నిర్మల్
రాజురాలో ప్రజా గోషా బిజెపి భరోసా


జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలంలోని రాజుర శక్తి కేంద్రం ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ 270 మంది ప్రజలతో నిర్వహించడం జరిగింది. కిట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు డాక్టర్ పరగటి రమాదేవి అసెంబ్లీ కన్వీనర్ తాడేవారి సాయినాథ్ కన్వీనర్ సుమన్ కుమార్ మండల అధ్యక్షులు గంగాధర్ జిల్లా కార్యదర్శి నల్ల రమేష్, శక్తి కేంద్రం ఇంచార్జ్ కుంట రాజేశ్వర్, పోలింగ్ బూత్ అధ్యక్షులు వరకే భోజన్న తదితరులు పాల్గొన్నారు. కార్నర్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము కేంద్ర ప్రభుత్వ పథకాలు కేంద్రం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ యొక్క మార్గదర్శకత్వం గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా ముధోల్ నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ యొక్క నిరంకుశ ప్రభుత్వం యొక్క తీరును ఎండగడుతూ అన్ని పథకాలలో జరిగిన అంతులేని అవినీతిని ఎండ కట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పథకాలు అన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతులకు కిసాన్ సన్మానిధితో పాటు ఎంతో విలువచేసే బిజెపి యూరియా, పొటాష్ మొదలగు ముఖ్యమైన ఎరువులను కొన్ని వేల సబ్సిడీలతో రైతులకు అందిస్తున్న విషయము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కప్పిపుచడమే కాకుండా వాస్తవాలను ప్రజలకు తెలియనీయకుండా చేస్తుంది. ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము ఎరువులను రైతులకు తక్కువ ధరలకు అందించడం కోసము రామగుండంలో ఎరువుల కర్మాకారము కొన్ని వేల కోట్ల ఖర్చుతో మళ్లీ తిరిగి ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గ్రామపంచాయతీ నిధులు ఉపదామినిధులు అదేవిధంగా పల్లె ప్రకృతి వనాలు మరియు రోడ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆయుష్మాన్ భారత్ మాతాలకు పథకాల గురించి చెప్పడం జరిగింది.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








