Connect with us

నిజామాబాద్

# Armoor అంతిమ “తీర్పు” పై అభ్యర్థులలో టెన్షన్,టెన్షన్

janamvelugunews

Published

on

Views: 6104

అంతిమ “తీర్పు” పై అభ్యర్థులలో టెన్షన్,టెన్షన్

బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం

ఆర్మూర్, భీంగల్ అభ్యర్థులలో పట్టుకున్న గుబులు

జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ఎన్నికల ప్రజా తీర్పు శుక్రవారం వెలువడ నుండతో అభ్యర్థులలో గుబులు పట్టుకుని టెన్షన్ టెన్షన్ వణికి పో తున్నారు. ప్రజా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది. రంగంలో గల అభ్యర్థులు పెద్ద మొత్తంలో డబ్బులను పంపిణి చేసినప్పటికీ ప్రజా తీర్పు ఎటు వైపు ఉంటుందోనని అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తుతున్నాయి. ఆర్మూర్ లో కాంగ్రెసు, బిజెపి పార్టీల మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది.  కాంగ్రెసులో తిరుగు బాటు అభ్యర్థుల వలన, పార్టీని నమ్ముకుని టి క్కెట్టు ఆశించి రాక భంగ పడ్డ అభ్యర్థులు ఉన్నారు. తిరుగు బాటు అభ్యర్థులు, టిక్కెట్టు రాక భంగపడ్డ తిరుగు బాటు అభ్యర్థుల వలన ఓట్లు చీలే ప్రమాదం లేక పోలేదు.  తమకు టిక్కెట్టు రాకుండా నిరోదించిన కాంగ్రెసు నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి కాంగ్రెసు అభ్యర్థులు ఓటమి పాలయ్యే విదంగా గుప్తంగా పని చేసి తమ ఉనికిని చాటుకునే అవకాశం లేక పోలేదు. ఆర్మూర్ లో బిజెపి ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెసు నాయకుడు వినయ్ రెడ్డి, భీంగల్ లో బాల్కొండ (బిఆర్ఎస్) ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెసు నాయకుడు సునీల్ రెడ్డి తమ తమ అభ్యర్ధుల గెలుపు కోసం తిప్పిన చక్రాలు ఎంత మేరకు సఫలీ కృతమవుతాయో వెలువడే ప్రజా తీర్పు పైనే ఆధారపడి ఉంటుంది. తమ అభ్యర్థుల గెలుపు కోసం వేసే ఎత్తులకు ఎవరు చిత్తు అవుతారో వెలువడే ప్రజా తీర్పు పైనే ఆధార పడి ఉంది. బయటకు మేం గెలుస్తామని చంకలు గుద్దుకుని చెప్పే నాయకులకు ఓటరు వెలువరించే తీర్పుతో చెంప చెల్లు మంటుంది. ఏది ఏమైనా ప్రజా తీర్పును అందరు శిరసావహించి తీరాల్సిందే.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం

janamvelugunews

Published

on

Views: 4

సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజకుమార్ మాట్లాడుతూ…. విద్యార్థుల చదువుకు సంబంధించిన పురోగతి, అలాగే సమస్యలు తదితర విషయాలపై చర్చించడం జరిగిందని, తమ పిల్లలు చదువుకునే చదువు గురించి తెలుసుకొనేందుకు కళాశాలకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అని, ఇలాగే తల్లిదండ్రులు, టీచర్లు కలిసి విద్యార్థులపై పర్యవేక్షణ చేస్తే విద్యార్థులు మంచి మార్గంలో నడిచేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్ ఓ డి లు లావణ్య, కిషోర్, లక్ష్మణ్ శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

| nandipet యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు

janamvelugunews

Published

on

Views: 224

యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు

నందిపేటలో యూరియా కొరకు రైతుల ధర్నా, యూరియా ఆప్ ను రద్దు చేయాలంటూ నిరసన

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో నందిపేట మండల రైతులు శుక్రవారం యూరియా దొరుకుత లేదంటూ… యూరియా యాప్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే యూరియా యాప్ ను రద్దుచేసి రైతులకు యూరియా బస్తాలు అందేటట్టు చూడాలని రోడ్డెక్కారు. లక్కంపళ్లి, చిమ్రాజ్పల్లి, నందిపేట రైతులు చేపట్టిన ఈ ధర్నాతో వివేకానంద చౌరస్తాలో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి.

స్థానిక ఎస్సై శ్యామ్రాజ్, ఎస్సై 2 రాము లు జోక్యం చేసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడించి ధర్నాను విరమింప చేశారు. ఈ సందర్భంగా రైతు తెల్వెద అబ్బి గంగారం మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ విధానం సరైన రీతిలో చేయట్లేదని, రైతుకు యూరియా కావాల్సి వస్తే యాప్ లో బుకింగ్ చేసుకున్న వాళ్లకే యూరియా సరఫరా చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే సొసైటీలో యూరియా మాయమైపోతుందని, అసలు నిజమైన లబ్ధిదారులకు యూరియా బస్తాలు అందడం లేదని, ఈ సమయంలో రైతు పొలానికి యూరియా వేయనట్లయితే వరి రైతు తీవ్రంగా నష్టపోతారని, యూరియా దొరకకపోతే రైతుకు ఉరే గతి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆప్ విధానంపై అవగాహన కల్పించ కుండా… సరఫరా చేయడం సరైనది కాదని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే యూరియా అయిపోవడం ఏంటని, చదువుకోని వారికి యూరియా బుకింగ్ చేసుకోవడం ఇబ్బంది కలుగుతుందని, ఆప్ విధానం కాకుండా ప్రత్యామ్నాయం చూడాలని అధికారులను కోరారు.

Continue Reading

నిజామాబాద్

|nandipet ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

janamvelugunews

Published

on

Views: 90

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం షాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని యువత పెద్ద ఎత్తున జై శివాజీ జై భవాని అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలి వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం హన్మండ్లు మాట్లాడుతూ అఖండ భారతావనిలో హిందూ ధర్మాన్ని కాపాడిన ఏకైక మహావీరుడు శివాజీ అని, ఆయన ధైర్య సాహసాలను ఎంత పొగిడిన తక్కువేనని, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే మొగలుల ప్రయత్నాన్ని తిప్పికొడుతూ ధర్మరక్షణకై యుద్ధ రంగంలో కదం తొక్కిన మహావీరుడని, ఎన్నో విజయాలు సాధించి హిందూ ధర్మాన్ని కాపాడిన ధైర్యశాలి ఆశంబుజీ మహారాజ్ అని కొనియాడారు. నేటి యువత ఆయనని స్ఫూర్తిగా తీసుకొని హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తమ వంతుగా కృషి చేయాలని హితవు పలికారు. ఉప సర్పంచ్ నీరడి రాములు, దత్తపురం భోజన్న, ఆమందు వంశీ, దినేష్ గౌడ్, పుల్ల మహేష్, ఉద్గిరి అరవింద్, పిట్ల మోహన్, గ్రామ యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading