Connect with us

Crime

అక్బర్ నగర్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి

janamvelugunews

Published

on

అక్బర్ నగర్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి

జనంవెలుగు, రుద్రూర్:- రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం అక్బర్ నగర్ గ్రామంలోని గుట్ట ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సాయన్న తెలిపిన వివరాల ప్రకారం, అక్బర్ నగర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ప్రతిరోజూ పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో రుద్రూర్ పోలీసులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1100 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సాయన్న మాట్లాడుతూ, పేకాట నిర్వహించిన వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు కొనసాగితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Crime

పేకాట స్థావరంపై పోలీసుల దాడి – ఏడుగురు అరెస్ట్

janamvelugunews

Published

on

పేకాట స్థావరంపై పోలీసుల దాడి – ఏడుగురు అరెస్ట్

జనంవెలుగు, నందిపేట్ : నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవీపట్నం గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ విషయం పై ఎస్సై శ్యాంరాజ్ వివరాలు వెల్లడిస్తూ, విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు తెలిపారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.21,600 నగదు, ఆరు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై శ్యాంరాజ్ సూచించారు.

Continue Reading

Crime

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – ఎస్సై సాయన్న

janamvelugunews

Published

on

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి – ఎస్సై సాయన్న

జనంవెలుగు, రుద్రూర్:- యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రుద్రూర్ ఎస్సై సాయన్న సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ఆహార సాంకేతిక కళాశాల విద్యార్థులకు మంగళవారం గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తు అని, గంజాయి, మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని విద్యార్థులను హెచ్చరించారు. అలాంటి వ్యసనాలు వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడంతో పాటు కుటుంబాలను కూడా దుస్థితికి గురిచేస్తాయని తెలిపారు. విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకుని చదువులో, క్రీడల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Continue Reading

Crime

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

janamvelugunews

Published

on

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

జనంవెలుగు, నందిపేట్:- గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలు కాపాడేందుకు నందిపేట్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 2వ తేదీ అర్థరాత్రి నందిపేట్ మండలం ఐలపూర్ గ్రామంలో రెండు డీజే సౌండ్ సిస్టంలు పరిమితికి మించి శబ్దం చేయడంతో ప్రజలకు ఇబ్బందులు కలిగాయి. వెంటనే నందిపేట్ ఎస్‌ఐ స్పందించి డీజే లను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో డీజే నడిపిన వ్యక్తులు, డీజే ఓనర్లు, అలాగే గణేష్ మండలి నిర్వాహకులపై పెద్ద కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ సర్కిల్ సీఐ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ – ఉత్సవాల సమయంలో సౌండ్ పరిమితిని మించడం వల్ల విద్యార్థులు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హెచ్చరించారు. అలాగే డీజే సౌండ్ పరిమితి మించడం, మద్యం సేవించడం, అల్లర్లు చేయడం వంటి చట్టవిరుద్ధ చర్యలు చేసిన వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ రూరల్ సీఐ తెలిపారు.

పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ – గణేష్ ఉత్సవాలను భక్తి భావంతో, సాంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. సమాజంలో శాంతి భద్రతలు కాపాడేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.

Continue Reading