ARTICLE'S
ఫాసిజన్ని ఓడిద్దాం లౌకిక, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడుదాం!


కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ,ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపు
జనం వెలుగు:- భారత రాజ్యాంగ స్ఫూర్తితో పాలన జరగాలని,
అన్ని రకాల మత ఉగ్రవాదం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని,
మనువాద ఆధిపత్యాన్ని, వివక్షను భూస్థాపితం చేయాలని, కులనిర్మూలన సాధన కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, వెనుకబడిన, వెనుకపడేయబడిన ప్రాంతాల అభివృద్ధి జరగాలని, ప్రత్యేకంగా ప్రభుత్వమే విద్య, వైద్యం, ఉపాధి రంగాలను నిర్వహించాలని సిపిఐ ఎం-ఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ ప్రజా నేస్తం, బాధితుల బంధువు బోరన్నగారి నేతాజీ సుభాషన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలనుడిమాండ్ చేశారు.
భారతదేశంలో అత్యంత ప్రమాదకరంగా పరిణామం చెందుతున్న మతోన్మాద ఫాసిజాన్ని ఎదుర్కోకపోతే, భారతదేశ ప్రజల జీవన విధానం భయంకరంగా మారబోతుందనే నగ్న సత్యాన్ని ప్రజలు అర్థం చేసుకోకపోతే, చారిత్రక తప్పిదం అవుతుందని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. నేటి సమాజంలో జీవిస్తున్న నీవు, నేను మాత్రమే కాదు మనమందరం భవిష్యత్ తరాలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతామని సుభాషన్న తెలిపారు.
భారతదేశంలో ఇప్పటికే ప్రమాదకరంగా చలామణి అవుతున్న మనువాద ,కుల క్రూరత్వానికి తోడుగా దేశంలో రాకెట్ వేగంతో వస్తున్న ఫాసిజం ప్రజల కనీస హక్కులను కాలరాయబోతున్నదని, ఫాసిజానికి బహుముఖాలు వుంటాయనే చారిత్రక సత్యాన్ని గుర్తించాలని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు.
ఫాసిజం ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉంటు, వివిధ దోపిడీ పాలక పార్టీలు ఫాసిజాన్ని వారి భావజాల పాలసీల ఆధారంగా, భారతదేశంలో మతోన్మాదం ఆధారంగా అమలు చేస్తున్నాయని, ఐడియాలజీ, ఫిలాసఫీ, పాలసీ, ఎత్తుగడలు ఏర్పాటు చేసుకున్న బిజేపీ పార్టీ ఫాసిజాన్ని అత్యంత నిరంకుశంగా అమలు చేస్తుందని, భూస్వామ్య, పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాద దోపిడీ, నిరంకుశత్వ ఫాసిజం ఒక రకంగా ఉంటే , బిజెపి పాలనలో ఫాసిజం ఇంకో రూపంలో వున్నదని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ కాలం నాటి ప్రకటిత నిరంకుశత్వం, ఫాసిజం అందరికి కనబడిందని, ఫాసిజం అంటే ఏమిటో ప్రజలకుఅర్ధం అయినదని, నేడు దేశంలో ఫాసిజం అప్రకటిత ఎమర్జెన్సీ రూపంలో రాజ్యమేలుతుందని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ప్రేమికుడు, నూతన ప్రజాస్వామిక విప్లవ రాజ్య స్థాపన శ్రామికుడు కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.
