నిజామాబాద్
| Nandipet తీరనున్న గ్రంథాలయ సమస్య..


తీరనున్న గ్రంథాలయ సమస్య..
జనంవెలుగు, నందిపేట్, మూన్ డిజైన్ శేఖర్:- నందిపేట మండల కేంద్ర ప్రజలకు ఎన్నో ఏళ్లుగా సరైన గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాజ్ నగర్ దుబ్బ ప్రాంతంలోఅరకొర వసతులతో ఇరుకుగా ఉన్న అద్దె భవనంలో ఉండడంతో మండల కేంద్ర యువకులు చాలా నష్టపోతున్నారు. మండల కేంద్ర పేద విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు సరైన సదుపాయాలతో, విశాలమైన ప్రాంగణం గల గ్రంథాలయం ఎంతో దోహదపడుతుంది. అయితే త్వరలోనే ఆ కళ నెరబోనుంది. శనివారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి నూతన భవన నిర్మాణానికి గల స్థలాన్ని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నున్న గ్రామపంచాయతీ స్థలాన్ని సందర్శించి 45 లక్షలను మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంతిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ…. నేటి సమాజంలో విద్యార్థులు ఎంతో చురుకుగా పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు గ్రంథాలయాల లు ఎంతగానో దోహదం చేస్తాయని, నందిపేట మండల కేంద్ర ంలో జనాభాకు సరిపడా సదుపాయాలతో గ్రంథాలయం లేదని, మంచి విశాలమైన స్థలంలో నూతన భవనాన్ని నిర్మాణం చేపట్టేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు సహకారాన్ని అందిస్తున్నారని నూతన భవనానికి 45 లక్షల రూపాయల ను మంజూరు చేస్తున్నానని అన్నారు త్వరలోనే నూతన గ్రంథాలయం ప్రారంభించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్, ఉప సర్పంచ్ వాసరి రామచందర్, విడిసి అధ్యక్షులు ఎర్రం భోజేందర్, మంగి ఎల్లన్న, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.














