Telangana
రైతుబంధు నగదు పడినా.. ఇవ్వని బ్యాంకు అధికారులు.. లబోదిబోమంటున్న రైతులు.. కారణం ఏంటంటే..!?


Views: 0
రైతుబంధు నగదు పడినా.. ఇవ్వని బ్యాంకు అధికారులు.. లబోదిబోమంటున్న రైతులు.. కారణం ఏంటంటే..
తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతుబంధు సాయాన్ని గత నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం ప్రారంభించింది ప్రభుత్వం. ప్రస్తుతం యాసంగిలో పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకంలో జమచేస్తున్న డబ్బును బ్యాంకులు నిలిపివేస్తున్నాయి. ఎందుకంటే సదరు రైతు బ్యాంకుకు బాకీ ఉండటంతో ఆ మొత్తాన్ని బ్యాంకు బాకీ కింద పట్టేసుకుంటున్నాయి. అయితే గత పది రోజుల్లో 54.70 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.4,327.93 కోట్లను వ్యవసాయశాఖ జమచేసింది. కానీ రైతు పంట రుణం పాత బాకీ ఉన్నందున ఖాతాలో పడిన రైతుబంధు నగదును బ్యాంకులోంచి తీయకుండా నిలిపివేస్తున్నామని, బాకీ ఉన్న డబ్బులు చెల్లిస్తేనే విడుదల చేస్తామని కొన్ని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి.
ఇవే కాకుండా గత వానాకాలంలో పండించిన వరిధాన్యాన్ని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఆ డబ్బులు కూడా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వారి బ్యాంకు అకౌంట్లో జమచేస్తోంది. ఆ డబ్బు కూడా పాత బాకీ ఖాతాలకే బ్యాంకులు మళ్లిస్తున్నాయట. ఇలా పాత బాకీ ఉన్నందున ఖాతాలో పడిన రైతుబంధు పథకం డబ్బులను నిలిపివేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే బ్యాంకులకు పాత బకాయీలు ఉన్నా.. రైతుబంధు పథకం డబ్బులు నిలిపివేయవద్దని, రైతులకు ఇచ్చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ బ్యాంకులను ఆదేశించినా బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెబుతున్నారు.
రాష్ట్రంలో చాలా మంది రైతుబంధు బ్యాంకులోనే నిలిపివేత
ఇలా రాష్ట్రంలో చాలా మంది రైతుల రైతుబంధు సాయాన్ని బ్యాంకులోనే ఉండిపోయాయని, బ్యాంకుకు ఉన్న పాత బాకీ ఉన్నందున ఆ డబ్బులు విత్‌డ్రా చేయకుండా బ్యాంకులు నిలిపివేస్తున్నాయని చాలా మంది రైతులు వాపోతున్నారు. పాత బాకీతో ముడిపెట్టకుండా రైతులు రైతుబంధు నగదును విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఆదేశించినా బ్యాంకులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలా పాతబాకీ ఉన్నందున డబ్బులు నిలిపివేస్తే పంట సాగుకు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. తాము రిజర్వుబ్యాంకు నిబంధనలనే పాటిస్తామని, పాతబాకీలు కట్టనివారి పొదుపు ఖాతాల్లో ఉన్న సొమ్మును విడుదల చేయకుండా నిలిపివేసే అధికారం తమకు ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.
విచారణ చేపట్టి అధికారులపై చర్యలు తీసుకుంటాం: మంత్రి హరీష్‌రావు
ఇలాంటి అంశాలపై రైతులకు ఇబ్బందులు కలుగకుండా మంత్రి హరీష్‌రావు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వము పంట పెట్టుబడి సహాయం కింద రైతులకు జమ చేసిన డబ్బును బ్యాంకులో పాత బకాయిలు కింద జమ చేసుకోవడానికి సంబంధించి విచారణ చేపట్టి వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎల్బీసీ (స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ) సెక్రెటరీని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. భవిష్యత్తులోభవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన చోటు చేసుకోకుండా అన్ని బ్యాంకులకు ఎస్ఎల్బీసీ మార్గదర్శకాల ప్రకారం రైతుబంధు పంట పెట్టుబడి సహాయాన్ని పాత బకాయిల కింద జమచేయకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించవలసిందిగా మంత్రి ఆదేశించారు.
