నిజామాబాద్
శిశు మనోవికాస కేంద్రం ప్రారంభోత్సవంలో.. సి పి సాయి చైతన్య


శిశు మనోవికాస కేంద్రం ప్రారంభోత్సవంలో.. సి పి సాయి చైతన్య
జనం వెలుగు, నిజామాబాద్:- జిల్లా కేంద్రం లోని డాక్టర్ విశాల్ ఆకుల న్యూరో సైకియాట్రీ సెంటర్ లో శిశు మనోవికాస కేంద్రం కమీషనర్ అఫ్ పోలీస్ సాయి చైతన్య చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈకార్యక్రమంలో సాయి చైతన్య మాట్లాడుతూ డాక్టర్ విశాల్ ఈ కేంద్రాన్ని కమర్షియల్ గా కాకుండ సేవా దృక్పధం తో ప్రారంభించి మూడు సంవత్సరాల వయసు లోనే పిల్లల్ని అన్ని విధాలుగా, అన్ని రకాలుగా అభివృద్ధి చెందించడం లో ప్రత్యేక పాత్ర వహిస్తున్నారన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి నేటి శిశువులు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంటే రాబోయే తరం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది ఓ నూతన భారతాన్ని చూడొచ్చాన్నారు. ఈ కేంద్రం లో పిల్లలకు సంబందించి ప్లే థెరఫీ, స్పీచ్ థెరఫి, బిహేవియర్ థెరఫీ, ఒక్క్యూపాషనల్ థెరఫీ, ఫిజియో థెరఫీ, ఐ క్యూ లెవెల్స్ లాంటివి పిల్లలకు సంబంధించి ఇందులో ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా డాక్టర్ విశాల్ ఆకుల ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ మాట్లాడుతూ ఈ శిశు మనోవికాస కేంద్రం లో శిశు దశ లోనే వికాస లోపాలు, ప్రవర్తన సమస్యలు, సరి చేసి పిల్లలను సంపూర్ణంగా అభివృద్ధి చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. మొక్కయి వంగనిది మానై వంగునా అన్నట్లుగా చిన్న దశలోనే వారి వికాస లోపాలను గుర్తించి సరి చేయనున్నట్లు అయన తెలిపారు. ఈ సెంటర్ ప్రారంభ విషయం లో ముఖ్య పాత్ర తన సతీమణి నాగపద్మ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా సి పి సాయి చైతన్య, డాక్టర్లు ఈ రవీంద్రారెడ్డి, టి జీవనరావు, వై శ్రీధర్ రాజు, వి జార్జ్ రెడ్డి, అజ్జా శ్రీనివాస్, హరీష్ స్వామి, రమనేశ్వర్, కప్పల రాజేష్,,పి బి కృష్ణ మూర్తి, డాక్టర్ కౌలయ్య, అడ్వకేట్ ఆర్ జగదీశ్వర్ రావు, ఎం సిద్దయ్య, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు,
నిజామాబాద్
| nandipet ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం


ఘనంగా ప్రజా పాలన మండల స్థాయి సమావేశం
జనంవెలుగు, నందిపేట్:- ప్రజా పాలనలో భాగంగా గురువారం నందిపేట మండల కేంద్ర సాయిబాబా ఫంక్షన్ హాల్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే నినాదంతో మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ల్యాండ్ సర్వే డిపార్ట్మెంట్ ఏడి శ్రీనివాసులు పాల్గొన్న ఈ సమావేశానికి వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మండల పాలన సిబ్బంది హాజరయ్యారు,
ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది కూడా పాల్గొని అనుకోకుండా జరిగే అగ్ని ప్రమాదాలను ఎలా నివారించవచ్చో, గ్యాస్ సిలిండర్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు ఎలా స్పందించాలో అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా చేసి చూయించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.., ప్రజల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం అనే లక్ష్యంతో రాష్ట్రంలో ప్రజాప పాలన కార్యక్రమాలు జరుపుకోవడం జరిగిందని, అందులో భాగంగానే ఈరోజు మండల స్థాయి సమావేశం జరుపుకుంటున్నామన్నారు.
ప్రజాభివృద్ధి కొరకు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకొని వారికి మంచి ఫలితాలను అందించేందుకే ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ ప్రజా పాలన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారులకు ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా సహకరించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.
మండల కేంద్ర సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రజా పాలన కార్యక్రమానికి అద్భుత ఫలితాలు వస్తున్నాయని, ఎందుకంటే గ్రామ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై ప్రజాపాలనలో సంబంధిత శాఖల అధికారులు అందుబాటులో ఉండి తక్షణమే
నిర్ణయం తీసుకోవడం వల్ల పరిష్కారం దొరుకుతుందని, లబ్ధిదారులకు అధికారులకు వారధిగా ఈ ప్రజా పాలన కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని కొనియాడారు. తాసిల్దార్ సంతోష్ రెడ్డి, ఆర్ ఐ, ఎ ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్
|nizamabad పనుల్లో వేగం పెంచాలి


పనుల్లో వేగం పెంచాలి
* యూజీడీ కనెక్షన్ పనులను పర్యవేక్షించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…
ఇందూరు: అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కి ఇంటి నుంచి ఇచ్చే కనెక్షన్ల పనుల్లో వేగం పెంచాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్ లో గురువారం యుజిడి అనుసంధాన పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన చోట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ శాఖ ఆధ్వర్యంలో కనెక్షన్ లు ఇస్తున్నారన్నారు.
నగరవాసులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయితే పనులు నాణ్యతతో చేపట్టాలని, ఇంటి యజమానులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సరైన పద్ధతిలో పనులు పూర్తి చేయాలన్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. పనులు చేసే బృందాలని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు ఇపకాయల సుమిత్రా కిషోర్, మఠం పవన్, చింతకాయల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
|Armoor సిబిఎస్ఇ పదో తరగతి ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం


సిబిఎస్ఇ పదో తరగతి ఫలితాల్లో క్షత్రియ విద్యార్థుల ప్రభంజనం
జనం వెలుగు ఆర్మూర్:- నిన్న వెలువడిన సిబిఎస్ఇ 2025- 2026 పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో క్షత్రియ విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డా. విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించబడిన విద్యార్థుల అభినందన కార్యక్రమం లో విద్యార్థులు తమ స్వీయ అను భవాలను, అధ్యాపకుల కృషిని తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏనుగు ప్రణతి 483/500 మార్కులతో ప్రథమ స్థానం, ముకుంద్ హర్షిణి 462/500 మార్కులతో ద్వితీయ స్థానాన్ని (బెస్టాఫ్ 5 ఔట్ ఆఫ్ 6 సబ్జెక్ట్స్) పొందినారు.
ఈ సందర్భం గా స్కూల్ ప్రిన్సిపాల్ డా. విజయ లక్ష్మి మాట్లాడుతూ 100 శాతం ఉత్తీర్ణతతో మెరుగైన ఫలితాలను సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, రాబోయే రోజుల్లో స్ఫూర్తి వంత మైన ప్రణాళికను రూపొందించుకొని మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందిస్తూ చదువుతో పాటు సంస్కారాన్ని పాటిస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
స్కూల్ కరెస్పాండెం ట్ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య, సంస్కారవంతమైన నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో క్షత్రియ పాఠశాలను స్థా పించమని జరిగిందని అన్నాడు. ఇట్టి ఫలితాలకు విశేష కృషికి పాటుపడిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించాడు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల కోశాధికారి అల్జా పూర్ గంగాధర్, డైరెక్టర్ అల్జాపూర్ వీరేందర్, అధ్యాపాక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.








