Crime
సమిష్టి కృషితో నేరాల నియంత్రణ: సీపీ సాయి చైతన్య


వార్షిక క్రైమ్ రిపోర్ట్ వెల్లడించిన సిపి
జనం వెలుగు, నిజామాబాద్ డిసెంబర్ 31: పోలీసు సిబ్బంది అంకితభావం, ప్రభుత్వ విభాగాల సమన్వయం, ప్రజల సహకారంతో నేరాల నివారణకు కృషి చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంగళవారం 2025 వార్షిక క్రైమ్ రిపోర్ట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను వెల్లడించారు.
గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఓవరాల్ క్రైమ్ రేటు తగ్గినట్లు తెలిపారు. 2024లో మొత్తం 8983 వివిధ రకాల నేరాలు నమోదు కాగా, 2025లో అవి 8624కు తగ్గినట్లు వివరించారు. అయితే పిల్లలపై జరిగే నేరాలు 120 నుంచి 168కు పెరిగినట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చినట్లు సీపీ పేర్కొన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టడంతో ప్రమాదాల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. గతేడాది 857 రోడ్డు ప్రమాదాలు జరగగా 353 మంది మృతి చెందారు, 782 మంది గాయపడ్డారు. 2025లో 780 ప్రమాదాలు చోటుచేసుకోగా 276 మంది మృతి చెందినట్లు తెలిపారు. ప్రమాదాల సంఖ్యతో పాటు మృతుల సంఖ్యను కూడా తగ్గించగలిగామని చెప్పారు.
డ్రంకెన్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. నిరంతరం నిర్వహిస్తున్న తనిఖీల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, రోడ్డు ప్రమాదాల నివారణలో ఇవి కీలకంగా మారాయని అన్నారు. గతేడాది 8410 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా, 2025లో విస్తృత తనిఖీలతో ఆ సంఖ్య 17,627కు చేరినట్లు వెల్లడించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం డ్రైవర్‌కే కాకుండా ఇతరులకూ ప్రమాదకరమని, దీనిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
డ్రగ్స్‌పై యుద్ధం చేయడమే రానున్న సంవత్సరానికి ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే కళాశాలలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, వాటిని మరింత విస్తరించనున్నట్లు చెప్పారు.
నిజామాబాద్ జిల్లా జాతీయ రహదారులను ఆనుకొని ఉండటంతో అంతరరాష్ట్ర దొంగల కదలికలు ఎక్కువగా ఉన్నాయని, వీటిని అరికట్టేందుకు డైనమిక్ పేట్రోలింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. వరదలు వంటి విపత్తుల సమయంలో తక్షణ సహాయం అందించేందుకు పోలీస్ శాఖ నుంచే డీడీఆర్ఎఫ్ ఫోర్సును సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలపై మాట్లాడుతూ, సంబరాలు చేసుకోవడాన్ని పోలీస్ శాఖ అడ్డుకోదని, కానీ హద్దులు మీరకూడదని సూచించారు. న్యూ ఇయర్ సందర్భంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రూ.10 వేలకుపైగా జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ సమావేశంలో అదనపు డీసీపీ బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సైబర్ క్రైమ్ ఏసీపీ వై. వెంకటేశ్వర్ రావ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, సీసీఆర్బి సీఐ వీరయ్య, ఐటీ కోర్స్ సిబ్బంది, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
Crime
|Armoor పేకాట స్థావరంపై సిసిఎస్ మెరుపు దాడి


పేకాట స్థావరంపై సిసిఎస్ మెరుపు దాడి.
జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కెట్, తిరుమల గాడిన్స్ ఫంక్షన్ హాల్ లో పేకాట ఆట స్థావరం పై దాడి చేసి 6 గురు పేకాట రాయుళ్ళను,3 వా హనాలు, 1 కారు, 6 సెల్ ఫోన్లు, 1,17940 రుపాయల నగదును స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఎచ్ఓకు అప్పగించనైనది. నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ ఏసిపి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 6 గురిని దాడి చేసి పట్టుకోవడం జరి గింది. పేకాట ఆడుతున్న రత్నగిరి శంకర్ గౌడ్, సుంకరి మహేష్ శాస్త్రి నగర్ నిర్మల్, మాదారపు అభిలాష్ దివ్య నగర్ నిర్మల్, సయ్యద్ ఆసిఫ్ బైంసా, మెడిదల వెంకట్ గౌడ్ మా మిడి పల్లి,తుమ్మల దత్తాద్రి గణేష్ నగర్ బైంసా తదితరులపై కేసు నామోదు చేయడం జరిగిందని ఎస్ఎచ్ఓ సత్యనారాయణ తెలిపాడు.
Crime
| Nizamabad crime అంతరాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ల, రాగి తీగల దొంగల ముఠా అరెస్టు


అంతరాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ల, రాగి తీగల దొంగల ముఠా అరెస్టు
జిల్లా పోలీసు కమీషనర్ సాయి చైతన్య
జనం వెలుగు ఆర్మూర్: నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్, నందిపేట్, బోధన్ రూరల్, ఎడపల్లి, నిర్మల్ జిల్లాలోని బాసర,మూధోల్, బైంసా, కుంటాల,నర్సాపూర్ జి తథితర మండలాల శివారులో ట్రాన్స్ ఫార్మర్లకు సంబంధించిన రాగి తీగ లను దొంగ తనాలకు పాల్పడే అం తరాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేసినట్లు నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య తెలిపాడు. జిల్లా కేంద్రంలోని పోలీసు కమీ షనరేటు కార్యాలయంలో మంగళ వారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెల్లడించాడు.
ఎలక్ట్రిసిటి డిపార్ట్ మెంట్ కు సంబంధించిన అధికారులు తమ ఆధీనంలో గల ట్రాన్స్ ఫా ర్మర్ల నుండి రాగి తీగలను దొంగలు దొంగలించుకు పోయారని గతంలో ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నామోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఉత్తర రూరల్ సిఐ బి శ్రీనివాస్, నవీపేట్ ఎస్ఐ కే శ్రీకాంత్ అధికారులు దర్యాప్తు చేయడం జరిగిందని ఆయన తెలిపాడు.
అఫ్జల్ ఖాన్ ఆటో డ్రైవర్ నిజామాబాద్, అన్సార్ అలియాస్ హుస్సేన్ ఖాన్ ఆటో డ్రైవర్ రేంజల్ మండలం, షేక్ తాహేర్ ఆటో డ్రైవర్ నిజామాబాద్, అర్బాజ్ ఖాన్ అలియాస్ అల్బాజ్ మేస్త్రి భైంసా, ప్రస్తుతం ధర్మపురి హిల్స్ నిజామాబాద్, సిద్దిక్ ఖాన్ ఆటో డ్రైవర్ రేంజల్ మండలం, మహమ్మద్ అఫ్సర్ ఆటో డ్రైవర్ భైంసా ప్రస్తుతం ఫరారిలో ఉన్నాడని ఆయన తెలిపాడు. మహబూబ్ ఖాన్ స్క్రాప్ షాప్ వ్యాపారం, భైంసా, బోర్గే బాలాజీ స్టీల్ షాప్ దుకాణం, అర్సపల్లి నిజామాబాద్, షేక్ ఆరీఫ్ పాత ఇనుప సామాన్ల వ్యాపారం, ఇత్వార బజార్ నాందేడ్, మహారాష్ట్ర, మహమ్మద్ రజా పాత ఇనుప సామాన్ల వ్యాపారం, వెంగళరావు కాలనీ నిందితుల నుండి సొమ్మును రికవరీ చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపాడు. 20 క్వింటాళ్ళ రాగి తీగలు, 2 లక్షల 75 వేల రూపాయల నగదు,రెండు టు వీలర్ వాహనాలు, ఒక ఆటో, దొంగ తనానికి వాడిన హక్సు బ్లేడ్లు 05 పని ముట్లు ఉన్నాయని ఆయన తెలిపాడు.
