Connect with us

నిజామాబాద్

| armoor ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోనె లహరికి వరించేనా?

janamvelugunews

Published

on

ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గోనె లహరికి వరించేనా ?

ఈ నెల 16 న చైర్మన్ ఎంపిక.

జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మున్సిపల్ లో విద్యావంతురాలైన గోనే లహరికి చైర్మన్ పదవి వరిం చనున్నట్లు సమాచారం. ఈ నెల 16 న ఆర్మూర్ మున్సిపల్ లో చైర్మన్ ఎంపిక జరుగనుంది. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించి ఎన్నికల బరిలోకి దిగిన 2/3 కాంగ్రె సు సీనియర్ నాయకులు ఓటమి పాలు కావడంతో కాంగ్రెసు నాయ కులు అయోమయంలో పడ్డారు. ఈ నెల 11 నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు పాత నాయకులకు గట్టిగా బుద్ధి చెప్పి, కొత్త నాయకులను ఎన్నుకోవడం జరిగిందని ఆ ఆనందాన్ని పంచుకునేందుకు ఆర్మూర్ లోని కొన్ని వార్డులలోని ప్రజలు సంబరాలు జరుపు కోవడం విశేషం. గతంలో అధికారంలో గల నాయకులపై ప్రజలు తమ అక్కసును బహిర్గతం చేసినట్లు సుస్పష్టంగా కనిపిస్తుంది.

అధికార, అనధికార నాయకులు వేసుకున్న అంచనాలను తారుమారు చేస్తూ ప్రజలు తమ చేతిలోని ఓటు అనే వజ్రా యుధాన్ని ప్రయోగించి నాయకులను చిత్తు చేశామని ప్రజలు ఆనందంలో ఉన్నారు. అధికార కాంగ్రెసు పార్టీలో గల అంతర్గత కుమ్ములాట వలన అధికార పగ్గాలు తమ చేతిలో నుండి జారి పోతే ఎలా అని నాయకుల మధ్య జరిగినకు మ్ములాటలో ఆ ఇరువురు పగ్గాలను కొల్పోవలసి వచ్చిందని ఘాటుగా విమర్శలు వినిపిస్తున్నాయి.  ఆ ఇరువురు పగ్గాలకై పాల్పడిన కుమ్ములాట అధికార పార్టీలో చర్చ నీయాంశమైంది.పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేక పోలేదు.  ఇకపోతే ఆర్మూర్ చైర్మన్ ఎంపికకై ఏర్పాటు చేసిన శిబిరంలో కాంగ్రెసు పార్టీకి చెందిన 19 వార్డు సభ్యులతో పాటు తిరుగు బాటు అభ్యర్థి దియా అగర్వాల్ సహితం పాల్గొన్న ట్లు సమాచారం.ప్రస్తుతం కాంగ్రెసు 20 వార్డులకు చేరింది. తిరుమల సుమన్ (భారత్ గ్యాస్), దియా అగర్వాల్, బండారు గీతలతో పాటు గో నె లహరి ముందు వరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. గోనే లహరి పిజి పూర్తి చేసినందున ఆర్మూర్ చైర్మన్ పదవికి అన్ని విధాలుగా అర్హురా లుగా కాంగ్రెసు నాయకులు భావిస్తున్నట్లు సమాచారం.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Continue Reading

నిజామాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Thammali Pandu

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు 

బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.

జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.

భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,

పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.

ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.

Continue Reading