నిజామాబాద్
| SRSP అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామని ఏడాది దాటింది


శ్రీరాంసాగర్ లో సిల్ట్ తీస్తామన్న మంత్రి
ఆశతో ఎదురు చూస్తున్న రైతాంగం
జనం వెలుగు ఆర్మూర్:- ఉత్తర తెలంగాణాలో రైతుల పాలిట వరప్ర దాయినై వెలసిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పేరుకు పోయిన(మట్టిని)సిల్ట్ ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీసి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి ఏడాది దాటిన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది.గత ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పర్యటనలో భాగంగా ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకునేందుకు గాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రకటన చేశాడు. నిజామాబాద్ జిల్లాలో నైజాం రాజు నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టులో పూడిక (మట్టి) పేరుకు పోవడంతో ఆయకట్టు రైతాంగానికి సాగునీటికి తీవ్ర ఇబ్బందులను ఎదురుకోవలసి వస్తున్నందున ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1964 లో శ్రీరాంసాగరానికి పునాది రాయి వేయడం జరిగింది.
1930 లో నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయికి పూడిక చేరిపోగా దానికి భిన్నంగా శ్రీరాంసాగరాన్ని నిర్మించడం జరిగింది.కాగా గోదావరి పరివాహక మంతా నల్లరేగడి నేలలు అయినందున ఉప్పెనలా ఉరికి వచ్చిన ఉప్పెనలతో సిల్ట్ పూడిక వచ్చి చేరింది. వచ్చిన వరదలను తట్టుకుని తిరిగి బయటకు నీటిని పంపే విదంగా 42 వరద గేట్లతో పాటు 6 సిల్ట్ గేట్లను నిర్మించడం జరిగింది. శ్రీరాంసాగర్ రిజర్వాయర్ పేరుకుపోయిన పూడికను ఎప్పటికప్పుడు తీసి వేసే విధంగా నిర్మించిన ఈ 6 సిల్ట్ గేట్లను ఏ ఒక్క అధికారి ఎత్తిన దాఖలాలు లేవు. గోదావరిలో వరదలు వచ్చినప్పుడే ఈ(సిల్ట్) పూడిక 6 గేట్లను ఎత్తి శ్రీరాంసాగర్ రిజర్వాయర్ లో పేరుకు పోతున్న పూడికను ఎప్పటికప్పుడు బయటకు పంపాల్సిన అధికారులు చేసిన తప్పిదం వలన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉనికికే ప్రమాదం పొంచి ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
అప్పట్లోనే సుమారు 1000 కోట్ల భారీ నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పేరుకు పోయిన పూడికను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తొలగిస్తామని కాంగ్రెసు పార్టీ రైతు పక్షపార్టీ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాటలను రైతులు జ్ఞాపకం చేసుకుంటున్నారు.


నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.