బ్యాంకులో రైతుల నగదు నిలిచిపోకుండా చూస్తాం: నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
రాష్ట్రంలో ఇప్పటికే 54 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం నగదు జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఏ బ్యాంకులోనైనా ఖాతాలను నిలిపివేస్తే రైతులు వెంటనే సమీపంలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. బ్యాంకుకు వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడి రైతుల ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు ఇస్తామన్నారు. అయితే యాసంగి వేళ రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే సదాశయంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యయప్రయాలసకోర్చి రైతుబంధు కింద రూ.7 వేల కోట్లను దశలవారీగా రైతుల ఖాతాల్లో జమచేస్తోందని అన్నారు.
Telangana
అనర్హులకు కోత పెడతాం…


Views: 78
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులిస్తాం
-సమాచార శాఖ మంత్రి పొంగులేటి
జనం వెలుగు, హైదరాబాద్:- జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు భారీగా తగ్గిస్తున్నట్లు వస్తున్న వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని, అయితే ఎంతో గౌరవప్రదమైన అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న వారి ఆగడాలకు మాత్రం ఖచ్చితంగా బ్రేక్ వేసి, అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు అందించేలా పగడ్భందీ చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేసారు. శనివారం నాడు సచివాలయంలోని తన ఛాంబర్ లో, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ ప్రియాంక, ముఖ్యమంత్రి చీఫ్ పిఆర్ఓ మల్సూర్ లతో కలిసి నిర్వహించిన జర్నలిస్టు సంఘాల ప్రధాన బాధ్యుల సమావేశంలో మాట్లాడారు. 252 జీవో లో కొన్ని లోటు పాట్లపై జర్నలిస్టు సంఘాలు చేస్తున్న సూచనలను పరిగణలోకి తీసుకొని వాటిని సరిచేసేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ మాట్లాడుతూ, గతంలో డెస్క్ జర్నలిస్టులందరికీ కాకుండా, కొందరికే న్యాయం జరిగేదని, ప్రస్తుతం అలా కాకుండా, బస్ పాస్ లతో సహా ప్రభుత్వం కల్పించే ప్రతి సంక్షేమ పథకం రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులనే తేడా లేకుండా, ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి డెస్క్ జర్నలిస్టుకు వర్తింపజేసేలా జీవో లో స్పష్టత ఇవ్వాలని కోరారు. కేబుల్ టీవీ ఛానెల్స్ కు సంబంధించి, జీవో లో నెలకొన్న అస్పష్టతను తొలగించాలని విజ్ఞప్తి చేసారు.
గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు మండలానికి ఒకటి కాకుండా, ప్రధాన డేట్ లైన్ లను గుర్తించి, వాటి ప్రకారం అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలన్నారు. చిన్న పత్రికలకు గ్రేడింగ్ ఆధారంగా జిల్లాల్లో కూడా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలన్నారు. ప్రధాన పత్రికలు, శాటిలైట్ న్యూస్ ఛానెల్స్ కు కార్డుల కుదింపు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు, వీడియో జర్నలిస్టులకు, కెమెరా జర్నలిస్టులకు వారి కార్యాలయాల సిఫారసుల మేరకు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు జారీ చెయ్యాలన్నారు.
