Politics
రాహుల్ పాదయాత్రను ప్రజలు సమస్యల డిమాండ్ కోసం వినియోగించుకోవాలి
రాహుల్ పాదయాత్రను ప్రజలు సమస్యల డిమాండ్ కోసం వినియోగించుకోవాలి . దేశవ్యాప్త చర్చకు జనం సిద్ధపడితే రాజకీయ పార్టీలు జాగ్రత్త పడుతాయి.
వడ్డేపల్లి మల్లేశము 9014206412
జనం వెలుగు:- అధికారంలో ఉన్న పార్టీలు ఏవైనా అవకాశవాద రాజకీయాలకు మాత్రమే ప్రయత్నం చేస్తాయి అనేది గత కొంతకాలంగా మనం భారతదేశంలో గమనించవచ్చు . ఒక ప్రభుత్వ హయాములో చేపట్టిన కార్యక్రమాలు, అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు , ప్రజల సమస్యలను పరిష్కరించకుండా తప్పుడు విధా నాలకు పాల్పడుతున్న తీరును ప్రతిపక్షాలు గమనిస్తే చాలా మంచిది . ఒక ప్రభుత్వ విధానం ప్రజలకు నచ్చనప్పుడు ఇతర రాజకీయ పార్టీల వైపు ప్రజలు చూస్తారు అనేది ప్రజాస్వామ్యంలో కనీస సంప్రదాయం . ఆ రకంగా ఆలోచించి ప్రభుత్వ తప్పిదాలను దుర్మార్గపు రాజకీయ ధోరణులను పసిగట్టి రాబోయే కాలంలో పరిపాలనకు రావడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇతర రాజకీయ పార్టీలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే ప్రజలు లాభ పడతారు. రాజకీయ పార్టీలు కూడా ప్రక్షాళన చెందుతాయి. ప్రధానంగా బలమైన రెండు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా తప్పులను సవరించుకోవడానికి మెరుగైన పాలన అందించడానికి ప్రజలు ప్రశ్నించడానికి అవకాశం చిక్కుతుంది. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల పరిస్థితులను గమనించినప్పుడు రెండు రాజకీయ పార్టీలు బలంగా పనిచేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్న విషయాన్ని కాదనలేము. ప్రజాసేవలో పోటీ పడడంతో పాటు తమ పార్టీ ఉనికిని ప్రభుత్వ అధికారాన్ని శాశ్వతం చేసుకొనే క్రమంలో అవలంబిస్తున్న ఎత్తుగడలకు కూడా రెండు పార్టీల ధోరణి చాలా దోహదపడుతుంది. ఇక ప్రభుత్వ విధానాలు ప్రజలకు నచ్చనప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సంప్రదింపులు , విమర్శలు నిరసనలు, ధర్నాలు సమ్మెలతో అట్టుడికి పోతుంటే మిగతా రాజకీయ పార్టీలు జాగ్రత్త పడడమే కాకుండా రాబోయే కాలంలో ఆ తప్పులను సవరించుకోవడానికి రాబోయే మేనిఫెస్టోలో ప్రజల అభిమానాన్ని పొందడానికి రాజకీయ పార్టీలు జాగ్రత్త పడతాయి. అయితే కొన్ని విషయాలలో మాత్రం అధికార ప్రతిపక్షాల తీరు ఒకే రకంగా ఉండడం బాధాకరం . నిర్బంధం అణచివేత, పెట్టుబడిదారి విధానానికి వంత పాడడం, కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించడం, సంపన్నుల పక్షాన పని చేయడం వంటి కొన్ని అంశాలలో అన్ని రాజకీయ పార్టీల విధానం ఒకే మాదిరిగా ఉండడాన్ని ప్రజలు తమ నిరసనల ద్వారా సార్వత్రిక సమ్మెల ద్వారా పోరాటాల ద్వారా అడ్డుకోకపోతే అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలకే పాల్పడతాయి అనేది గత కొంతకాలంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది . ఈ నేపథ్యంలో ప్రస్తుత బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తూనే వ్యతిరేక అంశాల పైన చర్చించడానికి ప్రశ్నించడానికి డిమాండ్ చేయడానికి రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రను ఒక వేదికగా ఉపయోగించుకోవడానికి ప్రజలు సిద్ధపడితే కొంతవరకు పరిష్కారం లభించవచ్చునేమో!. అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న విధానాలు, కావలసినటువంటి ప్రత్యామ్నాయ ఆలోచనలు, మెరుగైన పరిపాలన గురించినటువంటి అంచనా ప్రజలు ప్రజాస్వామిక వాదులకు ఉన్నప్పుడు మాత్రమే జాతీయస్థాయిలో ప్రతిపక్ష మైనటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. దానికి రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో చర్చకు వచ్చిన కొన్ని విషయాలు :-
అక్టోబర్ 28 గురువారం,2022 రోజున మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగిన రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంగా ఉపాధ్యాయ విద్యార్థి మేధావి పలు ప్రజా సంఘాలతో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ స్పందించిన అంశాల పైన మనం చర్చించుకోవడం కూడా అవసరం. ప్రధానంగా సంక్షేమ రాజ్యమైన భారతదేశంలో విద్యా వైద్య రంగాల పైన పెద్ద మొత్తంలో బడ్జెట్ నిధులు కేటాయించవలసిన ప్రభుత్వాలు ఈ రెండు రంగాలను ప్రైవేటుపరం చేసి నిర్లక్ష్యం చేస్తున్న విధానాన్ని ఎండగట్టవలసిన అవసరం ఉన్నది .ఈ అంశాల పైన ప్రస్తావించిన రాహుల్ గాంధీ వాస్తవంగా వైద్యం విద్యా రంగాలపైన కనీస స్థాయిలో కూడా బడ్జెట్ కేటాయించకపోవడాన్ని ఆమోదిస్తూనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2024 మేనిఫెస్టోలో రెండు రంగాలకు కూడా 15% చొ నిధులను కేటాయించడానికి హామీ ఇచ్చిన విషయాన్ని మనం పరిశీలించాలి . ప్రస్తుతం ఈ రెండు రంగాలకు కనీసం ఐదు శాతం లోపునే కేటాయిస్తున్న పరిస్థితులను గమనిస్తే ప్రజలు ఏరకంగా మోసపోతున్నారు. బడ్జెట్ విషయాలపైన అవగాహన లేక ప్రజలు ప్రైవేట్ రంగంపై ఆధారపడి తమ కొనుగోలు శక్తిని నష్టపోతున్న విషయాన్ని చర్చించవలసిన అవసరం చాలా ఉన్నది .ఇదే సందర్భంలో మాట్లాడుతూ పర్యావరణ కాలుష్యాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి అనేక కంపెనీలను నిర్మూలించే దిశగా కృషి జరగాల్సిన అవసరాన్ని రాహుల్ గాంధీ అంగీకరించిన విషయం కూడా మరువకూడదు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనాదిగా భూమిపైన హక్కులు లేకుండా అటవీ పోలీసు పౌర అధికారుల దుశ్చర్యలకు బలవుతున్నటువంటి ఆదివాసీలకు పోడు భూముల పైన అధికారాన్ని కట్టబెడతామని పట్టాలిచ్చి ఆదుకుంటామని చేసిన ప్రకటన కూడా ఎంతో కాలంగా ప్రజలు చేస్తున్న డిమాండ్ కు స్పందించినదే .
