Connect with us

ARTICLE'S

దేశాన్ని నాశనం చేసేది అవినీతిపరులే తప్ప బుద్ధి జీవులు మేధావులు కాదు

janamvelugunews

Published

on

సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరికతోనైనా అక్రమార్కుల పోషిస్తున్న పాలకవర్గాలు ఇకనైనా కళ్లు తెరవాలి

వడ్డేపల్లి మల్లేశము 9014206412

జనం వెలుగు:- భారతదేశంలో టాప్ టెన్ కుబేరుల చేతిలో ఉన్న సంపద తో25 సంవత్సరాల పాటు దేశంలోని విద్యను అభ్యసిస్తున్న వారందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించవచ్చునని ఇటీవల ఆక్స్ఫం ఇండియా నివేదిక స్పష్టం చేసిన వేల ఆదేశిక సూత్రాలకు భిన్నంగా సంపద కొద్దిమంది చేతిలో ఎలా సమీకరించబడినదో అర్థం చేసుకోవచ్చు . 90 శాతం మంది చేతిలో కేవలం 10 శాతం సంపద మాత్రమే ఉంటే 10 శాతం సంపన్నుల చేతిలో 90 శాతం దేశ సంపద అక్రమంగా బందీ అయిన విషయాన్ని అవగతం చేసుకుంటే నేరస్తులు ఎవరు? అవినీతిపరులు ఎవరు? ఎవరికి శిక్ష పడాలి? ఎవరు బుద్ధి జీవులు? ఎవరూ దేశద్రోహులో? అర్థమవుతుంది కదా!
కానీ అవినీతి అక్రమాలను పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలను పెంచి పోషిస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థల పరస్పర లోపాయికారి ఒప్పందము కారణంగా ఏ రకంగా దేశ సంపదను అక్రమంగా అనుభవిస్తున్నారో కుట్రలు దేశద్రోహం పేరుతో బుద్ధి జీవులు మేధావులు మానవ హక్కుల కార్యకర్తలు ఏ రకంగా పాలకవర్గాల హింసకు బలవుతున్నారో అర్థం చేసుకోవడం ప్రజల సంక్షేమం అభివృద్ధి రీత్యా చాలా అవసరం. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి సులభంగా సాధ్యమవుతున్న నేటి రోజులలో ఒక్క నిజాన్ని అబద్ధం అని రుజువు చేయడానికి బుద్ధి జీవులు మేధావులు హక్కుల కార్యకర్తలతో పాటు న్యాయ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించినట్లయితే తలచుకుంటే నీతిని కూడా అవినీతిలో కల్పవచ్చునని, అక్రమార్కుల జాబితాలో చేర్చవచ్చునని అనేక దృష్టాంతాలు మనకు తెలియచేస్తున్నాయి అనేక చారిత్రకమైన ఆధారాలు ఉండి, సంబంధిత పోరాటాలు, న్యాయవ్యవస్థ వెన్నంటి ఉన్నప్పటికీ ఇప్పటికీ అన్యాయమే గెలుస్తుంది. న్యాయం నత్తనడక నడవడంతో విధిలేని పరిస్థితిలో సర్వోన్నత న్యాయస్థానమే ప్రభుత్వ అసంబద్ధ విధానాల పైన నిరసన వ్యక్తం చేయడాన్ని గమనిస్తే ప్రజాస్వామిక ఉద్యమాల యొక్క అవసరం రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి పైన ఉన్నట్లుగా తెలుస్తున్నది .