రాష్ట్రంలో ఉర్దూ అధికార భాషా కనక, ఇతర భాషల సర్క్యూలేషన్ లతో, గ్రేడింగ్ లతో వాటిని పోల్చకుండా, ఉర్దూ పత్రికలు సర్క్యూలెట్ అవుతున్న ప్రాంతాలను గుర్తించి, ప్రత్యేక కేటగిరి క్రింద జిల్లా, మండల స్థాయిల్లో ఉర్దూ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేలా జీవో లో పొందుపర్చాలని కోరారు. వెటరన్, ఫ్రీలాన్స్ జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డులు పొందడానికి, జీవో లో పేర్కొన్న వృత్తి అనుభవాన్ని కొంత తగ్గిస్తూ సవరించాలని విరాహత్ అలీ కోరారు. టీ యూ డబ్ ల్యూ జే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ మాట్లాడుతూ, అక్రెడిటేషన్ కార్డులకు ప్రభుత్వం కోత పెడుతుందని జర్నలిస్టుల్లో జరుగుతున్న చర్చకు ఇవాళ్టి సమావేశం ఫుల్ స్టాప్ పెడుతుందన్నారు. అక్రెడిటేషన్ కార్డులతో పాటు జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఆరోగ్య పథకం, ఇళ్ల స్థలాలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. ఇంకా ఈ సమాశంలో టీయుడబ్ల్యూజే-ఐజేయు అనుబంధ సంస్థలైన చిన్న,మద్య తరగతి పత్రికల సంఘం బాధ్యులు యూసుఫ్ బాబు, అశోక్, ఫోటో జర్నలిస్టుల సంఘం బాద్యులు గంగాధర్, కె.ఎన్.హరి, వీడియో జర్నలిస్టుల సంఘం బాధ్యులు నాగరాజు, హరి, ఉర్దూ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ బాద్యుడు గౌస్ మోహియుద్దీన్, మహిళా జర్నలిస్ట్స్ విభాగం బాద్యురాలు వాకాటి మంజుల లతో పాటు ఆయా ప్రధాన జర్నలిస్టు సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
Telangana
రెండేళ్ళలో ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేయండి


Views: 0
రెండేళ్ళలో ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేయండి: సిఎం రేవంత్ రెడ్డి
జనం వెలుగు, ఆర్మూర్:- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని రెండేళ్ళ లో పూర్తి చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించాడు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై ఉన్నత స్థాయి అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నాడు. భవిష్యత్తు తరాలకు తగినట్లు ఆధునాతన వైధ్య పరికరాలను సమకూర్చుకోవాలని, ఇందుకు సంబంధించి తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించాడు. ఆధునాతన పరికరాలను తగినట్లు గదులను, ల్యాబ్ లను ఇతర నిర్మాణాలు ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు ఆయన సూచించాడు. ఆసుపత్రి నిర్మాణ సమయంలో స్థానికులకు ఏలాంటి ఇబ్బందులు కలుగ కుండా చుట్టూ ముందు రోడ్డు నిర్మా ణం చేపట్టాలని ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతానికి వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసు, జిఎచ్ఎంసి, ఆర్ అండ్ బి, విద్యుత్తు తథితర అధికారులతో వెంటనే ఒక సమన్వయ కమిటిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించాడు. ఈ కమిటి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తు ప్రతి పది రోజుల కోసారి సమావేశమై ఏమైన సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటు పనులు వేగవంతం చేయాలని ఆయన తెలిపాడు. ఉస్మానియా ఆసుపత్రి పూర్తి అయ్యే వరకు అక్కడే బందో బస్తును నిర్వహిస్తు ట్రాఫిక్ విధుల నిర్వాహణకు ముందస్తుగా తగిన ప్రణాళికలను రూపొందించాలని ఆయన స్పష్టం చేశాడు. ఆసుపత్రికి వివిధ రహదారులను అనుసంధానించే ప్రణాళికలను ఇప్పటి నుండే రూపొందించాలని ఆర్ అండ్ బి, అధికారులకు ఆయన సూచించాడు. హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఆసుపత్రులు, మెడికల్ కాలేజీ లకు ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆయన తెలిపాడు. వచ్చే జూన్ నాటికి ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావాలని, నిర్మాణాల పై 24×7 ఆ అధికారి పర్యవేక్షించేలా పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించాలని ఆయన వివరించాడు.