భారతదేశంలో అమలయ్యే ఫాసిజంలో మత విద్వేషం, వివక్ష, దోపిడి, నిరంకుశత్వం, క్రూరత్వం, హింస పెట్రేగి కనీస ప్రజాస్వామ్యం కనుమరుగై , అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులు లేకుండా అణిచివేసే అవకాశం వుందని, ఉద్యమకారులను వెతికి వెతికి, విడదీసి అణచివేస్తున్నారని ప్రజాతంత్ర హక్కుల పోరాట యోధుడు, బాధితుల బంధువు, పీడిత ప్రజల సంపూర్ణ విముక్తి కోసం నూతన ప్రజాస్వామ్యత విప్లవమే పరిష్కార మార్గమని నిరంతరం ఎలుగెత్తి చాటి చెప్పే వర్గ పోరాటవాది కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆరోపించారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న విప్లవకారులను ఉద్యమకారులను అణిచివేయడం కోసం నిరంతరం నిఘా పెడుతున్నారని ,వేల కోట్ల ప్రజాధనం విప్లవోద్యమాన్ని అణిచివేయడానికి, ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుబారా ఖర్చు పెడుతున్నాయని,ప్రజా ఉద్యమాల కార్యకర్తలపై, నాయకులపై, కుట్ర
కేసులు పెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని. నిర్బంధిస్తున్నారని, హత్యలు చేస్తున్నారని అణగారిన వర్గాల హక్కుల కార్యకర్త, పేద ప్రజల విముక్తి కోసం విప్లవమే నా మార్గమని ఎలుగెత్తి చాటి చెప్పే వెనుకబడిన వర్గాల పోరాట యోధుడు కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న ఆరోపించారు.
ప్రమాదకరమైన ఫాసిస్టు, మతోన్మాద శత్రువును ఎదుర్కోవటానికి ప్రాంతాలు, కులాలు, మతాలకతీతంగా అందరం కలిసి ఉద్యమ కార్యాచరణను రూపొందించుకోవాలని, ప్రజల చైతన్యం ఆధారంగా పాలసీలు, కార్యాచరణ రూపొందించుకోవాలని దేశంలో ,రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి అన్ని ప్రజా సంఘాలకు ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న సూచించారు.
ప్రస్తుతం పెను ప్రమాదంగా దూసుకు వస్తున్న ఫాసిస్టు దోపిడిని ఎదిరించడానికి ఐక్యనిర్మాణాలు అవసరమని, తమ తమ అస్థిత్వాలను కాపాడుకుంటూనే విశాల ఐక్య సంఘటన ద్వారా ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రజా సంఘాల నేతలకు కార్యకర్తలకు రాసిన బహిరంగ లేఖలో ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న 9848540078 పిలుపునిచ్చారు.
ఫాసిజాన్ని ఓడిద్దాం – లౌకికవాదాన్ని సాధిద్దాం అనే నినాదం తోటి దేశవ్యాప్తంగా ప్రజాసంఘాలు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగాఉద్యమించాలని ప్రజాస్వామిక విలువల ప్రేమికుడు, కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు.
బ్రిటీష్ సామ్రాజ్యవాద వలస దోపిడి, నిరంకుశత్వం, ఆధిపత్యం, నియంతృత్వ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన ఏర్పడాలనే జాతీయ స్వాతంత్ర్యోద్యమ ఆకాంక్షలను ప్రతి భారతీయ పౌరుడు, పౌరురాలు నెమరు వేసుకోవాలని, వాటి సాధనకు బాధ్యతగా పట్టుదలతో
కృషి చేయాలనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఆర్థిక, సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం దక్కేలాగున పాలన ఉండాలని, పార్టీలు,
పాలకులు, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు జవాబుదారిగా వుండాలనీ, భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమ ఆకాంక్షలైన సమాన హక్కులు, ప్రభుత్వ విద్య, వైద్యం, ఉపాధి ప్రజలందరికీ అందేలాగున ప్రయత్నాలు ఉండాలనీ, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
స్వార్ధం, అవినీతి కారణంగా సమాజంలో సివిల్ వార్ వచ్చే అవకాశం ఉందనీ, సమాజంలోని అన్ని రకాల అసమానతలను, కుల వివక్షను రూపుమాపే నియంత్రణ చట్టాలు ఉండాలనీ , కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు , డిమాండ్లకు విరుద్ధంగా ప్రత్యేక చట్టాల ద్వారా కాశ్మీర్ స్వయం ప్రతి హక్కులను రద్దు చేసినట్లుగానే భారతదేశంలో తరతరాలుగా కొనసాగుతున్న దుర్మార్గమైన కుల వ్యవస్థను రద్దు చేస్తూ పార్లమెంటులో చట్టం తీసుకురావాలని ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న డిమాండ్ చేశారు.