కీలక అంశాల పైన మనం ప్రశ్నించాలి :-
సామ్యవాద తరహా ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా కొనసాగవలసినటువంటి భారతదేశంలో రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ప్రవేశికలోని కీలక అంశాలు వాస్తవంలో ఆచరణకు నోచుకోకపోవడాన్ని ప్రధానంగా కాంగ్రెస్ ముందు ప్రశ్నించాలి. లౌకిక వాదం కనుమరుగై, సార్వభౌమాధికారం సాగిలబడి, పెత్తందారుల రాజ్యం కొనసాగుతూ ఉంటే ఆదేశిక సూత్రాల్లో రాసుకున్నటువంటి సంపద కేంద్రీకరించకూడదు అన్న మాట నీటి మూటగా మారిన విషయాన్ని ప్రశ్నించకుండా ఎలా ఉండగలం?. ఈరోజు దేశవ్యాప్తంగా ఆదిపత్య వర్గాల చేతిలోనే అధికారము, పార్టీల నాయకత్వం, పరిపాలన, సంపద కొనసాగుతుంటే బహుజనులుగా ఉన్నటువంటి 85 శాతం ప్రజలు ఏ అవకాశాలకు నోచుకోకుండా రాజ్యాంగ పలాలు అందుకోకుండా పేదలు మరీ పేదలుగా మారుతున్న విషయాన్ని కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. స్పష్టమైన యువజన విధానం లేనటువంటి అనేక రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ యువత విస్మరణకు గురవుతుంటే స్పష్టమైన యువజన విధానాన్ని ప్రకటించడం ద్వారా నిరుద్యోగాన్ని నిర్మూలిస్తూనే ఉపాధి కల్పన అవకాశాలను మెరుగుపరచవలసిన బాధ్యత కూడా రాబోయే ప్రభుత్వం పైన ఉన్నది . ఈ సమగ్రమైన విషయాలన్నింటిపైన కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధపడితే భవిష్యత్తులో అవకాశాలు ప్రజలకు ఉంటాయి అనే విషయాన్ని పాదయాత్రలో ఎక్కడికక్కడ ప్రజలు ప్రజాస్వామిక వాదులు దృష్టికి తేవాల్సిన అవసరం ఉంది .
చావు తప్పి కన్ను లొట్టబోయిన మాదిరిగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కారణాలు ఏవైనా చతికిలబడిపోయిన వేళ జరుగుతున్నటువంటి పాదయాత్రను ప్రజలు ప్రజాస్వామికవాదులు అవకాశంగా ఉపయోగించుకుని ఇంతకాలం విస్మరించినటువంటి అంశాలతో పాటు ప్రస్తుత బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వము తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాల పైన కూడా కాంగ్రెస్ పార్టీతో చర్చిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల నాటికైనా సమీక్షించుకొని ప్రక్షాళన చేసుకుని ప్రజల వైపుగా ఆలోచిస్తారు అనేది చాలామంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం కొన్ని డిమాండ్లు.
-ప్రైవేటు పరం చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను వెంటనే ప్రభుత్వం ఆధీనపరచుకొని ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాలి.
-కార్మిక కర్షక విధానాలను ప్రభుత్వం సమీక్షించుకునేలా ఒత్తిడి చేయాలి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరంతరము జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెల లోని అంతరార్థాన్ని పాలకులు గుర్తించే విధంగా ఒత్తిడి తేవాలి.
-ప్రస్తుతము నాలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనటువంటి మద్యపాన నిషేధాన్ని కేంద్ర పార్లమెంటులో చట్టం చేయడంతో పాటు రాష్ట్రాలను ఒప్పించి దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి.
-జీవిత బీమా, రైల్వేలు, ఓడరేవులు, రక్షణ రంగము, అంతరిక్షరంగము వంటి కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలి .
-ప్రజలు ప్రజాస్వామికవాదులు మానవ హక్కుల కార్యకర్తల పైన దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి నిర్బంధము అణచివేత మారణకాండను వెంటనే ఆపివేయాలి. ఆ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ పూనుకోవడంతో పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ప్రకటించి ప్రజల పక్షాన నిలబడాలి . వలస కార్మికులను పట్టించుకోవడంతోపాటు పేదరికం నిరుద్యోగం ఆకలి చావులు ఆత్మహత్యల వంటి సామాజిక రుగ్మతల పైన ప్రత్యేక కమిటీని వేసి వీటి నిర్మూలనకు కృషి చేయాలి.
-దారిద్రరేఖ దిగువన ఉన్న శాతాన్ని 20 నుండి కనీసం గా తగ్గించి ఆర్థిక అంతరాలు అసమానతలను నిర్మూలించి, వివక్షత లేకుండా , సమానత్వాన్ని సాధించాలి . ఆ వైపుగా కృషి చేయడానికి స్పష్టమైన హామీ ఇవ్వాలి . రాజకీయ పార్టీలు బరితెగించి స్వార్థ ప్రయోజనాలకు పని చేస్తూ అరాచక వాదాన్ని సృష్టిస్తూ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి మరింత అధికారాన్ని ఇచ్చే విధంగా పార్లమెంట్లో నూతన చట్టం తేవాలి. పార్టీ ఫిరాయింపులను నిషేధించే దిశగా సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది .అలాగే ఇటీవల మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ గారు చేసిన హెచ్చరిక పార్లమెంటుకు కనువిప్పు కావాలి .చర్చలు సంప్రదింపులు లేకుండానే బిల్లుల ఆమోదాన్ని నిందించిన విషయం మన అందరికీ తెలిసినదే కదా!
