Connect with us

నిజామాబాద్

రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చర్యలు తీసుకొండి

janamvelugunews

Published

on

Views: 0

రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చర్యలు తీసుకొండి.

సర్వే నంబర్ 202/3 లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నర్సారెడ్డి

ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తికి ఎలా అనుమతి ఇచ్చారు

సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు

జనం వెలుగు ఆర్మూర్:- ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తీగల నర్సారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ రాజుకు శుక్రవారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో సర్వే నంబర్ 202/3 లోని ప్రభుత్వ భూమిని తీగల నర్సారెడ్డి అను వ్యక్తి కబ్జా చేసి సుమారు 24 ఇండ్లను నిర్మిస్తున్నాడని,ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తి నిర్మిస్తున్న ఇండ్లకు ఎలా అనుమతి ఇచ్చారని కమిషనర్ ను ఆయన ప్రశ్నించాడు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులైన మీ పై లేదా వాస్తవాలను తెలుసుకోకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారికి మద్దతు ఇవ్వడం సరియైనది కాదని ఆయన అన్నాడు. ఇప్పటికైన రియల్ ఎస్టేట్ వ్యాపారి నర్సారెడ్డి కబంద హస్తాలలో చిక్కుకున్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించాడు. గతంలో యోగేశ్వర కాలనీలో అంబేద్కర్ సంఘం కమ్యూనిటి హాలు నిర్మాణంలో అడ్డుకోవడానికి ప్రయత్నించిన కమిషనర్ రాజు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నర్సారెడ్డి ఇండ్ల నిర్మాణానికి పూనుకుంటే చూసి చూడనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నావని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అపార్ట్ మెంట్లు, సెట్ బ్యాకు లేకుండా మామిడి పల్లిలో నిర్మిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారుల పట్ల కాని కనికరం ఎందుకని ఆయన ప్రశ్నించాడు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ నాయకుడు సూర్య శివాజి, అబ్దుల్, బాలయ్య, ప్రజా సంఘాల నాయకులు ప్రిన్స్, రాజు, వెంకటేష్, నరేందర్, పాషా, హనుమంతు రెడ్డి, రాహుల్, ఖాజా పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

అంబరాన్నంటిన హనుమాన్ జన్మోత్సవ సంబరాలు…

janamvelugunews

Published

on

Views: 114

అంబరాన్నంటిన హనుమాన్ జన్మోత్సవ సంబరాలు..

జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ నగరంలో గురువారం హనుమాన్ జన్మోత్సవ వేడుకలు, భారీ ఊరేగింపు విశ్వ హిందూ పరిషద్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కంటేశ్వర్ నుండి ప్రారంభమైన ఊరేగింపు భక్త జన సందోహల మధ్య, భక్తి గీతాలతో, నృత్యాలతో భక్తి పారవాశ్యం తో ఆర్ ఆర్ చౌరస్తా వరకు చేరుకుంది. నగరం లోని అన్ని హనుమాన్ ఆలయాలలో పెద్ద ఎత్తున పూజలు,అన్న ప్రసాదాలు నిర్వహించారు. నగరమంతా రామ నామ,, హనుమాన్ నామ స్మరణ తో మార్మోగింది. వినాయక్ నగర్ లోని సంకట మోచన హనుమాన్ మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో భాగంగా ఆర్చేస్ట్రా తో భక్తి పాటలు అందరిని మంత్ర ముగ్దులను చేసాయి.ఆలయ పురోహితుల మంత్రోచ్చారనలు, హారతి పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.శ్రీ నటరాజ నృత్య తరంగిని నాట్యాలయం ఆధ్వర్యంలో బంటు సుకన్య నేత్రుత్వంలో సహస్ర, నిహాన్వి, కె. ఆధ్య, టి. ఆద్య, పి. ఆధ్య, రూణి, ప్రేర్, తనిష్క, వేధిత చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.ఆలయ ఆవరణలో సంసృతి సాంప్రదాయాలు రాబోయే తరానికి తెలియ చేయాలనే ఉద్దేశ్యం తో ప్రతి రోజు సాయంత్రం నృత్య తరగతులు తీసుకుంటున్నట్లు తెలిపారు.హనుమాన్ భారీ ర్యాలీ సందర్బంగా భక్తులు, వచ్చిన భక్తుల కోసం పులిహోర, బాదాం పాలు, జీరా అన్నం, రస్నా, శ్రీరామ రసం, లాంటివి అందించి భక్తుల మన్ననలు పొందారు. సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేసారు.

