Connect with us

నిజామాబాద్

|Nizamabad ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో సీపీ టీమ్ ఘన విజయం

janamvelugunews

Published

on

ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో సీపీ టీమ్ ఘన విజయం

బౌలింగ్ లో సత్తా చాటిన సిపి సాయి చైతన్య

జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ నగరంలో పోలీస్ కమిషనర్ ఎలెవన్ జట్టు వర్సెస్ ప్రెస్ క్లబ్ ఎలెవన్ జట్ల మధ్య నిర్వహించిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో సీపీ టీమ్ ఘన విజయం సాధించింది.

శుక్రవారం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ పెండ్లి క్రికెట్ మ్యాచ్‌ను ఉత్సాహంగా నిర్వహించారు. టాస్ గెలిచిన పోలీస్ కమిషనర్ ఎలెవన్ జట్టు ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకుంది. నిర్ణీత 12 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 133 పరుగులు చేసింది. పోలీస్ జట్టులో ఎస్ఐ కిరణ్ పాల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అదేవిధంగా నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి 25 పరుగులు చేసి జట్టుకు కీలక సహకారం అందించారు.

లక్ష్య ఛేదనకు దిగిన ప్రెస్ క్లబ్ ఎలెవన్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మూడు ఓవర్లు బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. అదనపు డీసీపీ జి. బస్వా రెడ్డి ఒక ఓవర్ వేసి ఒక వికెట్ తీశారు. ప్రెస్ క్లబ్ జట్టులో శివ ఠాగూర్ 24 పరుగులు చేసి ఆకట్టుకున్నారు.

చివరికి 43 పరుగుల తేడాతో పోలీస్ కమిషనర్ ఎలెవన్ జట్టు ప్రెస్ క్లబ్ ఎలెవన్‌పై ఘన విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం బెస్ట్ బౌలర్‌గా శ్యామ్ సుందర్‌కు, ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా కిరణ్ పాల్‌కు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మరియు అదనపు కలెక్టర్ అంకిత్‌లు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ జి. బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు, పత్రికా ప్రతినిధులు పాల్గొని మ్యాచ్‌ను విజయవంతం చేశారు.

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Continue Reading

నిజామాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Thammali Pandu

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు 

బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.

జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.

భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,

పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.

ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.

Continue Reading