Connect with us

Uncategorized

రైతులకు విజ్ఞప్తి

janamvelugunews

Published

on

జనం వెలుగు, అగ్రికల్చర్ డెస్క్: ఆయిల్ పామ్ సాగు చేయడానికి ఆసక్తి ఉన్న రైతులు క్రింద తెలిపిన డాక్యుమెంట్లు జిరాక్స్ కాపీలను మరియు డిడి ఇచ్చి దరఖాస్తు చేసుకోవలెను.
1. ఆధార్ కార్డు జీరాక్స్
2. బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్
3. పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ లేదా 1-బి కాపీ జిరాక్స్
4 . పాస్ సైజు ఫోటో-2

డిడి తీయవలసిన చిరునామా:
District Horticulture and Sericulture officer Nizamabad

*ఆయిల్ పామ్ సాగు కు అందించు రాయితిలు:*

✓. ఒక మొక్క ఖరీదు 193 రూపాయలు దానిలో రైతు చెల్లించవలసినది 20 రూ॥లు మాత్రమే. మిగిలినది ప్రభుత్వం రాయితి అందిస్తుంది
ఎకరానికి 57 మొక్కలు.
( రైతు వాటా 20 × 57 = 1140
ఎకరానికి 1140 రూపాయలు )

✓. 4 సంవత్సరాల వరకు ఆయిల్ పామ్ సాగు మరియు అంతర పంటల సాగు నిర్వహణ ఖర్చు ఇవ్వబడును.
( ఆయిల్ పామ్ సాగుకు రూ. 2100 ఎకరాకు మరియు అంతర పంట సాగుకు రూ.2100 ఎకరాకు.
మొత్తం ఎకరానికి 4200 రూ||లు సంవత్సరానికి ప్రభుత్వం నేరుగా రైతు ఖాతాలో వేస్తుంది)

✓• రెండవ సంవత్సరం పైన తెలిపినవిధంగా ఎకరానికి ₹4200 ఇస్తుంది

✓•మూడవ సంవత్సరం : పైన తెలిపిన విధంగా ఎకరానికి ₹4200 ఇస్తుంది

✓•నాల్గవ సంవత్సరం : పైన తెలిపిన విధంగా ఎకరానికి ₹ 4200 ఇస్తుంది

✓•డ్రిప్ సేద్యం ద్వారా నీరు అందించుటకు 80% నుండి 100% వరకు రైతు కేటగిరిననుసరించి రాయితీ యివ్వబడును.

✓• తోట నాటిన 3 సంవత్సరాల తర్వాత దిగుబడి ప్రారంభమై 25 సంవత్సరాల వరకు కొనసాగును. మొదటి 3 సంవత్సరాల వరకు అన్ని రకాల కూరగాయలు, వేరుశనగ, సొయా, ప్రత్తి, పెసర, మినుములు, శనగ, కుసుమ, పసుపు, జొన్నలు, మక్కలు, సజ్జ, ఎర్ర జొన్నలు మొదలగు మెట్ట పంటలను అంతరపంటలుగా వేసుకోవచ్చు.
( *గమనిక: *వరి మరియు చెరుకు పంటను అంతర పంటలుగా సాగు చేయరాదు)*
నాలుగు సంవత్సరాల తర్వాత కూడా దుక్కి దున్నకుండా అంతర పంటలుగా కోకో, మిరియాలు, జనిజాపత్రి సాగు చేయవచ్చు.. అలాగే దేశీ కోళ్లు, పాడి పరిశ్రమ, మేకల పెంపకం చేయవచ్చు.

✓•పది నుండి పదిహేను వేల పెట్టుబడితో ఒక ఎకరానికి 10 టన్నుల దిగుబడి మరియు ఒక 1.00 లక్ష రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు.

మొక్కల కోసం దరఖాస్తు చేసుకునే రైతులు పైన తెలిపిన జిరాక్స్ పత్రాలు మరియు డిడి లను
సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి AEO ని సంప్రదించాల్సి ఉంటుంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Uncategorized

ప్రభుత్వ వైఫల్యంపై ధర్మోరా, అబ్దుల్లాపూర్ రైతుల నిరసన

janamvelugunews

Published

on

ప్రభుత్వ వైఫల్యంపై ధర్మోరా, అబ్దుల్లాపూర్ రైతుల నిరసన

జనంవెలుగు, లోకేశ్వరం, నవంబర్ 12: లోకేశ్వరం మండలం పరిధిలోని ధర్మోరా, అబ్దుల్లాపూర్ గ్రామాల రైతులు వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, మంగళవారం వారు సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. రైతులు మాట్లాడుతూ, ఈ వానాకాలం సీజన్‌లో పండించిన వరి పంటను కొనుగోలు చేయడానికి తగిన కేంద్రాలు అందుబాటులో లేకపోవడం తమను తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందని చెప్పారు. పండిన పంటతోనే నిలిచి ఉండాల్సిన పరిస్థితులు కల్పించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కాలంలో పంట సకాలంలో కొనుగోలు చేయకపోతే రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, పంట నష్టపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. “సర్కారు ఇలాగే కొనసాగితే, గ్రామస్థులు తమ హక్కుల కోసం మరింత గట్టిగా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తారు. సమగ్ర సర్వేకు మేము సహకరించేందుకు సిద్ధంగా లేము,” అని గ్రామస్థులు హెచ్చరించారు. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం లేకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. గ్రామస్థుల నిరసన నేపథ్యంలో అధికారులు త్వరగా స్పందించి, రైతుల సంక్షేమం కోసం పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని రైతులు ఆశిస్తున్నారు.

Continue Reading

Uncategorized

ఉచిత బస్సు ప్రయాణం-ప్రజలకు ప్రాణ సంకటం

janamvelugunews

Published

on

ఉచిత బస్సు ప్రయాణం-ప్రజలకు ప్రాణ సంకటం

Continue Reading

Uncategorized

రేపు జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి

janamvelugunews

Published

on

రేపు జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి
38 ఎకరాల భూమి అందచేయనున్న సీఎం

మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు అందచేత

 జనం వెలుగు, హైదరాబాద్:-  సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు తమ నివాస స్థలాలకై ఎదురుచూస్తున్న శుభ ముహూర్తం ఖరారైంది. రేపు (8 . 9 .2024 ) న ఉదయం 10 హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై జవహర్ లాల్ నెహ్రు హోసింగ్ సొసైటీ కి 38 ఎకరాల భూమిని అందచేయనున్నారు.

ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం అనే పేరుతొ నిర్వహిస్తున్న ఈ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌరసంబందాలు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డిలతో పాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు..
రాష్ట్రంలో విధినిర్వహణలో, వివిధ కారణాల వల్ల మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈ సమావేశంలో అందించనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ఎం. హనుమంత రావు విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని సమాచార శాఖ తరపున లైవ్ కవరేజి ఇస్తున్నందున ప్రెస్ ఫోటో, వీడియో గ్రాఫ్ చేయడానికి అనుమతించడంలేదని, ఇందుకు సహకరించాల్సిందిగా తెలిపారు.

Continue Reading