నిజామాబాద్
ఘనంగా టీజేఏ ఆవిర్భావ దినోత్సవం


ఘనంగా టీజేఏ ఆవిర్భావ దినోత్సవం
ప్రత్యేక పాఠశాల విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ
జనంవెలుగు, నిజామాబాద్:- రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన నాలుగు జర్నలిస్టు సంఘాల్లో ఒకటైన జాతీయ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్ జే యు) అనుబంధ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు జి. సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్ స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలలో విద్యార్థులకు బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. విద్యార్థులతో మమేకమై వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
అనంతరం జి. సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిగత భద్రత కోసం సంఘం టీజేఏ
నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పాటు సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను కూడా చేపడుతూ సంఘం ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్ స్ట్రక్షన్ కార్యదర్శి సిద్దయ్య మాట్లాడుతూ.. టీజేఏ ఆవిర్భావ దినోత్సవాన్ని కేవలం వేడుకగా కాకుండా ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ, విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేయడం, ప్రత్యేక పాఠశాలల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల ఆత్మగౌరవం, సంక్షేమం, వృత్తి భద్రత కోసం టీజేఏ చేస్తున్న కృషి మరింత ఫలించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీజేఏ ప్రతినిధులు కొట్టూరి ప్రమోద్, తమ్మలి పాండు, ఆర్. శ్రీనివాస్ రెడ్డి, పి. యశస్వి, పి. మురళీకృష్ణ, వికాస్ గైక్వాడ్, పులగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి


DSP ఉద్యోగం సాధించడం జిల్లాకే గర్వకారణం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
DSP ఉద్యోగం సాధించిన నిఖిల రెడ్డిని సత్కరించిన ఎమ్మెల్యే
జనంవెలుగు నిజామాబాద్ :- రూరల్ నియోకజవర్గ పరిధిలో డివిజన్ నంబర్ 03-కార్పొరేషన్ గంగస్థాన్-2 కు చెందిన గౌరోల్లా చంద్రకళ-భూమ్ రెడ్డి దంపతుల కుమార్తె గౌరోల్లా నిఖిల రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూపు-1 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి DSP ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి మహేందర్ ల నేతృత్వంలో నిఖిల రెడ్డి కుటుంబ సభ్యులు బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నిఖిల రెడ్డిని ఎమ్మెల్యే శాలువతో సత్కరించి అభినందించారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేసి జిల్లాకు మరింత మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లలు ఉన్నతంగా చదివి గొప్ప గొప్ప స్థానాలకు ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు.
నిజామాబాద్
కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ


కాంగ్రెస్ శ్రేణులతో రూరల్ ఎమ్మెల్యే ఆత్మీయ భేటీ
డిచ్ పల్లి మండల అధ్యక్షుడి నివాసంలో భేటీ
దసరా సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయదశమి దసరా పండుగ సందర్భంగా బుధవారం డిచ్ పల్లి మండలంలోని వెస్లీ నగర్ తాండా లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబర్ సింగ్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేతో ఆత్మీయంగా ముచ్చటించారు. అనంతరం పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని నాయకులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు.మండల అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేకు పరిచయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి,స్థానిక సర్పంచ్ చౌహన్ విజయ్, పార్టీ నాయకులు సాయరెడ్డి, పొలసాని శ్రీనివాస్, అమృతాపూర్ గంగాధర్, తారచంద్ నాయక్, హన్మండ్లు, రాంచందర్ గౌడ్, షాదుల్లా, సురేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.