ప్రస్తుతము జాతీయస్థాయిలో బిజెపి ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పై లోపాలను సమస్యలను అవగాహన చేసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి స్పష్టమైన హామీ ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు ఎక్కడికక్కడ డిమాండ్ చేస్తే తన ఉనికి కోసం, ప్రజల కోసం, ఆత్మ రక్షణ కోసం, అనివార్యమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఆలోచించక తప్పదు. పై డిమాండ్లను అంగీకరించకపోతే ప్రజలు చీ త్కరిస్తారని ఎన్నికల్లో ఓడిపోతామనే సోయి ఇటు బిజెపి ప్రభుత్వానికి అటు కాంగ్రెస్ తదితర పార్టీలకు కూడా భయం పట్టుకుంటేనే ప్రజలు గెలుస్తారు. ప్రజలను ప్రభువులు గా చూసే వ్యవస్థ రావాలి. కానీ యాచకులుగా బానిసలుగా చూచే ప్రస్తుత విధానానికి చరమగీతం పాడాలంటే దేశవ్యాప్తంగా ప్రజలు విభిన్న వర్గాల వారు ఎక్కడికక్కడ చర్చలు సంప్రదింపులు ప్రశ్నలు ప్రతిఘటనలతో పాటు నిరసన ఉద్యమాలను కొనసాగిస్తే తప్ప ఈ దేశంలో రాజకీయ పార్టీలు తమ రంగును మార్చుకోవు . సుపరిపాలన అందించే క్రమంలో ప్రజల పక్షాన ఆలోచించిన వారికే ఓటు అని ప్రజలు నినదించిన నాడు ఆచరణలో చూపి సమర్థులు లేకపోతే ఓటును నిరాకరించిన రోజున కచ్చితంగా రాజకీయ పార్టీలు ప్రక్షాళన చేసుకుని ప్రజల కోణంలో ఆలోచించడానికి ముందుకొస్తాయి. ఆ వైపుగా కృషి జరగాలని ప్రజా పోరాటం కొనసాగాలని ఆశిద్దాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమనేత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )
Politics
| armoor బిసి రిజర్వేషన్లను కాంగ్రెసు అమలు చేసింది


తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్.
జనం వెలుగు ఆర్మూర్:- గత ఎన్ని కలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతానికి (మించి) ఎక్కువగా బిసిలకు రిజ ర్వేషన్లను కల్పించిందని తెలంగాణ రాష్ట్ర ఖనిజా భివృద్ది సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నాడు. ఆర్మూర్ మున్సిపా లిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడాడు. రాష్ట్ర అసెంబ్లీలో బిసి బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోద కోసం పంపితే, బిసి బిల్లును కేంద్రం అమలు చేయకుండా మొండి చేయి చూపిందని ఆయన తెలిపాడు. ఇకపోతే బిసిలకు రిజర్వేషన్లను కల్పించవద్దని మాధవ రెడ్డితో బిఆర్ఎస్ పార్టీ హై కోర్టులో పిటీషన్ వేయించిందని ఆయన తెలిపాడు. బిసి బిల్లును కేంద్రానికి పంపి ఏడాది అవుతున్న బిసి బిల్లు పాస్ చేసి బిసిలకు సహకరించడం లేదని ఆయన ఆరోపించాడు. రాష్ట్రంలో బిసిలు 56 శాతం మంది ఉండగా 30 రిజర్వేషన్లను పాటి స్తూ పార్టీ తరపున 36 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, మొత్తానికి 62 శాతం కాంగ్రెసు పార్టీ బిసిలకు రిజర్వేషన్లను కల్పించడం జరిగిందని ఆయన తెలిపాడు. ఆర్మూర్ ఎంఎ ల్ఏ రాకేష్ రెడ్డిని, ఎంఎల్ఏగా ఎం దుకు ఎన్నుకున్నామా అని ఆర్మూర్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నాడు.
సమాచారం ఇచ్చి 18 వ కేసు పెట్టు.
—————————————-
కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి.
ఆర్మూర్‌లో అవినీతికి పాల్పడినానని, సి-కన్వెన్షన్ పై మాట్లాడడం సరికాదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డిపై ఆర్మూర్ నియోజకవర్గపు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆర్మూర్ లో నీవు ఈపాటికే 17 కేసులు అయిపోయి నాయని జీవన్ రెడ్డి అన్నాడని 18 వ కేసును తమకు సమాచారం ఇ చ్చిన తర్వాతనే పెట్టాలనీ ఆయన డిమాండ్ చేశాడు. ఆర్మూర్ ఎంఎల్ ఏ పైడి రాకేష్ రెడ్డి అభివృద్ధిపై మాట్లాడాలని ఆయన అన్నాడు. కామారెడ్డిలో పోయి పనికిరాని మాటలు మాట్లాడడం కాదని ఆయన అన్నాడు. ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెసు పార్టీ అని ఆర్మూర్ ను అభివృద్ధి చేసేందుకు ఆర్మూర్ ప్రజల మన్ననలను పొందేందుకు గాను 130 ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను సిఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశాడని ఆయన తెలిపాడు.
Politics
| armoor ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెసుకు బుద్ది చెప్పండి


బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెసు,బిజెపిల నాయకులు
జిల్లాలో 7 మున్సిపాలిటీలను,ఒక కార్పొరేషన్ గెలుచుకుంటాం
మాజి ఎంఎల్ఏ జీవన్ రెడ్డి
జనం వెలుగు ఆర్మూర్:- అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికలలో కాం గ్రెసు పార్టీ ప్రజలకిచ్చిన హామీలను, అమలు చేయని కాంగ్రెసు పార్టీకి గ ట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్న మైనదని ఆర్మూర్ మాజి ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి అన్నాడు. కాంగ్రెసు, బిజె పి పార్టీల నుండి బుధవారం బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి ఆయన ఆహ్వానించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. జిల్లాలోని 7 మున్సి పాలిటీలను, ఒక కార్పొరేషన్ ను గెలుచుకుంటామని, అలాగే ఆర్మూర్ లోని 36 వార్డులను బిఆర్ఎస్ గెలు పొందుతొందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. వృద్దాప్య పింఛన్లను 2000 నుండి 4000 పెంచుతామని, మహిళలకు 2500 చేయూత పింఛన్లను, కళ్యాణ లక్ష్మిలో లక్ష రూపాయలతో తులం బంగారం, రైతు భరోసా తథితర అంశాలను కాంగ్రెసు పార్టీ అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆయన దుయ్యబ ట్టాడు. ఆర్మూర్ పట్టణంలో 27 వార్డు నుండి ఎస్ఆర్ రమేష్, 21 నుండి నడుకుడ నాగరాజు, 9 వార్డు భూమేష్, 7 వార్డు కీర్తి గౌడు, 32 వార్డు సుకేష్ లు బిఆర్ఎస్ పార్టీలో చేరారని ఆయన చెప్పాడు. హామీలను ఆటకెక్కించిన కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు ద్వారా ధీటైన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చాడు.



Politics
| Nizamabad అన్నపూర్ణగా వెలిగిన నిజామాబాద్ ఎందుకు వెనుకబడింది


మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఆత్మపరిశీలన అవసరం:డాక్టర్ కేశవులు ప్రత్యేక కథనం
జనం వెలుగు, నిజామాబాద్: ఒకప్పుడు తెలంగాణకు అన్నం పెట్టిన జిల్లాగా “అన్నపూర్ణ”గా పేరొందిన నిజామాబాద్ నేడు అభివృద్ధి విషయంలో వెనుకబడి ఉండటం బాధాకరమైన వాస్తవమని తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, నిజామాబాద్ జిల్లా డెవలప్మెంట్ ఫోరం చైర్మన్ మరియు సీనియర్ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కేశవులు అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుని రాజకీయ పార్టీలను స్పష్టమైన ప్రశ్నలు అడగాల్సిన అవసరం ఉందని ఆయన తన ప్రత్యేక కథనంలో పేర్కొన్నారు.
చుట్టుపక్కల జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, సిరిసిల్ల, అదిలాబాద్ అభివృద్ధిలో దూసుకెళ్తుండగా, అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ నిజామాబాద్ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. ఈ పరిస్థితికి ఒకే పార్టీ కారణం కాదని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు.