దేశాన్ని నాశనం చేసేది అవినీతిపరులే ! సర్వోన్నత న్యాయస్థానం చివాట్లు:-

మహారాష్ట్రలోని బీమా కోరేగాములో 2018లో జరిగినటువంటి సంఘటన తదనంతర పరిణామాల పైన బుద్ధి జీవులు మేధావులు వక్తల పైన 2020 అక్టోబర్లో చార్జి సీటు దాఖలు చేసినప్పటికీ విచారణ ఆలస్యం కావడం పైన సుప్రీం ధర్మాసనం విచారం వ్యక్తం చేస్తూ ఆందోళనతో పాటు చివాట్లు పెట్టిన విషయాన్ని గుర్తించడం చాలా అవసరం. దానివల్లనైన నేరస్తులు ఎవరు? శిక్ష ఎవరికి పడాలి? ఎవరి బలంతో కేసులు కొనసాగుతున్నాయి? నేరం చేయకుండా రుజువు కాకుండా శిక్ష అనుభవించడంలో ఉన్నటువంటి సహేత్కత ఎంత? తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వీడియోలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందరికీ పంపించామని రాష్ట్ర సీఎం కేసీఆర్ విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయం పైన స్పందించిన సుప్రీం కోర్ట్ భారత సర్వోన్నత న్యాయస్థానంలో బీమా కోరేగావ్ కేసులో నిందితులు మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నౌళఖా పిటిషన్ పైన ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు నేటి తప్పుడు రాజకీయాల నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు పరోక్షంగా తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ప్రస్తావించి “బీమా కోరేగాం నిందితులు దేశాన్ని ధ్వంసం చేస్తారని అనుకోవడం లేదని అవినీతిపరులపై చర్యలు ఎక్కడ తీసుకుంటున్నారు? ఎన్నికైన ప్రజాప్రతినిధులకే కోట్లాది రూపాయలు ఇస్తామంటూ కొందరు మాట్లాడుతున్న దృశ్యాలను చూసాము కదా! మనం కళ్ళు మూసుకొని ఏమీ జరగలేదని అనుకుంటే అంతా బాగానే ఉంటుంది కానీ లోతుగా పరిశీలిస్తే కానీ అవినీతిపరుల ఆగడాలు తెలియవు” అని కోర్టు వ్యాఖ్యానించడమే కాదు పరోక్షంగా చివాట్లు కూడా పెట్టినట్లు అయ్యింది. 73 ఏళ్ల గౌతమ్ తన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కొంతకాలమైనా గృహనిర్బంధంలో ఉంచాలని దాఖలు చేసిన పిటి షన్ పై 9 నవంబర్ 2022 బుధవారం రోజున జస్టిస్ జోసెఫ్ నాయకత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిన సందర్భంగా వెలుగు చూసిన ఈ వ్యాఖ్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలుగా మిగిలినవి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

గృహనిర్బంధాన్ని కోరడానికి కారణాలు :-

భారతదేశంలో సహజ న్యాయ సూత్రమైనటువంటి నేరం చేయనటువంటి ఏ ఒక్కరిని కూడా శిక్షించకూడదని తరచుగా చెప్పుకునే మాటను దృష్టిలో ఉంచుకొని వయస్సు పైబడి చర్మ వ్యాధితో పాటు అనేక జబ్బులతో బాధపడుతున్న తనను తన సోదరి నివాసానికి తరలించవలసిందిగా దాఖలు చేసిన గౌతం పిటి షన్ను మహారాష్ట్ర హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించవలసి వచ్చింది . ఆయన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదాన్ని అంగీకరించిన ధర్మాసనం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తున్నది. కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇందులో జోక్యం చేసుకుంటూ దేశద్రోహులతో సంబంధాలు ఉన్నాయని చెప్పడం పైన సర్వోన్నత న్యాయస్థానం విష్మయము వ్యక్తం చేస్తూ కస్టడీ రూపంలో ఆయనను గృహ నిర్బంధంలో ఉంచే విషయాన్ని పరిగణలోకి తీసుకున్నామని కావాలంటే ఎటువంటి ఆంక్షలు అయిన విధించుకోవచ్చునని జస్టిస్ జోసెఫ్ స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వ సంస్థ అనేక అనుమారాలను వ్యక్తం చేస్తూ వ్యతిరేకించిన సందర్భంలో అరాచకాలు అక్రమాలకు నిలయమైనటువంటి భారతదేశ రాజకీయాల పైన స్పందించి బుద్ధి జీవులు, మేధావులు, హక్కుల కార్యకర్తలు దేశద్రోహానికి తలపెట్టరని అవినీతిపరులైనటువంటి వారి వల్లనే పెను ప్రమాదమని చేసిన హెచ్చరిక ఇప్పటికైనా రాజకీయ పార్టీలకు, పాలక పక్షాలకు గుణపాఠం కావాల్సిన అవసరం చాలా ఉన్నది.