సుఖ,శాంతులతో వికసిస్తున్న సుందరమైన మన దేశం మీద దండయాత్రల తరలివచ్చిన దొంగల ముఠా అగు,విదేశీ ఆర్యుల సంతతి మనువాదాన్ని , మనువాదం పెంచి పోషించిన అన్ని రకాల వివక్షతలను, ఆధిపత్యమును, దోపిడిని భూస్థాపితం చేయాలనీ, పాలకుల మార్పిడి మాత్రమే కాదు పరిపాలనలో మార్పులు రావాలనీ సామాజిక పరివర్తకుడు సమసమాజ స్వాప్నీకుడు ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న కోరారు.
కొన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు కాపాడిన అన్ని రకాల సంపదలను సమతుల్యతతో ప్రజల అవసరాల కోసం అభివృద్ధి ప్రణాళికలు ఉండాలనీ ప్రజాతంత్ర ఉద్యమకారుడు బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
భారత జాతీయ స్వాతంత్ర్యోద్యమ ఆకాంక్షలను రాజ్యాంగ బద్దంగా అమలు చేసే ప్రజాస్వామ్యయుత పాలకుల పాలన ఉండాలనీ, దేశంలో కొనసాగుతున్న అన్ని రకాల ప్రైవేట్ రంగా రంగాలపై ప్రభుత్వం పూర్తి నియంత్రణ చూపాలని , విద్యా ,వైద్యమును పూర్తిగా ప్రభుత్వమే నిర్వహించాలని
ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న 8328277285 డిమాండ్ చేశారు.
భిన్నత్వంలో ఏకత్వం ఒక నినాదంగా మాత్రమే కాకుండా కుల, మత, జాతి విద్వేషాలను రెచ్చగొట్టని పాలకుల పాలన ఉండాలనీ, అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వుండాలనీ ప్రజా నేస్తం బోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.
స్వదేశీ నినాదం ఓటు బ్యాంకు రాజకీయం కాకుండా వాస్తవ క్రియా రూపంలో ఉండాలనీ,స్వలాభంతో కూడిన విదేశీ మోజు సమాజానికి తీవ్ర నష్టం చేస్తుందనీ, ప్రభుత్వమే పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలనీ,కార్మికుల చట్టాలకు రక్షణ కల్పించాలనీ ప్రజా బంధువు బోరన్నగారి నేతాజీ సుభాషన్న డిమాండ్ చేశారు.
అన్ని రకాల మత ఛాందసవాదం, విద్వేషాలు, ఉగ్రవాద చర్యలు ప్రజాస్వామ్యానికి, ప్రజల అభివృద్ధికి అడ్డంకి అవుతాయనీ, మత ఛాందసవాదం శాసనమైతే సమాజానికి తీవ్ర నష్టం కలుగుతుందనీ ప్రజా నేస్తం బోరన్న గారి నేతాజీ సుభాషన్న తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక పరివర్తన కోసం, కుల నిర్మూలన కోసం, మతసామరస్యం కోసం, అసమానతులకు తావులేని అభ్యుదయ సమాజ నిర్మాణం కోసం నూతన ప్రజాస్వామిక సమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఎమ్. ఎల్ సెక్రటరీ, బాధితుల బంధువు ,ప్రజా నేస్తం కామ్రేడ్ బోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 , 8328277285 ప్రజలకు, ప్రజా సంఘాలకు నేడు రాసినటువంటి బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేశారు.
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