రాజకీయ సంకల్పం లోపమే వెనుకబాటుకు మూలకారణం
నిజామాబాద్ అభివృద్ధికి 10–20 ఏళ్ల దీర్ఘకాలిక విజన్ ప్లాన్ ఏ ప్రభుత్వమూ రూపొందించలేదని డాక్టర్ కేశవులు విమర్శించారు. తాత్కాలిక పథకాలకే పరిమితమై, పరిశ్రమలు, ఉపాధి, పట్టణ విస్తరణపై సమగ్ర ఆలోచన లేకపోవడం ప్రధాన లోపమన్నారు. అభివృద్ధికంటే రాజకీయ లాభనష్టాలకే ప్రాధాన్యం ఇచ్చారని వ్యాఖ్యానించారు.
వ్యవసాయ సంపద ఉన్నా విలువ జోడింపు లేదు
వరి, పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన పసుపు మార్కెట్ ఉన్నా, అగ్రో-ప్రాసెసింగ్ పరిశ్రమలు ఎందుకు రాలేదన్నది ప్రధాన ప్రశ్నగా నిలుస్తోందన్నారు. పసుపుకు ఇక్కడే విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేయలేకపోవడంతో రైతుకు గిట్టుబాటు ధర, పట్టణానికి ఉపాధి కల్పించడంలో వైఫల్యం జరిగిందన్నారు. వ్యవసాయం ముడి సరుకుగానే బయటకు వెళ్లి, లాభాలు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
మౌలిక వసతులు – మధ్యలో ఆగిపోయిన అభివృద్ధి
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలే కాదని, రైల్వే హబ్‌గా మారే అవకాశమున్నా సరైన లాబీయింగ్ జరగలేదన్నారు. జాతీయ రహదారులు, ఇండస్ట్రియల్ కారిడార్లలో నిజామాబాద్‌కు తగిన ప్రాధాన్యం దక్కలేదని, పట్టణ విస్తరణ మాస్టర్ ప్లాన్లు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇతర జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీ హబ్‌లు, మెడికల్, ఎడ్యుకేషన్ క్లస్టర్లు ఏర్పడితే, నిజామాబాద్‌లో మాత్రం వాగ్దానాలే మిగిలాయన్నారు.
*మున్సిపాలిటీ ఎన్నికలు: అభివృద్ధి ఎజెండా ఎక్కడ?*
ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ నిజామాబాద్ అభివృద్ధిపై స్పష్టమైన ఎజెండా కనిపించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ విద్వేషాలే ప్రచారంగా మారాయని, పట్టణ భవిష్యత్తుపై చర్చే లేకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఎన్నికలు వ్యక్తుల కోసం కాదు, పట్టణ భవిష్యత్తు కోసం కావాలని సూచించారు. ఈ ఎన్నికల ముందు ప్రజలు రాజకీయ పార్టీల నుంచి స్పష్టమైన హామీలు కోరాలని డాక్టర్ కేశవులు పిలుపునిచ్చారు. “మాకు పార్టీ రంగు కాదు… మాకు నిజామాబాద్ భవిష్యత్తు కావాలి” అన్నది ప్రజల నినాదంగా మారాలన్నారు. అభివృద్ధిపై మాట్లాడని నాయకత్వాన్ని ప్రజలు తిరస్కరించాలని, ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నిజామాబాద్‌కు టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన ఆకాంక్షించారు.
అన్నపూర్ణగా వెలిగిన ఈ జిల్లా మళ్లీ తెలంగాణ అభివృద్ధి పటంలో ముందు వరుసలో నిలవాలంటే ప్రజల ఆత్మగౌరవంతో కూడిన ప్రశ్న అవసరమని డాక్టర్ కేశవులు స్పష్టం చేశారు. ఇది రాజకీయ వ్యాసం కాదని, నిజామాబాద్ భవిష్యత్తుపై ప్రజల డిమాండ్ అని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ కేశవులు భాషవత్తిని, ఎండీ (సైకియాట్రీ)
చైర్మన్: తెలంగాణ మేధావుల సంఘం & నిజామాబాద్ జిల్లా డెవలప్మెంట్ ఫోరం











