నిజామాబాద్
|Nizamabad జనం వెలుగు దినపత్రిక ప్రజల ఆలోచనలకు అద్దం


జనం వెలుగు దినపత్రిక ప్రజల ఆలోచనలకు అద్దం
తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి. కేశవులు
జనంవెలుగు, తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి:- సమాజంలో ప్రజా చైతన్యాన్ని వెలిగించే దీపంగా, ప్రజల గొంతుకగా నిలిచిన ‘జనం వెలుగు’ తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ బి. కేశవులు నేడు నిజాంబాద్ నగరంలో ఘనంగా ఆవిష్కరించారు. ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యత, మేధో చైతన్యం అనే మూడు స్థంభాలపై నిలిచిన ఈ క్యాలెండర్ కేవలం తేదీలు, పండుగల సమాహారం మాత్రమే కాదు, ప్రజల ఆలోచనలకు దిశ చూపించే ఒక విజన్ డాక్యుమెంట్‌గా రూపుదిద్దుకుంది. క్యాలెండర్ ఆవిష్కరణ ఒక సామాజిక సందేశం. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్ కేశవులు మాట్లాడుతూ, “పత్రిక అనేది వార్తల వ్యాపారం కాదు ప్రజల ఆత్మగౌరవాన్ని, హక్కులను కాపాడే సామాజిక బాధ్యత” అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను నిర్భయంగా ప్రశ్నించడం, అధికార వ్యవస్థలకు అద్దం పట్టడం, అణగారిన వర్గాల గొంతుకగా నిలవడం ఇవే నిజమైన మీడియా ధర్మాలని ఆయన పేర్కొన్నారు. ‘జనం వెలుగు’ క్యాలెండర్ ఈ విలువలనే ప్రతి నెల, ప్రతి రోజు గుర్తుచేసేలా రూపొందించబడిందని తెలిపారు. తెలంగాణ మేధావుల సంఘం – మేధో చైతన్యానికి కేంద్రం ఈ కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన తెలంగాణ మేధావుల సంఘం తెలంగాణలో మేధోచర్చలకు, ప్రజా ఉద్యమాలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్న సంస్థ. రాష్ట్ర చరిత్ర, భాష, సంస్కృతి, ప్రజా ఉద్యమాల నేపథ్యంతో ఏర్పడిన ఈ సంఘం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కట్టుబడి ఉందని మరోసారి ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైంది. ‘జనం వెలుగు’ క్యాలెండర్ ప్రత్యేకతలు ఈ క్యాలెండర్‌లో ప్రతి నెల ఒక సామాజిక అంశాన్ని ప్రధానంగా తీసుకొని రూపొందించడం విశేషం.
మీడియా బాధ్యతపై డాక్టర్ కేశవులు స్పష్టమైన మాటలు
మీడియా
ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న సవాళ్లపై ఆయన విస్తృతంగా మాట్లాడారు. “నేటి కాలంలో వార్తలకంటే వేగమే ప్రధానం అయింది. కానీ వేగం కోసం నిజాన్ని త్యాగం చేయడం ప్రమాదకరం. ప్రజల విశ్వాసమే మీడియా యొక్క అసలైన మూలధనమని కొనియాడారు. సోషల్ మీడియా ప్రభావంతో వాస్తవాల కంటే భావోద్వేగాలు ఎక్కువగా ప్రచారం అవుతున్నాయని, దీనిని ఎదుర్కోవాలంటే సంప్రదాయ మీడియా మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజల మధ్యకు క్యాలెండర్
ప్రజల కోసమే ఈ క్యాలెండర్‌ను గ్రామాలు, పట్టణాలు, విద్యాసంస్థలు, గ్రంథాలయాలు, కార్యాలయాల్లో విస్తృతంగా పంపిణీ చేయనున్నట్లు ‘జనం వెలుగు’ అధినేత సీతర్ల సురేష్ ప్రకటించారు. యువతలో ప్రశ్నించే ధోరణి పెంపొందించడం, సమాజంపై బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ ప్రయత్నం సాగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు మరియు మహిళా హక్కుల వేదిక కన్వీనర్ డాక్టర్. బి .హర్షిణి , ప్రజా మీడియా అధినేత డి ఎల్ ఎన్ చారి. కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ బి. హర్ష వర్ధన్ ఇతర రంగాల నిపుణులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మేధావులు, జర్నలిస్టులు మాట్లాడుతూ ఇలాంటి క్యాలెండర్‌లు కేవలం గోడలపై వేలాడే వస్తువులు కావని, ప్రజల ఆలోచనల్లో వేలాడే సందేశాలుగా మారాలని ఆకాంక్షించారు. ‘జనం వెలుగు’ ఈ బాధ్యతను సమర్థంగా నిర్వహిస్తోందని ప్రశంసించారు.
సామాజిక ఉద్యమంగా ‘జనం వెలుగు’ సాధారణంగా క్యాలెండర్ అనగానే పండుగలు, సెలవులు గుర్తుకు వస్తాయి. కానీ ‘జనం వెలుగు’ క్యాలెండర్ ప్రజా సమస్యలు, సామాజిక బాధ్యతలు గుర్తు చేసే ఒక ఉద్యమ పత్రంగా రూపాంతరం చెందిందని పలువురు వ్యాఖ్యానించారు. ఇది ఒక ప్రచురణ కాదు. ఇది ఒక ఆలోచనా ప్రక్రియ. భవిష్యత్ దిశ ఈ క్యాలెండర్ ఆవిష్కరణతో ‘జనం వెలుగు’ తన జర్నలిజాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే సంకల్పాన్ని ప్రకటించినట్లైంది. రాబోయే రోజుల్లో ప్రజా చర్చలు, సెమినార్లు, మేధో వేదికలు నిర్వహిస్తూ క్యాలెండర్‌లోని అంశాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని నిర్వాహకులు తెలిపారు. మొత్తంగా, ‘జనం వెలుగు’ తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ—ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇది ప్రజల ఆలోచనలకు వెలుగు నింపే ప్రయత్నం. డాక్టర్ బి. కేశవులు చేతుల మీదుగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం మేధోచైతన్యం, సామాజిక బాధ్యత, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచింది. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల గొంతుకగా నిలిచే మీడియా అవసరాన్ని మరోసారి ఈ కార్యక్రమం గుర్తు చేసింది.
నిజామాబాద్
మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు


మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు
జనంవెలుగు, ఆర్మూర్: జిల్లా కేంద్ర ఆర్మూర్ మున్సిపల్ పరిధి లో గల శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప దేవాలయంలో ప్రతి నెల మొదటి బుధవారం పురస్కరించు కొని శ్రీ నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ గణపతి శ్రీసుబ్రహ్మణ్యం శ్రీ అయ్యప్ప స్వామి వార్లకు ప్రత్యేక పూజలు హారతి మంత్రపుష్పం, మధ్యాహ్నం 12.30 నిముషాలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడినది.
మణికంఠ సేవా సమితి అధ్యక్షులు: చెపూర్ ధనుంజయ్
ఈ సందర్భంగా మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూరు దనంజయ్ మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమానికి వి. అయ్యప్ప శ్రీనివాస్ అయ్యప్ప ఆలయం నిర్మాణ కర్త సహాయ సహకారం అందిస్తున్నందుకు నవనాథ సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ దాతలకు . పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ మణికంఠుడు యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షులు కౌటికేవిజయ్, కోశాధికారి సురేష్ చారి, ప్రచార కార్యదర్శి గంగా మోహన్, కార్యవర్గ సభ్యులు ఒడ్డేన్న, సలహదారులు శ్రీహరి, నవనాథ సిద్ధుల గుట్ట కమిటీ సభ్యులు దత్తు గురు స్వామి, కొండవీటి శ్యామ్ గురు స్వామి, మోహన్ రావు గురు స్వామి, గ్యాస్ ప్రభాకర్ గురు స్వామి,నవీన్ రెడ్డి గురు స్వామి, నర్సారెడ్డి గురు స్వామి గోవింద్ పేట్, అయ్యప్ప భక్తులకు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు


ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి


జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు
నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.














