Crime
తల్వేద వాగులో గుర్తు తెలియని మహిళ శవం లభ్యం


తల్వేద వాగులో గుర్తు తెలియని మహిళ శవం లభ్యం
జనం వెలుగు, నందిపేట్:- నందిపేట్ మండలం తల్వేద గ్రామ శివారులోని తల్వేద వాగులో శనివారం గుర్తు తెలియని ఆడ వ్యక్తి శవం లభ్యమైంది. మృతురాలి వయసు సుమారు 40–45 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.


స్థానికులు వాగులో శవం ఉన్నట్టు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో, నందిపేట్ ఎస్సై జి. శ్యామ్ రాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శవంపై ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోయినా, మృతురాలి ఎడమ చేతిపై “G మేఘనా”అని టాటూ ఉండటం గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు లేదా శవాన్ని గుర్తించిన వారు నందిపేట్ ఎస్సై సెల్ నెంబర్ 8712659861 లేదా ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి సెల్ నెంబర్ 8712659859 లకు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.
Crime
వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు


నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 138 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
రూ.11.10 లక్షల జరిమానా విధింపు – 9 మందికి జైలు శిక్ష
జనం వెలుగు, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో గడిచిన వారం రోజుల్లో 138 కేసులు నమోదు చేసినట్లు పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ వెల్లడించారు.
తేదీ 25-05-2026 నుండి 30-05-2026 వరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లు మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 138 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, 9 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి మొత్తం రూ.11,10,000 జరిమానా విధించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
పోలీస్ కమిషనర్ సూచనలు:
• మద్యం సేవించి వాహనాలు నడపరాదు.
• వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలి.
• డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడుతుంది.
• మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురైతే బీమా ప్రయోజనాలు లభించవు.
• మైనర్లు మద్యం సేవించి వాహనాలు నడిపితే మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదు చేసి జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
• ఒకటి కంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన చర్యలతో పాటు జైలు శిక్ష విధించబడుతుంది.
మోటార్ వెహికల్ యాక్ట్–1988 సవరణ చట్టం–2019 ప్రకారం మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చని, రెండోసారి పట్టుబడితే రూ.15,000 జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు.
Crime
|crimenews నందిపేట మండల కేంద్రంలో చోరీ….


నందిపేట మండల కేంద్రంలో చోరీ….
పొద్దున పొద్దున్నే 10 తులాల బంగారం రెండు లక్షల నగదు అపహరణం….
కట్ట పనికి వెళ్లొచ్చే సరికే కానిచ్చేశారు..
నందిపేట్ మే 28 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర నాగమంతెన సంఘం దగ్గర కాలనీలో నివాసం ఉంటున్న నడ్కుడ రాధా ఇంట్లో చోరీ జరిగింది.
బుధవారం సుమారు ఉదయం 7- 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి సుమారు 10 తులాల వరకు బంగారం 2 లక్షల రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే నడ్కుడ రాధ భర్త చనిపోయి చాలా రోజులవుతుంది, తన తల్లి కొడుకుతో నాగ మంతెన సంఘం వద్దగల కాలనీలో నివాసం ఉంటుంది.
అయితే బుధవారం ఉదయం కట్ట పనికొరకంటూ కొడుకు బండిమీద వెళ్ళింది. కాసేపటికి రాదను దింపేసి రాజు ఇంటికి వచ్చి స్నానం చేసి మళ్లీ యధావిధిగా పొలం పనికి వెళ్ళాడు. వృద్ధురాలైన రాధాత తల్లి ఇంట్లో ఒక్కతే ఉంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో తల్లి కొడుకులు ఇద్దరు ఇంటికి వచ్చారు. వీరు నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి గురించి చర్చించుకొని మేస్త్రి డబ్బులు కట్టమన్నాడని,
మేస్త్రీకి డబ్బులు ఇచ్చేందుకు బీరువాలో ఉన్న నగదును చూసుకునేందుకు బీరువా దగ్గరికి వెళ్లగా బీరువా తాళం చేయి కనిపించలేదు. అనుమానం వచ్చి ఒకరికొకరు వాకబు చేసుకున గా బీరువా తాళం చేయి కనిపించే పోయేసరికి బీరువాతాలాన్ని పగలగొట్టి చూడడంతో అందులో ఉన్న బంగారం నగదు కనిపించక పోయేసరికి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
మా అమ్మ నేను బయటకెళ్ళిచ్చేసరికి మా అమ్మమ్మను పక్కింటి వ్యక్తి ఒకరు బయటకు తీసుకెళ్లడం జరిగిందని, ఆ వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశాడు నడ్కుడ రాజు. పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Crime
|crimenews మంటగలిసిన మాతృత్వం


మంటగలిసిన మాతృత్వం
ఆడబిడ్డను కనీ నిర్మాణస్య ప్రాంతంలో విసిరేసిన వైనం
నందిపేట్ మే 24 జనం వెలుగు: మాతృత్వం మంట కలిసింది.. ఆడబిడ్డను కనీ నిర్మాణస్య ప్రాంతంలో విసిరేసిన వైనం నందిపేట మండల కేంద్ర రాజ్ నగర్ దుబ్బ రెహిమానియా మజీద్ ప్రాంతం
హనీ రెస్టారెంట్ వెనకాల కాళీ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందును కర్కశంగా మండుటెండలో విసిరేసి వెళ్లడం జరిగింది. వివరాల్లోకి వెళితే మెయిన్ రోడ్డు లో గల పాత హనీ రెస్టారెంట్ వెనకాల కాళీ ప్రాంతంలో పసికందును ఘర్కశంగా విసిరేశారు.
స్థానిక చిన్నపిల్లలు క్రికెట్ ఆడదామని గేటు పైనుంచి ఆ నిర్మాణస్య ప్రాంతంలో వెళ్లేసరికే అక్కడ ఒక పసి గుడ్డు ఏడుపులు విని వెంటనే అసిఫాన్ అనే బాలుడు వాళ్ళ అమ్మ నాన్నకు తెలపడంతో వెంటనే వాళ్లు ఆ పసి గుడ్డును హాస్పిటల్కు తీసుకెళ్లడం జరిగింది.
అయినా పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో ఆ పసి గుడ్డు మరణించడం జరిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఆడపిల్ల అనే నెపంతోనో.. లేదా అక్రమ సంబంధమో..
తెలియదు కానీ అభం శుభం తెలియని ఆ చిన్నారిని మండుటెండలో విశ్రేయడం మాతృత్వానికే మచ్చ అని ఇటువంటి చర్యకు పాల్పడిన వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.




