Continue Reading

నిజామాబాద్

రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ ల్లో కొత్త రుసుముల అమలు

janamvelugunews

Published

on

Views: 24

రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ ల్లో కొత్త రుసుముల అమలు

జనంవెలుగు, నిజామాబాద్:- రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుండి మీ సేవ సేవలపై కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయని, కొత్త రేట్లు పాత ఛార్జిలతో పోల్చవద్దని, వినియోగదారులు ఈ విషయం లో మీ సేవ నిర్వాహకులకు సహకరించాలని జిల్లా మీ సేవ అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. గతం లో కంటే ప్రస్తుతం మీ సేవల రుసుముల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.వినియోగదారులుపాత ఛార్జిలతో పోల్చి సందేహాలు వ్యక్తం చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన తాజా రుసుములను చెల్లించి సహకరించాలని జిల్లా మీ సేవ అధ్యక్షుడు సితారే క్షేవిన్ (రాజ్) విజ్ఞప్తి చేసారు. మేము నిన్ననే దరఖాస్తు చేసుకున్నాం, ఇంత చార్జీలు లేకుండే మీరేంటి బాగా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు లాంటి అపోహాలు, వాదనలకు పోకుండా తాజా చార్జీలు చెల్లించి మీ సేవ సేవలు వినియోగించు కోవాలని సూచించారు.ఇన్నేళ్లుగా యూసర్ ఛార్జిల్లో పెంపు లేకుండా ఉన్న మీ సేవల ఛార్జిలను పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మీ సేవా కేంద్రాలతరపున ధన్యవాదాలు తెలియ చేసారు. వినియోగ దారులు ఎటువంటి ఆటంకం లేకుండా మీ సేవ సేవలను వినియోగించు కోవాలన్నారు.

Continue Reading

నిజామాబాద్

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భారీ లాభం

janamvelugunews

Published

on

Views: 110

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భారీ లాభం నిజామాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం

జనంవెలుగు, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్ స్టేషన్ ఆవరణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.10 వేల కోట్ల ఆదా జరిగిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఉమారాణి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల కుటుంబాల ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 8.58 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 290 కోట్ల మహిళా ప్రయాణికులు ప్రయాణించగా, మొత్తం రూ.10 వేల కోట్ల ఆదా జరిగిందని, నిజామాబాద్ జిల్లాలో మాత్రమే రూ.365.50 కోట్ల ఆదా నమోదైందని వివరించారు.

ఈ పథకాన్ని మహిళలు విస్తృతంగా వినియోగించుకుని ఆర్థికంగా మరింత బలపడాలని ఆమె ఆకాంక్షించారు.

ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోలలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి డిపోలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, ఆర్మూర్ డిపోలో మున్సిపల్ చైర్మన్ లహరి రఘు, బాన్స్‌వాడ డిపోలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బోధన్ డిపోలో మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి పాల్గొన్నారు.

నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయగౌడ్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత, జిల్లా కార్యదర్శి మమత, సంధ్యారాణి, సరిత, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు ఆనంద్, ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ జానాబాయి, బస్ స్టేషన్ మేనేజర్ శివరాజవ్వ తదితరులు పాల్గొన్నారు.

మహిళా కండక్టర్లు సరళ, నాగకుమారి, జ్యోతి మరియు మహిళా ప్రయాణికులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Continue Reading