సంఘల నాయకులు


గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించిన విద్యార్థి సంఘల నాయకులు
జనం వెలుగు, నిజామాబాద్:- తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు.. ముఖ్యంగా గిరిజన, గురుకుల పాఠశాలలా పరిస్థితి దారుణంగా తయారయింది. ఆహారం బాగోలేదంటూ ఏదో ఒక పాఠశాలలో నిరసనలు జరుగుతూనే ఉంటున్నాయి. పురుగుల పట్టిన అన్నం తిని ఫుడ్ పాయిజన్‌కు గురై ఆస్పత్రులలో కూడా జాయిన్ అవుతున్నా వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నామమాత్రపు చర్యలు తీసుకుంటుందని, శాశ్వత పరిష్కారం వైపు ఆలోచించడం లేదంటూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU ), మరియు తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ (TSP) నాయకులు విమర్శించారు. నసుర్లలాబాద్ మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల వసతులను పిడిఎసు జిల్లా అధ్యక్షులు ఎన్ బాల్‌రాజ్, మరియు టీ ఎస్ పి జిల్లా అధ్యక్షులు మావురం శ్రీకాంత్ విద్యార్థి సంఘా నాయకులు పాఠశాలను పరిశీలించరు విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని ప్రతిరోజు అందించాలని విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత విషయంలో రాజీ పడదని నాణ్యమైన భోజనాన్ని అందించాలని పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించేటట్లుగా ముక్యంగా సీజనల్ వ్యాధులు గురించి విద్యార్థులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడంతోపాటు మంత్లీ హెల్త్ చెకప్ చేయించాలని అందేవిధంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని,రాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు వరుసగా చోటు చేసుకొంటున్నాయని పాఠశాల యాజమాన్యానికి సూచించారు స్థానిక వైద్య సిబ్బంది విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని తెలియజేశారు. గిరిజన పాఠశాలలో విద్య ప్రమాణాన్ని పెంచాలని ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని విద్యార్థులకు చదువుతోపాటు మానసిక క్రీడలను ప్రోత్సహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పి డి ఎస్ యు (ఎస్) నాయకులు N సాయిబాబా, R ప్రశాంత్, టిఎస్పి నాయకులు G ఆదర్శ్ కుమార్ గురుకుల పాఠశాల యెక్క విద్యార్థులు మరియు ప్రిన్సిపాల్ మాధవరావు, వసతి గృహాధికారిని రాధా మేడం పాల్గొన్నారు.
Education
నందిపేట మండల కేంద్రంలో సాంకేతిక కళాశాల విద్యార్థుల రాస్తారోకో ధర్నా…..


నందిపేట మండల కేంద్రంలో సాంకేతిక కళాశాల విద్యార్థుల రాస్తారోకో ధర్నా…..
నందిపేట్ ఆగస్టు 17 జనం వెలుగు న్యూస్ : సోమవారం నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో స్థానిక ప్రభుత్వ సాంకేతిక కళాశాల విద్యార్థులు వుయ్ వాంట్ జస్టిస్, శక్తి స్కీం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులంతా రాస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు.
విద్యార్థుల ధర్నాకు నందిపేట మండల బిఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మాట్లాడుతూ…. ప్రభుత్వం దుర్మార్గంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేస్తుందని, ఐటిఐ విద్యార్థులతో సమానంగా పరిగణించే విధంగా శక్తి పథకం పేరుతో ప్రయోగాలు చేయడం సమంజసం కాదని సాంకేతిక విద్యార్థులు మూడు సంవత్సరాలు ఎంతో కష్టపడి ఉత్తమ విద్యను అభ్యసిస్తామని
ఈ శక్తి పథకం ద్వారా బీటెక్ వెళ్లేందుకు అడ్డంకులు ఎదురవుతాయని, సాధారణ విద్యార్థుల లాగే మేము కూడా బీటెక్ ప్రవేశ పరీక్షలను రాయాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం పునరాలోచించి ఈ యొక్క స్కీంను ఎత్తివేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Education
|nandipet భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి


భావితరం మీదే… బంగారు బాట వేసుకోవాలి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర సాంకేతిక కళాశాలలో శనివారం హెచ్, జె, డబ్ల్యు, హెచ్ఆర్సీ. (సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) సంస్థ ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనల అంశాలపై అవగాహన కల్పిస్తూ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి యువతరం ఖచ్చితమైన దృఢ సంకల్పాలు, సరైన అవగాహనలు లేక వారి భవిష్యత్తుకు మార్గం వెతుక్కోవడం లేదని, విలాసాల కొరకు రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడి ఆరోగ్యపరంగా, సామాజికపరంగా తప్పులు చేస్తూ వారి బంగారు భవిష్యత్తును చిద్రం చేసుకుంటున్నారని, అటువంటి యువత మంచి సన్మార్గంలో నడిచేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. రాబోయే భవితరం మీదేనని, దాని కొరకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
కలలు కంటే కళ్ళ ముందుకు ఏదీ రాదని, ఆ కళల సహకారం కొరకు కష్టపడితేనే విజయం కాళ్ల ముంగటికి నడిచొస్తుందని వివరించారు, ప్రతి ఒక్కరూ మనకన్నా ఉన్నత శిఖరాలను జయించిన వారిని ఆదర్శంగా తీసుకొని, శ్రమించాలని అప్పుడే మన పై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు, గురువులు, శ్రేయోభిలాషులకు మనపై నమ్మకం పెరిగి మనకు సహకారం అందిస్తారని తెలిపారు.
సమాజంలో జరుగుతున్న ప్రతి చిన్న విషయం పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఏది మంచి ఏది చెడు అనేది నిర్ణయించుకునే సత్తా కలిగి ఉండాలని. అప్పుడే ఎవరి చేతిలో మోసపోకుండా ఉంటారని గుర్తు చేశారు.
కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్, మండల కేంద్ర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్వాతి, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు, హెచ్ జె డబ్ల్యూ హెచ్ఆర్సీ సంస్థ జిల్లా అధ్యక్షులు బోయిన శ్రీధర్, నిజాంబాద్ జిల్లా వైస్ చైర్మన్ కట్ట రాజు, నoదిపేట మండల చైర్మన్ సంజీవ్, హెల్త్ సూపర్వైజర్ భాస్కర్, కళాశాల అధ్యాపకులు అధ్యాపకురాల్లు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Education
| balkonda పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు


పొలంలో కలుపు తీసిన మోడల్ స్కూల్ విద్యార్థులు
జనం వెలుగు బాల్కొండ: – బాల్కొండలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో 9వ తరగతి విధ్యార్థులు వొకేషనల్ ఎడ్యుకేషన్ (అగ్రికల్చర్) లో భాగంగా బుధవారం పొలంలో కలుపు తీయించారు. అదే విధంగా పొలంలో వచ్చే రోగాలు, కలుపు నివారణలపై విద్యార్థులకు పిల్లలకు వొకేషనల్ శిక్షణలో వివరించి చెప్పడం జరిగింది. విద్యార్థులకు పొలంలో కలుపును ఎలా తియ్యాలో నేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్, కౌమూది తదితరులు పాల్గొన్నారు.