ARTICLE'S
బలహీనమవుతున్న ప్రజల బ్రహ్మాస్త్రం


Views: 0
• ఘనంగా ఆర్టిఐ అమలు దినోత్సవం
• హాజరైన ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి ట్రైనర్ అష్రఫ్
• సహ రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కొండగుర్ల కమలాకర్
జనంవెలుగు, కొమరం బీమ్ ఆసిఫాబాద్:- కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల కేంద్రంలో సమాచార హక్కు చట్ట అమలు దినోత్సవాన్ని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టిఐ ఆక్టివిస్ట్లు ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి ట్రైనర్ అష్రఫ్, సహ రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ హాజరై మాట్లాడుతూ ప్రజల చేతిలో శక్తివంతమైన ఆర్టిఐ అస్త్రం బలహీనమవుతుందని అన్నారు. సమాచారం పొందడం ప్రతి ఒక్క పౌరుని రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. సహ చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం సాధ్యమన్నారు కానీ సహ చట్టం దేశంలో అమలు నేటితో 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, సహ చట్టం అమలులో, చట్టబలోపేతంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుందన్నారు. గ్రామస్థాయి వరకు గల ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార బోర్డులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం లేదన్నారు. సెక్షన్ 4 (1) (బి) ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన 17 అంశాలు సమాచారం అందుబాటులో ఉండడం లేదన్నారు. చట్ట నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులకు పిఐఓ, ఏపీఐవో లు సమాచారం అందించడం లేదన్నారు. దరఖాసుదారుల, ఆర్టిఐ కార్యకర్తల వివరాలు బహిర్గతం అవుతున్నాయని, దానితో వారిపై దాడులు మరియు ఇతరపరంగా నష్టాలు చేకూరుతున్నాయని అన్నారు. దరఖాస్తుదారుల రక్షణ కొరకు గల మెమో నెంబర్: 33086 ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
రాష్ట్ర సమాచార కమిషన్ సెక్షన్ 20 ప్రకారం అనుసరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. రాష్ట్ర కమిషనర్ సుప్రీం కోర్టు తీర్పులు, కేంద్ర సమాచార కమిషన్ తీర్పులు, రాజ్యాంగబద్ధమైన ఇతర చట్టాలను ప్రమాణికం చేసుకొని రూల్ ఆఫ్ ల ప్రకారం ఏపీఐవో, పిఐఓ, ఏవో పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సహ చట్టబలోపితం కొరకు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయవలసిన ఆర్టిఐ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇట్టి కమిటీలలో సామాజిక కార్యకర్తలకు చోటు కల్పించి చట్ట బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. సహ చట్టం రక్షణ కొరకు, దరఖాస్తు దారుల, ఆర్టీఐ కార్యకర్తల పరి రక్షణ కొరకు, ప్రజల రాజ్యాంగ బద్దమైన హక్కుల కొరకు ప్రతి ఒక్క ఆర్టీఐ, సామాజిక కార్యకర్తలు, మేధావులు ఒకే వేదిక పైన వచ్చి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
రోడ్ సేఫ్టీ కోసం ఆర్టిఐ కార్యకర్త అజీమ్ పేరుతో దరఖాస్తుల ఆవిష్కరణ
ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టిఐ కార్యకర్త అజీమ్ పేరుతో జాగృతి యువ మంచ్ ఆధ్వర్యంలో రూపొందించిన సమాచార హక్కు చట్ట దరఖాస్తు పత్రాలను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జిల్లా అధ్యక్షులు కబీర్, జిల్లా కార్యదర్శి వంగారి ప్రవీణ్, జిల్లా అడ్వైజర్ రామ్టెంకి కృష్ణ, జిల్లా ప్రచార కార్యదర్శి దుర్గం శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి లింగన్న, డివిజన్ జాయిన్ సెక్రటరీ అఖిలేష్, ఆర్టీఐ కార్యకర్త శరత్ చంద్ర, మండల ఉపాధ్యక్షులు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

















