Connect with us

నిజామాబాద్

| Armoor అవినీతి లేని ఆర్మూర్ ను చేశా….

janamvelugunews

Published

on

Views: 8790

అబద్దాల కోరు అనుముల రేవంత్.

కళ్యాణ లక్ష్మిలో 50 కిలోల బంగారం అప్పు తీర్చు.

ఆర్మూర్ అభివృద్ధికి, ప్రతి పక్షంలో ఉండి 660 కోట్లు తెచ్చా..

ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి.

జనం వెలుగు ఆర్మూర్:- కబ్జా కోరులు, కమీషన్ దారులు (ఏజెంట్లు) రౌడీలు, గుండాలు లేని అవినీతి రహితంగా ఆర్మూర్ ను తయారు చేశానని ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి అన్నాడు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ లో బుధవారం మున్సిపల్ ఎన్నికలలో బిజెపి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ప్రచారంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించాడు.  గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున సిఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చ లేదని ఏ ముఖం పెట్టుకొని ప్రజలను కాంగ్రెసు ఓట్లు అడుగు తుందో తెలపాలని ఆయన అన్నాడు.

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లో ఇస్తానన్న తులం బంగారం ఆర్మూర్ లో 5000 మందికి 50 కిలో ల బంగారంను సిఎం రేవంత్ రెడ్డి బాకి పడ్డాడని ఆయన తెలిపాడు. అలాగే వృద్దాప్య ఫించన్లు 2000 లను 4000 రుపాయలకు చేస్తానని, మహిళలకు 2500 రుపాయలు ఇస్తానని మోస పూరిత వాగ్దానా లతో గద్దెనెక్కిన సిఎం రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ప్రజలను అడు గుతావో చెప్పాలని ఆయన అన్నాడు. ప్రతి పక్ష పార్టీలో ఉన్నప్పటికీ నా ఆర్మూర్ ను అభివృద్ధి చేసేందుకు గాను సుమారు 660 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చానని ఆయన తెలిపాడు.

ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికలలో బిసిలకు 90 శాతం అవకాశం కల్పించిన పార్టీ ఒక్క బిజెపి పార్టీయేనని ఆయన తెలిపాడు. అధికారంలోకి వచ్చిన 2 సంవ త్సరాలలో ఏ ఒక్క అవినీతి పాల్ప డకుండా ప్రజల కోసం పనులను చేశానని, నేను ఏదైనా అవినీతికి పాల్పడిన ఆనవాలు నిరూపిస్తే ఆర్మూ ర్ అంబేద్కర్ చౌరస్తాలో తల నరుక్కుంటానని ఆయన ప్రతి పక్ష నాయకులకు ఆయన సవాల్ విసిరాడు. బిఆర్ఎస్ జీవన్, కాంగ్రెసు విన య్ ల జెండాల వేరైనా ఎజెండా ఒకటేనని ఆయన తెలిపాడు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం

janamvelugunews

Published

on

Views: 4

సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజకుమార్ మాట్లాడుతూ…. విద్యార్థుల చదువుకు సంబంధించిన పురోగతి, అలాగే సమస్యలు తదితర విషయాలపై చర్చించడం జరిగిందని, తమ పిల్లలు చదువుకునే చదువు గురించి తెలుసుకొనేందుకు కళాశాలకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అని, ఇలాగే తల్లిదండ్రులు, టీచర్లు కలిసి విద్యార్థులపై పర్యవేక్షణ చేస్తే విద్యార్థులు మంచి మార్గంలో నడిచేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్ ఓ డి లు లావణ్య, కిషోర్, లక్ష్మణ్ శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

| nandipet యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు

janamvelugunews

Published

on

Views: 224

యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు

నందిపేటలో యూరియా కొరకు రైతుల ధర్నా, యూరియా ఆప్ ను రద్దు చేయాలంటూ నిరసన

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో నందిపేట మండల రైతులు శుక్రవారం యూరియా దొరుకుత లేదంటూ… యూరియా యాప్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే యూరియా యాప్ ను రద్దుచేసి రైతులకు యూరియా బస్తాలు అందేటట్టు చూడాలని రోడ్డెక్కారు. లక్కంపళ్లి, చిమ్రాజ్పల్లి, నందిపేట రైతులు చేపట్టిన ఈ ధర్నాతో వివేకానంద చౌరస్తాలో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి.

స్థానిక ఎస్సై శ్యామ్రాజ్, ఎస్సై 2 రాము లు జోక్యం చేసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడించి ధర్నాను విరమింప చేశారు. ఈ సందర్భంగా రైతు తెల్వెద అబ్బి గంగారం మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ విధానం సరైన రీతిలో చేయట్లేదని, రైతుకు యూరియా కావాల్సి వస్తే యాప్ లో బుకింగ్ చేసుకున్న వాళ్లకే యూరియా సరఫరా చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే సొసైటీలో యూరియా మాయమైపోతుందని, అసలు నిజమైన లబ్ధిదారులకు యూరియా బస్తాలు అందడం లేదని, ఈ సమయంలో రైతు పొలానికి యూరియా వేయనట్లయితే వరి రైతు తీవ్రంగా నష్టపోతారని, యూరియా దొరకకపోతే రైతుకు ఉరే గతి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆప్ విధానంపై అవగాహన కల్పించ కుండా… సరఫరా చేయడం సరైనది కాదని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే యూరియా అయిపోవడం ఏంటని, చదువుకోని వారికి యూరియా బుకింగ్ చేసుకోవడం ఇబ్బంది కలుగుతుందని, ఆప్ విధానం కాకుండా ప్రత్యామ్నాయం చూడాలని అధికారులను కోరారు.

Continue Reading

నిజామాబాద్

|nandipet ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

janamvelugunews

Published

on

Views: 90

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం షాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని యువత పెద్ద ఎత్తున జై శివాజీ జై భవాని అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలి వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం హన్మండ్లు మాట్లాడుతూ అఖండ భారతావనిలో హిందూ ధర్మాన్ని కాపాడిన ఏకైక మహావీరుడు శివాజీ అని, ఆయన ధైర్య సాహసాలను ఎంత పొగిడిన తక్కువేనని, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే మొగలుల ప్రయత్నాన్ని తిప్పికొడుతూ ధర్మరక్షణకై యుద్ధ రంగంలో కదం తొక్కిన మహావీరుడని, ఎన్నో విజయాలు సాధించి హిందూ ధర్మాన్ని కాపాడిన ధైర్యశాలి ఆశంబుజీ మహారాజ్ అని కొనియాడారు. నేటి యువత ఆయనని స్ఫూర్తిగా తీసుకొని హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తమ వంతుగా కృషి చేయాలని హితవు పలికారు. ఉప సర్పంచ్ నీరడి రాములు, దత్తపురం భోజన్న, ఆమందు వంశీ, దినేష్ గౌడ్, పుల్ల మహేష్, ఉద్గిరి అరవింద్, పిట్ల మోహన్, గ్రామ యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Continue Reading