Connect with us

నిజామాబాద్

52 డివిజన్ ప్రజలకు అండగా ఉండి, అభివృద్ధికి కృషి చేస్తా

janamvelugunews

Published

on

52 డివిజన్ ప్రజలకు అండగా ఉండి, అభివృద్ధికి కృషి చేస్తా

జనంవెలుగు, నిజామాబాద్:- జిల్లా కేంద్రంలో 52 డివిజన్ బి జె పి అభ్యర్థి కొరడి కిరణ్ డివిజన్ లోనే పుట్టి పెరిగి ఇంత వాడిని అయ్యానని, మీ బిడ్డగా, తమ్ముడిగా, అన్నగా, ఆదరించి నన్ను కార్పొరేటర్ గా గెలిపిస్తే అందరికి ఎల్లవేళలా అండగా ఉండి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని కొరడి కిరణ్ అన్నారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం డివిజన్ లోని కెనాల్ కట్ట, ముఘల్ పుర, మమ్మదేవి నగర్ ప్రాంతాలలో ముమ్మరంగా ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు.

కిరణ్ తో పాటు ప్రచారం లో డివిజన్ లోని ప్రజలు మన ఇందూర్ – మన మేయర్ అంటూ స్వచ్చందంగా, సంతోషంగా పాల్గొన్నారు. కిరణ్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని,

అలాగే డివిజన్ లోని ఆయా కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు పాటు పడతానని, ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తానని తెలిపారు. కాలనీలో పేరుకు పోయిన మురికి కాల్వలను వెంటనే శుభ్రం చేయించి, అవసరమైన చోట వీధి లైట్ లను వెంటనే ఏర్పాటు చేయిస్తానన్నారు.

డివిజన్ ప్రజలు ముఖ్యంగా మునిసిపల్ నీటి పైన్నే ఆధార పడి ఉన్నారని ఒక బోర్ వేయించి అక్కడక్కడా నల్లాలను ఏర్పాటు చేయిస్తానని, ఏ అర్ధ రాత్రి ఏ అవసరం వచ్చిన అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ప్రచార కార్యక్రమంలో కిరణ్ సతీమని లావణ్య, కొరడి భూపాల్, సంజన, మేఘన, సరిత, సుజాత, హరిత, ఇందూర్ నరేష్, రేకుల రాములు, బోయిన రాములు, రెడ్డిపల్లి సాయిలు, కొరడి గంగాధర్, ఆకుతోట రాజు, దామ ఆనంద్, వెల్మల్ నరేష్, సాయిబాబా, అన్నారం జితేందర్, ఆకుల చంటి, ఘంట ప్రణీత్, బెల్లాల్ నాగరాజ్, పిట్ల మధు, సుధాకర్, సి మోహన్, పట్కార్ కిషన్, రవి,గణేష్,డివిజన్ మహిళలు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

| Balkonda లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వండి.

janamvelugunews

Published

on

లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వండి.

మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ వేముల ప్రశాంత్ రెడ్డి.

జనం వెలుగు బాల్కొండ:- రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకంలో ఇస్తున్న లక్ష రూపాయలతో పాటు గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకి చ్చిన హామీల భాగంగా ఇస్తానన్న తులం బంగారం ఇవ్వాలని మాజి మంత్రి బాల్కొండ ఎంఎల్ఏ వే ముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశాడు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల మంజూరి కోసం 127 ఫైల్లపై శనివారం ఆయన సంతకాలను చేశాడు. బాల్కొండ 19, వేల్పూరు 20, మెండోరా 15, ముప్కాల్ 10, మోర్తాడ్ 24, భీంగల్ 39 మండలాలకు చెందిన ఫైల్లపై బాల్కొండ ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో ఫైల్లను పరిశీలించి ఆయన సంతకాలను చేశాడు. ఫైల్లను మీ వద్ద పెండెంగ్ ఉంచకుండా అవసరమైన సంతకాలను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వానికి ప్రభుత్వానికి పంపించాలని తహసిల్దార్ లను ఆయన ఆదేశించాడు.

