Connect with us

ARTICLE'S

పైశాచిక సంస్కృతినీ ప్రతిఘటించండి

suresh sitharla

Published

on

పైశాచిక సంస్కృతినీ ప్రతిఘటించండి …!
మానవ విలువల పరిరక్షణ కోసం ఉద్యమించండి…!!

ప్రజా నేస్తం, సంఘసంస్కర్త
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పిలుపు

జనం వెలుగు:– జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పసిడి కలలు కన్న డాక్టర్ ప్రీతి కథ అర్ధాంతరంగా ముగిసిపోయిందనీ.. సీనియర్ వేదింపులు భరించలేక తీవ్రంగా కలత చెంది హానికారక ఇంజక్షన్ తీసుకున్న పీజీ వైద్య విద్యార్థిని అయిదురోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయిందనీ.. కడకు – కన్నవారిని సంబంధీకుల్ని శోకసముద్రంలో ముంచేసిందనీ.. ప్రజా బంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కన్నీరు బెట్టుకున్నారు. వేధింపులపై ముందుగా తనకు తెలియబరచకుండా ప్రిన్సిపల్కు ఎందుకు ఫిర్యాదు చేశావని ప్రీతిపై కస్సుబుస్సులాడిన అనస్థీషియా విభాగాధిపతిని ఏం చేయాలి? అతడితోపాటు కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపల్, ఆస్పత్రి సూపరింటెండెంట్ దృష్టికి సమస్యను తీసుకెళ్ళినా ఎవరూ పట్టించుకోలేదని, ఆ తరవాత వేదింపులు కొనసాగాయని బోరున విలపిస్తున్న మృతురాలి తండ్రికి బదులిచ్చేదెవరు? అని ప్రజావ్యవాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న ప్రశ్నించారు.

ర్యాగింగుకు పాల్పడినవారిపై సత్వర కేసుల నమోదు బాధ్యత ఆయా విద్యాసంస్థలదేనని, సమస్యా పరిష్కరణలో వైఫల్యానికి సంబంధిత యాజమాన్యాలే జవాబుదారీ వహించాలని సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ, ప్రజా నేస్తం కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.

స్వీయ కర్తవ్యాన్ని తుంగలో తొక్కిన ఉదాసీన అధికార గణాన్ని కఠినంగా శిక్షించాలనీ,, ప్రజా బంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ర్యాగింగ్ నియంత్రణకంటూ విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) క్రోడీకరించిన మార్గనిర్దేశాల అమలు నీరోడుతుండగా దేశం నలుమూలలా పలు ఉన్నత విద్యాలయాలు అమానుష ఘటనలకు, వికృత వేధింపులకు నెలవులవుతున్నాయనీ,, ఇలాంటి వాళ్ల తమ కడుపున పుట్టారని కన్నవారు కుమిలిపోయేంతగా విద్యాసంస్థల్లో ర్యాగింగ్ రక్కసులు చెలరేగిపోతున్నారనీ సామాజిక పరివర్తకుడు జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు..

చదవడానికి ఎంత సమయమైనా సరిపోదనే డాక్టర్ కోర్సుల్లోనివారే అధికంగా తమ జూనియర్లను వేధిస్తుండటం తనలాంటి పెద్దగా చదువురాని నిరక్షరాసులైన కోట్లాది మంది శ్రమజీవులను నిశ్చేష్టపరుస్తోందనీ.. కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ
జైబొరాన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రాణభిక్ష పెట్టే వైద్యుల్ని నారాయణ స్వరూపంగా గౌరవించే సంప్రదాయం మనదనీ,, ఆ వృత్తి అంతటి పవిత్రమైనదనీ,, బాధ్యతాయుతమైనది. స్వస్థత చేకూరుతుందని రోగుల్లో నమ్మకం, విశ్వాసం పెంపొందించాలంటే వైద్యులకు ఎంతో ఓర్పు.. నేర్పు కావాలి. తోటి డాక్టర్ల పట్టే కిరాతకంగా పశువుల్లా ప్రవర్తించేవాళ్లు- రోగులను ఎలా సమాదరిస్తారు. సాంత్వనపరుస్తారు?. అని వైద్య విద్యను అభ్యసిస్తున్న డాక్టర్లను డాక్టర్లు తయారు చేస్తున్న ప్రొఫెసర్ అధ్యాపకులను, వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లను , విద్యావంతులను జీవితంలో పెద్దగా చదువుకొని , పెద్ద బాలశిక్ష తో జీవిత ప్రస్థానం మొదలుపెట్టిన సామాన్యుడు, సంఘసంస్కర్త జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు.

తాను ప్రేమించిన యువతినే కోరుకున్నాడన్న కక్షతో మిత్రుణ్ని మట్టుపెట్టి తల మొండెం వేరు చేసి గుండెను చీల్చి భాగ్యనగర శివార్లలో సెల్ఫీలు దిగిన బీటెక్ విద్యార్థి రాక్షస కాండ తనలాంటి సామాన్య ప్రజలను గగ్గోలు పుట్టిస్తోందనీ మానవీయ విలువల ప్రచారకుడు జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవేదన వ్యక్తం చేశారు.

కర్ణాటకలో తండ్రినే హతమార్చి ‘ముప్పై ముక్కలుగా నరికేసిన తనయుడి ఘాతుకం, తనతో సహజీవనం చేస్తున్న అమ్మాయిని అంతమొందించి 35 ముక్కలుగా నరికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చెల్లాచెదురుగా పారేసిన అఫ్తాబ్ పైశాచికం వంటివి సామాజిక జీవన చిత్రం ఎంతగా చిద్రమైపోయిందో చాటుతున్నాయనీ ప్రజాతంత్ర ఉద్యమకారుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న కన్నీరు పెట్టుకున్నారు.

అటువంటి అసహనం, స్వాభావిక వైపరీత్యాలు విద్యాలయ ప్రాంగణాలకూ విస్తరిస్తున్న తీరు భయాందోళనలు రేకెత్తిస్తోందనీ.. ఏడిపించడం, వేధించడం, క్రూరత్వం, శారీరకంగా మానసికంగా హింసించి భయవిహ్వలతకు లోనుచేయడమనే వికృత చేష్టలకు పర్యాయపదంగా ర్యాగింగ్ మారిపోయిందని ,, వరుసగా ఇటీవల జరుగుతున్న ఇటువంటి సంఘటనలను గుర్తుచేసుకొని ప్రజా బంధువు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న బాధపడ్డారు.

లోగడ తమిళనాట ఒక మెడికల్ కాలేజీలో రికార్డు రాసిపెట్టడానికి నిరాకరించాడని క్రోధంతో రగిలిపోయిన సీనియర్ విద్యార్థి తన జూనియర్ను పరమ కిరా తకంగా హతమార్చినప్పుడు యావద్దేశం నివ్వెరపోయిందనీ ఇప్పటికీ ఇటువంటివేధింపులు, ప్రాణహరణాలు దేశవ్యాప్తంగా కొనసాగుతుండటమే దురదృష్టకరమని.. ప్రజాతంత్ర వాది జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తీవ్రమైన దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

అయిదేళ్ల కాలంలో సీనియర్ల దౌర్జన్యాలు, తీవ్రమైన పనిభారం తట్టుకోలేక 119 మంది మెడికోలు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఓయూ విద్యార్థి ఉద్యమ జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ పాలడుగు శ్రీనివాస రావు P S R 9948269127 మొన్న వాకింగ్లో రాగి చెట్టు కింద తనకు చెప్పాడని ఆటువంటి ఘటనల్లో నిందితుల్ని అరెస్టు చేసి రిమాండుకు తరలిస్తేనో, కళాశాల నుంచి సస్పెండ్ చేస్తేనో సమస్య పరిష్కారమైపోయినట్లు కాదనీ సామాజిక కార్యకర్త జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తేల్చి చెప్పారు.

ర్యాగింగుకు పాల్చాడబోమంటూ విద్యార్థుల నుంచి తీసుకుంటున్న ప్రమాణ పత్రాలు, ర్యాగింగ్ నిరోధక కమిటీలు, నిఘా బృందాలు నిష్ప్రయోజకాలని ,, నిరంతరం దేశంలో ఏదో ఒకచోట నిత్యం అగ కుండా సాగుతున్న వేధింపులు ఎలుగెత్తుతున్నాయనీ ఒకనాడు విద్యార్థి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పి డి ఎస్ యు ప్రతిఘటన విద్యార్ సంఘం రాష్ట్ర కన్వీనర్ గా 1996 నుండి మొదలుకొని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ వ్యవస్థాపక కార్యదర్శి వరకు నేటి వరకు పూర్తి కాలం సమాజ హితానికే జీవితాన్ని అంకితం చేసిన అభ్యుదయ వాది జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న పేర్కొన్నారు.

మెడికల్ పీజీ విద్యార్థులు వారానికి 48 గంటలే పనిచేయాలన్న ఎన్ఎమ్ఎ నిర్దేశాలు ఆచరణలో చెల్లని కాసులవుతున్నాయనీ.. తన చిన్ననాటి గురువుగారు,, విద్యార్థులకు చిన్నప్పుడు నీతి, నైతిక విలువలను దండించి విడమర్చి చెప్పిన విప్లవ వాది, లెక్కల మాస్టరు ,, కులం కంటే గుణం గొప్పదని ఎప్పుడూ చెప్పే అభ్యుదయ వాది.. ఆదర్శ ఉపాధ్యాయుడు హనుమంతరావు సార్ 9247664443 ఎప్పుడు చెప్తూ ఉండేవాడని ప్రజా నేస్తం
జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గుర్తు చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లా ఏపూర్ జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో హనుమంతరావు సార్ ఎప్పుడో 32 క్రితం చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న గుర్తు చేసుకుంటూ పాఠశాలవిద్య దశలో పిల్లలకు నైతిక విలువలు అలవరచడంలో వ్యవస్థ వైఫల్యం కారణంగానే ర్యాగింగ్ భ్రష్ట సంస్కృతిని గుర్తించాలనీ కేంద్ర రాష్ట్ర పాలకవర్గాలకు ప్రజాభిలయ వాది జైబోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గుర్తు చేశారు. దాని మూలాలపై దృష్టి పెట్టి అన్ని అంచెల్లోనూ దిద్దు బాటు చర్యలు చేపట్టనంత వరకు, సమర్ధ పరిష్కారమన్నది ఎండమావేనని సుభాషన్న పేర్కొన్నారు.

విద్యార్థులకు చిన్ననాటి నుండి నీతి నైతిక విలువలు దేశభక్తి భావాలు మానవీయ విలువలు నేర్పాలని ప్రజాతంత్ర విద్యా విధానం రూపొందించబడాలని వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమకారుడు అనుక్షణం సమాజ హితాన్ని కాంక్షించే సామ్యవాద సమాజ స్వప్నికుడు జైబోరన్నగారి నేతాజీ సుభాషన్న 9848540078 ప్రజలకు , ప్రజాస్వామిక వాదులకు గుర్తు చేశారు. మనిషిని మనిషిగా గుర్తించే విద్యా విధానం రూపొందించబడాలని శాస్త్రీయ ప్రజాతంత్ర విద్యా విధానం అమల్లోకి రావాలని ఇందుకోసం పాలకవర్గాలపై బలమైన ఒత్తిడి పెంచాలని అందుకు ప్రజా పోరాటాలే శరణ్యమని
ప్రజా నేస్తం జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి

janamvelugunews

Published

on

రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Continue Reading

ARTICLE'S

వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…

janamvelugunews

Published

on

జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.

ఇదే అదునుగా వర్ని తైబజార్ నిర్వాహకులు కొన్న వారి దగ్గర నుండి 50 రూపాయలు అమ్మిన వారి దగ్గర నుండి ఒక్కో మేకకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారని వ్యాపారులు, కొనుగోలుదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు కొంతమంది గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఫిర్యాదు చేయగా అవును డబ్బులు కట్టాలని నిర్లక్ష్యగా సమాధానం చెబుతున్నాడని తెలిపారు తై బజార్ వ్యాపారులతో మిలాకతయి మార్కెట్లో అక్కడే ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారని మేకల కొనుగోలు దారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సెక్రెటరీకి వివరణ కోరగా అమ్మినవారు 25 రూ. కొన్నవారు 25 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తై బజార్ వ్యాపారులు అధిక డబ్బులు వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ పంచాయతీ సెక్రెటరీ దగ్గరుండి మరీ తైబజార్ వ్యాపారులతో మేకల క్రయ, విక్రయాల పై డబ్బులు వసూలు చేస్తున్నట్లు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Continue Reading