నిజామాబాద్
| Nizamabad ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలి


ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూర్చాలి
జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి
కలెక్టర్ తో కలిసి ప్రత్యేక సదరం శిబిరంను ప్రారంభించిన జిల్లా జడ్జి
జనంవెలుగు, నిజామాబాద్, జనవరి 24 : ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పూర్తి స్థాయిలో లబ్ది చేకూరేలా సంబంధిత శాఖల అధికారులు చొరవ చూపాలని జిల్లా జడ్జి జీ.వీ.ఎన్.భరతలక్ష్మి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చొరవతో డీఆర్డీఏ, సెర్ప్, విద్యా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో శనివారం ప్రత్యేక అవసరాల బాలబాలికల కోసం సదరం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి జిల్లా జడ్జి లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, దివ్యాంగులైన తమ పిల్లలకు సదరం సర్టిఫికెట్లు, ఆసరా పెన్షన్లను ఇప్పించాలని పలువురు తనను కలిసి కోరడం జరిగిందన్నారు. దీంతో సంబంధిత అధికారులను సంప్రదించి, జిల్లా కలెక్టర్ తోడ్పాటుతో ఈ ప్రత్యేక సదరం శిబిరాన్ని ఏర్పాటు చేయించామని తెలిపారు. దివ్యాంగులైన పిల్లలు వారికి ఏం కావాలి అన్నది అడగలేని పరిస్థితిలో ఉంటారని, వారి అవసరాలను సంబంధిత అధికారులే గుర్తించి సహకారం అందించాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వారు పూర్తి స్థాయిలో లబ్ది పొందేలా చొర చూపాల్సిన గురుతర బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. భవిత కేంద్రాలలో కనీస సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దివ్యాంగులకు ప్రతి వారం సదరం శిబిరం నిర్వహిస్తూ సర్టిఫికెట్లు జారీ చేస్తారని, అర్హులైన వారికి పెన్షన్ అందిస్తారని, ఈ విషయాన్ని తోటి వారికి తెలియజేయాలని దివ్యాంగుల తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకపోతే, సరైన విధంగా సేవలు అందించకపోతే జిల్లా అధికారులకు తెలుపాలని, సరైన స్పందన రాకపోతే జిల్లా న్యాయసేవా సంస్థను సంప్రదించవచ్చని సూచించారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఈ శిబిరాలలో సదరం సర్టిఫికెట్లు ఇప్పించిన అనంతరం, అర్హులైన వారికి త్వరితగతిన ఆసరా పెన్షన్లు మంజూరయ్యేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపుతామని అన్నారు. ఈ మేరకు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని దివ్యాంగులైన పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం ప్రభుత్వం తగిన సదుపాయాలతో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కేంద్రాలలో సాధారణ పిల్లలతో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలలు మమేకమై వైకల్యం బారి నుండి క్రమక్రమంగా కోలుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. భవిత కేంద్రాలలో పిల్లలకు పూర్తి స్థాయిలో సదుపాయాలు అందుబాటులో ఉంచుతూ, వారికి అవసరమైన స్పీచ్ థెరపి, ఫిజియోథెరపి వంటివి అందించాలని రిసోర్స్ పర్సన్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, ప్రభుత్వ వైద్య కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ జలగం తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.




