Continue Reading

నిజామాబాద్

| Armoor మున్సిపల్ కార్యాలయం లో కాంగ్రెసు, బిజెపి నాయకుల రచ్చ రచ్చ.

janamvelugunews

Published

on

మున్సిపల్ కార్యాలయం లో కాంగ్రెసు, బిజెపి నాయకుల రచ్చ రచ్చ.

ఎంల్ఏ, చైర్ పర్సన్ ల ముందరే ఇరువర్గాల నాయకుల పరస్పర దూషణలు.

బిజెపి నాయకులపై  పోలీసులకు ఫిర్యాదు చేసిన రమేష్.

జనం వెలుగు ఆర్మూర్:- ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో బిజెపి నాయకులు, కాంగ్రెసు నాయకుల మధ్య రచ్చ రచ్చ జరిగిన ఘటన ఆర్మూర్ లో చర్చ నీయాం శంగా మారింది.ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం సా ధారణ సమావేశం జరిగింది. ఇట్టి సాధారణ సమావేశానికి హాజర య్యేందుకు వచ్చిన ఆర్మూర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు చైర్ పర్సన్ గోనె లహరి చాంబర్ లో ఆశీనలై ఉండగా బిజెపి, కాంగ్రెసు నాయకుల మధ్య జరిగిన మాట మాట పెరిగి పోయి రచ్చ రచ్చగా మారిపోయింది.ఎంఎ ల్ఏ అనుచరుడు మందుల బాలు తమపై పెత్తనం చలాయించడం ఏమిటని కౌన్సిలర్ రమేష్ తీవ్రంగా పరిగణించి ఆర్మూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

కౌన్సలర్ అయిన నాతో దుర్బాషలాడి బయటకు వెళ్ళాలని నాపై మందుల బాలు హుకుం చెలాయించడం ఏంటని ఆయన ప్రశ్నించాడు. ఒక మున్సిపల్ కార్యాలయంలో కొనసాగిన ఈ తతంగం ఒక ఉద్రిక్తత వాతావరణంలా మారింది. అటు అధికారులు గాని ఇటు పోలీసులు గాని ఇటు బిజెపి నాయకులను గాని అటు కాంగ్రెసు నాయకులను ఏమి అనలేక వినలేక మౌనం పాటించడం వలన మున్సిపల్ కార్యాలయం అంతా గందరగోళంగా ఉద్రిక్తతంగా మారి పోయింది.తమ కక్షల కు కార్పణ్యాలకు మున్సిపల్ కార్యాలయాన్ని ఓ వేధికగా చేసుకుని మాటల తూటాలతో పెరిగి పోయి నాయకులు కొట్టుకునే స్థాయికి చేరింది.ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం కక్ష సాధింపు చర్యలకే ఇరు నాయకులు పెద్ద పీట వేసినట్లు వారి దూషణలు స్పష్టత నిచ్చాయి.

Continue Reading

నిజామాబాద్

| nandipet పేకాట స్థావరాలపై మెరుపు దాడి

janamvelugunews

Published

on

పేకాట స్థావరాలపై మెరుపు దాడి

జనం వెలుగు, చిలాప్చెడ్ (18 ఏప్రిల్ 2026): గ్రామంలోని చర్చి వెనుక పేకాట జరుగుతున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు శనివారం సాయంత్రం మెరుపు దాడి నిర్వహించారు. సుమారు 5:45 గంటలకు సమాచారం అందడంతో ఎస్‌ఐ సిబ్బందితో కలిసి వెంటనే అక్కడికి చేరుకుని, 6:00 గంటల సమయంలో నలుగురు వ్యక్తులను పేకాట ఆడుతూ పట్టుకున్నారు.

నిందితుల వద్ద నుండి రూ.4,410 నగదు, మూడు మొబైల్ ఫోన్లు మరియు ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి, Cr.No.39/2026 U/s 9(i) టీజీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Continue Reading