కార్పొరేట్ సంస్థల అక్రమాలకు పాలకవర్గాల మద్దతు :-

గత యూపీఏ హయాములో ప్రారంభమైనటువంటి కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వ అక్రమ మద్దతు ఇటీవల కాలంలో తారాస్థాయికి చేరిన కారణంగా భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న అనేకమంది ఎగవేతకు పాల్పడి ఇతర దేశాలకు తప్పించుకుని పోయిన విధానాన్ని గమనించవచ్చు ముఖ్యంగా ఎగవేత దారులలో కేవలం గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్లు మాత్రమే అధికంగా ఉండడాన్ని గమనించినట్లయితే 12 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసినట్లుగా అనేక ప్రకటనలు వెలుబడుతున్న వేళ ఇప్పటికైనా దేశాన్ని సర్వనాశనం చేసేది అక్రమార్కులే అని అంగీకరించకపోతే ఎలా? బుద్ధి జీవులు మేధావులు ప్రజల పక్షాన పని చేస్తూ, తమ జీవితాలను త్యాగం చేస్తూ, జీవన ప్రమాణాల పెంపొందించడానికి, మానవాభివృద్ధి కోసం ఆరాటపడే వారిని దేశద్రోహులుగా సంఘవిద్రోహశ క్తులుగా ప్రకటిస్తూ సంవత్సరాల తరబడి నేరం రుజువు కాకపోయినా శిక్షలు అనుభవించడాన్ని ఇప్పటికైనా భారత సర్వోన్నత న్యాయస్థానం లోతైన పరిశీలన చేయవలసిన అవసరం చాలా ఉన్నది . ఎప్పుడైనా ప్రశ్న, ప్రశ్నించే వాళ్లను శత్రువులుగా చూసే పాలక పక్షాలు అక్రమార్కులకు అక్రమంగా మద్దతిస్తున్నటువంటి సందర్భంలో ఈ దుర్నీతికి అడ్డుకట్ట వేయడానికి న్యాయవ్యవస్థ చొరవ తీసుకోవడం అత్యంత కీలకమైన సందర్భం ఇది .

ప్రస్తుత పార్లమెంటులో లోక్సభ సభ్యుల్లో 83 శాతానికి పైగా నేర చరిత్ర కలిగిన వాళ్లే ఉన్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతుంటే మరొకవైపు ప్రజల తో సంబంధం లేకుండా తమ అక్రమ ఆస్తులను, అవినీతిని, స్వార్థాన్ని రక్షించుకోవడానికి మాత్రమే కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు రాజకీయాల్లోకి అందులో చట్టసభల్లోకి రావడానికి అనుమతిస్తున్నటువంటి ఎన్నికల సంఘం కట్టడి చేస్తేనే భవిష్యత్తులో రాజకీయాలు ప్రక్షాళన చెందే అవకాశం ఉంటుంది. లేకుంటే అవినీతి రాజకీయాలే రాజ్యమేలి తే నీతిమంతులకు శిక్ష తప్పదు కదా! భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఆశించినది ఇదేనా? నిజాయితీపరులు, నీతిమంతులను అవినీతిపరులు, అక్రమార్కులను హంస పాలను నీళ్లను వేరు చేసినట్లుగా నిర్ధారించగలిగితేనే ఈ దేశంలో ఇలాంటి అక్రమాలకు కళ్లెం వేయవచ్చు. నీతిని బ్రతికించవచ్చు . ప్రజల మధ్యన ఉండాల్సినటువంటి బుద్ధి జీవులు మేధావులు కారాగారాలలో బంధించబడి పోతుంటే జైలు శిక్ష అనుభవించ వలసిన నేరగాళ్లు , అవినీతిపరులు ప్రజల మధ్యన తిరగడాన్ని ఏరకంగా సమర్తి0 చగలం.? భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ చట్టబద్ధ సంస్థల సహకారంతో ఈ విషయంలో కీలకమైనటువంటి దర్యాప్తు జరిపి న్యాయాన్ని బ్రతికించవలసిందిగా ప్రజలు ప్రజాస్వామిక వాదులు విజ్ఞప్తి చేస్తున్నారు .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading