Connect with us

World

నేడు అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం  

janamvelugunews

Published

on

నేడు అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం  

జనంవెలుగు:- అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవాన్ని (ఆస్టరాయిడ్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 30న నిర్వహిస్తారు. 1908, జూన్ 30న రష్యా సమాఖ్య, సైబీరియాపై తుంగస్కా గ్రహశకలం ప్రభావంకు గుర్తుగా, గ్రహాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంతో ఈ దినోత్సవం జరుపుతారు. ఇటీవలికాలంలో భూమిపై అత్యంత హానికరమైన గ్రహశకలానికి సంబంధించినత సంఘటన ఇది. 1908, జూన్ 30న రష్యాలోని సైబీరియా స్టోనీ తుంగుస్కా న‌ది సమీపంలోని భూమిని అతిపెద్ద గ్ర‌హ‌శ‌కలం ఢీకొట్టడంతో దాదాపు 2,072 చ‌.కి.మీ. విస్తీర్ణంలో అటవీ ప్రాంతం నాశ‌నమైంది. దానికి గుర్తుగా జూన్ 30న అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవంగా జరుపుతున్నారు. ఐక్యరాజ్యసమితి తన తీర్మానంలో ప్రతి సంవత్సరం జూన్ 30 న ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. గ్రహశకలం దినాన్ని స్టీఫెన్ హాకింగ్, చిత్రనిర్మాత గ్రిగోరిజ్ రిక్టర్స్, బి 612 ఫౌండేషన్ ప్రెసిడెంట్ డానికా రెమి, అపోలో 9 వ్యోమగామి రస్టీ ష్వీకార్ట్, క్వీన్ గిటారిస్ట్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త బ్రియాన్ మే కలిసి స్థాపించారు. రిచర్డ్ డాకిన్స్, బిల్ నై, పీటర్ గాబ్రియేల్, జిమ్ లోవెల్, అపోలో 11 వ్యోమగామి మైఖేల్ కాలిన్స్, అలెక్సీ లియోనోవ్, బిల్ అండర్స్, కిప్ థోర్న్, లార్డ్ మార్టిన్ రీస్, క్రిస్ హాడ్ఫీల్డ్, రస్టీ ష్వీకార్ట్, బ్రియాన్ కాక్స్ సహా 200 మంది వ్యోమగాములు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, కళాకారులు గ్రహశకల దినోత్సవ ప్రకటనకు సంతకాలు చేశారు.  2014, డిసెంబరు 3న ఈ అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం అధికారికంగా ప్రారంభించబడింది. 2014, ఫిబ్రవరిలో రాక్ బ్యాండ్ క్వీన్ కోసం ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, గిటారిస్ట్ బ్రియాన్ మే 51 డిగ్రీ నార్త్ చిత్రానికి దర్శకుడు గ్రిగోరిజ్ రిక్టర్స్ తో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. లండన్ పై కల్పిత ఉల్క ప్రభావ సంఘటన ఫలితంగా ఏర్పడిన మానవ పరిస్థితుల నేపథ్యంతో రూపొందించిన ఈ చిత్రానికి బ్రియాన్ మే సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రాన్ని 2014 స్టార్‌మస్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన తరువాత రెమి, ష్వీకార్ట్, రిక్టర్స్, మే కలిసి 2014, అక్టోబరులో ఈ దినోత్సవాన్ని స్థాపించి.. లార్డ్ మార్టిన్ రీస్, రస్టీ ష్వీకార్ట్, ఎడ్, థామస్ జోన్స్, రియాన్ వాట్, బిల్ నై విలేకరుల సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఈ కార్యక్రమం లండన్ లోని సైన్స్ మ్యూజియం, కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్, న్యూయార్క్, సావో పాలో నుండి ప్రత్యక్షప్రసారం చేయబడింది.  2017 గ్రహశకలం దినోత్సవం రోజున, మైనర్ గ్రహం 248750 ను అంతర్జాతీయ ఖగోళ యూనియన్ అధికారికంగా గ్రహశకలం అని పిలిచింది. ఈ దినోత్సవం రోజున గ్రహశకలాల స్థితిన గమనించి భూమిని, భవిష్యత్ తరాలను ఆయా విపత్తు సంఘటనల నుండి రక్షించడానికి చేయవలసిన కార్యకలాపాల గురించి చర్చలు జరుపుతారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

World

వరద బాధితులకు మేము సైతం

janamvelugunews

Published

on

వరద బాధితులకు మేము సైతం

తెలుగు జర్నలిస్టుల సంక్షేమసంగం

జనం వెలుగు, వెబ్ డెస్క్:- గత రెండు దశాబ్దాల్లో రాష్ట్రాన్నిఅతలా కుతలం చేసిన అతి పెద్ద వరదల్లో విజయవాడ వరద కూడా వచ్చి చేరింది.లక్షల మంది ప్రజలను ప్రభావితం చేశాయి.మనిషి ప్రకృతి ముందు ఎంత అల్పుడో మొన్న కేరళలోని వాయనాడ్ బీభాత్సవం తెలియజేస్తే లేటెస్ట్ గా బెజవాడ వరదలు మరోసారి కన్నెర్రాశాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిస్సహాయులకు మరిన్ని సేవలు అందించే లక్ష్యంతో, తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత ముడు రోజులుగా,వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ బాధితులు సహాయం కోసం ఎదిరి చూస్తున్నారు. అటు జర్నలిస్ట్ ల కైనా ఇటు సామాన్య ప్రజలకైనా ఆపద వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుండే యూనియన్ తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంగం.. వరదల్లో చిక్కుకున్న బాధితులకు 5000వేల పులిహార ప్యాకెట్లు, మంచి నీళ్ళ బాటిల్స్, బిస్కెట్స్ పంపిణీ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా వరద నీటితో అంటురోగాలు, వ్యాధులు ప్రబలకుండా బాధితులకు హోమియోపతి రోగనిరోధక శక్తి బిళ్ళలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు జర్నలిస్టులందరికి కృతజ్ఞతలు తెలిపారు.

Continue Reading

World

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పచ్చ జెండా

janamvelugunews

Published

on

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు పచ్చ జెండా

జనంవెలుగు, హైదరాబాద్:- దశాబ్దాల పోరాటానికి ఫలితం దక్కింది. ఎట్టకేలకు ఎస్సీ వర్గాల డిమాండ్ ఆచరణ రూపంలోకి వచ్చేందుకు ఇక అడుగులు పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీల్లో ఉప వర్గీకరణ సాధ్యమేనా అన్న అంశంపై విచారణ జరిపిన ధర్మాసనం. కీలక తీర్పు వెలువ రించింది. వర్గీకరణ సమర్థ నీయం అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వర్గీకరణపై అధికారం కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ఎస్సీ వర్గీకరణపై మూడు దశాబ్దాలుగా పోరాటం కొనసాగుతోంది.2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల్లో ఉప వర్గీకరణ కోసం బిల్లు ప్రవేశపెట్టారు ఆనాటి సీఎం చంద్రబాబు. ఈ విషయంపై సుప్రీం కోర్టులో 2004లో వర్గీకరణపై రాష్ట్రాలకు అధికారం లేదంటూ అప్పటి జస్టిస్ చిన్నయ్య తీర్పు వెలువరించారు. ఆ తర్వాత 2010లో పంజాబ్ ప్రభుత్వం వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్ కల్పిం చింది. అయితే దీనిని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. పంజాబ్ వేసిన పిటిషన్‌ను విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం జస్టిస్ చిన్నయ్య ధర్మాసనం తీర్పును తప్పుబట్టింది. ఆ తీర్పును పున‌:సమీక్షిం చాలని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసింది. దీంతో పాటు దాఖలైన 23 పిటిషన్లను విచారించిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం. గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఏడుగురు సభ్యులు ఉన్న ధర్మాసనంలో ఆరుగురు వర్గీకరణను సమర్థించగా జస్టిస్ బేలా త్రివేది వ్యతిరేకించారు.

Continue Reading

World

ఆ పేరు వింటేనే బ్రిటిష్‌ వారి గుండెలో చలిజ్వరం

janamvelugunews

Published

on

ఆ పేరు వింటేనే బ్రిటిష్‌ వారి గుండెలో చలిజ్వరం

సిపాయిల తిరుగుబాటులో ఆంగ్లేయులకు ఎదురు తిరిగిన మొదటి సిపాయి మన మంగళ్ పాండే

-నేడు ఆయన జయంతి

జనంవెలుగు, విశ్లేషణ:- భారతదేశనికి స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలని కలలుకన్న మహనీయుడు అతడు. అతడి పేరు వింటేనే బ్రిటిష్‌ వారి గుండెలో చలిజ్వరం పుట్టించిన భారతదేశ సింహస్వప్నం. బహుశా ఈ తరం యువకులకు మంగల్‌ పాండే గురించి అంతగా తెలువకపోవచ్చు కానీ దేశ మొదటి స్వతంత్య్ర సంగ్రామంలో బొబ్బిలి పులిల పోరాడిన ధీరుడు. మంగల్‌ పాండే 19 జులై 1827న ఉత్తరప్ర దేశ్‌లోని నగ్వ గ్రామంలో దివాకర్‌, అభైరని పాండే లకు జన్మించాడు. 1857- 58 మధ్య కాలంలో ఉత్తర, మధ్య భారతదేశంలో బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా సిపాయిల తిరుగుబాటు జరిగింది. భారత చరిత్రకారులు ఈ తిరుగుబాటును ప్రథమ స్వతంత్య్ర సంగ్రా మంగా భావిస్తారు. దశాబ్దాలుగా భారతీయ సిపాయిలకి బ్రిటిష్‌ అధికారులకీ మధ్యగల జాతీయ, సాంస్కృతిక, సామాజిక వైరుధ్యాలు తిరుగుబాట్లకి దారితీశాయి. బ్రిటిష్‌ వారికి భారత పాలకులైన మొగలులు, పీష్వాల పట్ల నిర్లక్ష్య వైఖరి లాంటి రాజకీయ కారణాల వల్ల భారతీయులు బ్రిటిష్‌ పాలనను వ్యతిరేకించారు. డౌహల్సి ప్రవేశపెట్టిన రాజ్యసంక్రమణ సిద్ధాంతం లాంటివి ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. ఈనేపథ్యంలో బ్రిటిష్‌ వారు సిపాయిలను ఇబ్బందులకు గురిచేశారు. దాని ఫలితంగా 1857 మార్చ్‌ నెలలో 34వ దేశీయ పదాతి దళానికి చెందిన సైనికుడు మంగల్‌ పాండే బ్రిటిష్‌ సార్జెంట్‌ మీద దాడిచేసి, అతని సహాయకుడిని గాయపరచాడు. దానికి సార్జెంట్‌.. మంగల్‌ పాండేను మతపిచ్చి పట్టినవాడిగా భావించి పాండేను బంధించాలని జమిందార్‌ను ఆజ్ఞాపించాడు. అతను కూడా జమిం దార్‌ ఆజ్ఞను తిరస్కరించాడం ద్వారా సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్‌ వారిని భారత సిపాయిలు ఊచకోత కోశారు. దీంతో మంగల్‌ పాండేను, జమిందార్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం పట్టుకొని ఏప్రిల్‌ 7న ఉరితీసింది. పాండే స్ఫూర్తితో మధ్య భారతదేశంలో ఝాన్సీరాణి, నానాసాహెబ్‌ లాంటి ధీరులు కూడా స్వతంత్య్ర సంగ్రామంలో పోరాడారు. పాండేకు గౌరవార్ధం అప్పటి ప్రభుత్వం 1984లో పోస్టల్‌ స్టాంప్‌ను విడుదల చేసింది.

Continue Reading