అఫ్జల్ ఖాన్ కు సంబంధించిన ఆటోలో అందరూ కలిసి వచ్చి ట్రాన్స్ ఫార్మర్లకు సంబంధించిన రాగి తీగలను దొంగ తనం చేసే వారని, వీరి మీద సుమారు 34 కేసులకు సంబంధించి సుమారు 10 క్వింటాళ్ళ రాగి తీగలను దొంగిలించడం జరిగిందని, ఈ రాగి తీగలను నిజామాబాద్ లోని ఏపిఎచ్బి కాలనీలో చిన్న రూంను అద్దెకు తీసుకుని అక్కడ దాచి పెట్టి,వాటిని గోనె సంచులలో నింపుకుని తరలించుకు పోయి అమ్ముకుని సొమ్ము చేసుకునే వారని ఆయన తెలిపాడు. భైంసాకు చెందిన మహబూబ్ ఖాన్ కిలోకు 800 రుపాయల వంతున అమ్మేవారని, నిజామాబాద్ కు చెందిన బాలాజీకి, రహన్ రజాకు, నాందేడ్ కు చెందిన ఆరిఫ్ లకు అమ్మగా వచ్చిన డబ్బులను జల్సాలకు, ఇతర వాటికి ఖర్చులు చేసే వారని ఆయన తెలిపాడు.
పోలీసులు తమ చాక చక్యంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఈ గ్యాంగ్ ను పట్టుకుని నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు సంబంధించిన 34 కేసులను డిటెక్టు చేయడం జరిగిందని నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి రిమాండ్ తరలించడం జరిగిందని ఆయన తెలిపాడు.ఈ కేసును చేదించిన నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రకాష్ యాదవ్ ఆద్వర్యంలో టీంలుగా ఏర్పడి ఉత్తర రూరల్ సిఐ బి శ్రీనివాస్,నవీపేట్ ఎస్ఐ కే శ్రీకాంత్,ఎస్ఐ యాదగిరి గౌడు, ఎస్ఐ రాజశేఖర్, మాక్లూర్ ఎస్ఐ గంగాధర్,5 వ టౌన్ ఏఎస్ఐ గఫార్, హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, కానిస్టేబుల్లు రాజారెడ్డి, సందీప్, అబ్బులు,శ్రీకాంత్ గౌడ్, దత్తాత్రేయ గౌడ్, నాగరాజు, శంకర్, సాయిలు, రామకృష్ణ, సచిన్ తదితరులను సిపి అభినందించాడు.
Crime
|nandipet crime నందిపేటలో పట్టుబడ్డ ఆల్ఫాజోలం


నందిపేటలో పట్టుబడ్డ ఆల్ఫాజోలం
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం జోజిపేట్ గ్రామంలోని కళ్ళు డిపో వద్ద బుధవారం నందిపేట ఎస్సై రామ్ పోలీస్, ఎక్సైజ్ సిబ్బందితో దాడి నిర్వహించారు. దాడిలో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం(కల్తీ కళ్ళు తయారు చేసేందుకు ఉపయోగించే మత్తు పదార్థం)167.5 గ్రాములను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్సై రామ్ మాట్లాడుతూ నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల జోజిపేట గ్రామంలో ని కళ్ళు డిపో వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడి చేయడం జరిగిందని, ఆ దాడిలో ముగ్గురు వ్యక్తులపై అనుమానం వచ్చి విచారించగా వారి వద్ద కల్తీ కళ్ళు తయారు చేసేందుకు ఉపయోగించే మత్తు పదార్థాలను పట్టుకోవడం జరిగిందని, సికోటి రవీందర్ గౌడ్, బత్తిని భరత్ కుమార్ గౌడ్, ధర్మేందర్ లను అదుపులోకి తీసుకున్నామని, ప్రధాన నిందితుడు జయవర్ధన్ గౌడ్ పరారీలో ఉన్నాడని, వీరిపై ఎన్ డి పి ఎస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నామని వీరి వద్ద నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, దొరికిన మత్తు పదార్థం విలువ ఒక లక్ష 67 వేయిలు ఉంటుందని ఆయన అన్నారు.














