నిజామాబాద్
పోలింగ్ సందర్భంగా ప్రచార కార్యక్రమాలపై నిషేధం


Views: 9470
పోలింగ్ సందర్భంగా ప్రచార కార్యక్రమాలపై నిషేధం
పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలి
జనంవెలుగు, నిజామాబాద్, ఫిబ్రవరి 08 : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీంగల్ పట్టణాలలో ఈ నెల 09వ తేదీ సాయంత్రం 5.00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని, ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో పై పట్టణాలలో ఎవరు కూడా బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదని అన్నారు. ఎఫ్.ఎస్.టి, ఎస్.ఎస్.టి, ఎం.సి.సి బృందాలు, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. కాగా, మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈ నెల 9వ తేదీ సోమవారం సాయంత్రం 5.00 గంటల నుండి 11వ తేదీ పోలింగ్ ముగిసేంత వరకు మద్యం షాపులను, కల్లు దుకాణాలను మూసివేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పురస్కరించుకుని ఈ నెల 13న కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని, కౌంటింగ్ ముగిసేంత వరకు డ్రై డే అమలులో ఉంటుందని తెలిపారు.
నిజామాబాద్
సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం


Views: 4
సాంకేతిక కళాశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎస్ రాజకుమార్ మాట్లాడుతూ…. విద్యార్థుల చదువుకు సంబంధించిన పురోగతి, అలాగే సమస్యలు తదితర విషయాలపై చర్చించడం జరిగిందని, తమ పిల్లలు చదువుకునే చదువు గురించి తెలుసుకొనేందుకు కళాశాలకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అని, ఇలాగే తల్లిదండ్రులు, టీచర్లు కలిసి విద్యార్థులపై పర్యవేక్షణ చేస్తే విద్యార్థులు మంచి మార్గంలో నడిచేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్ ఓ డి లు లావణ్య, కిషోర్, లక్ష్మణ్ శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిజామాబాద్
| nandipet యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు


Views: 224
యూరియా యాప్ మాకొద్దు… రోడ్డెక్కిన రైతులు
నందిపేటలో యూరియా కొరకు రైతుల ధర్నా, యూరియా ఆప్ ను రద్దు చేయాలంటూ నిరసన


జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తాలో నందిపేట మండల రైతులు శుక్రవారం యూరియా దొరుకుత లేదంటూ… యూరియా యాప్ వల్ల ఇబ్బందులకు గురవుతున్నామని వెంటనే యూరియా యాప్ ను రద్దుచేసి రైతులకు యూరియా బస్తాలు అందేటట్టు చూడాలని రోడ్డెక్కారు. లక్కంపళ్లి, చిమ్రాజ్పల్లి, నందిపేట రైతులు చేపట్టిన ఈ ధర్నాతో వివేకానంద చౌరస్తాలో ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి.
స్థానిక ఎస్సై శ్యామ్రాజ్, ఎస్సై 2 రాము లు జోక్యం చేసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడించి ధర్నాను విరమింప చేశారు. ఈ సందర్భంగా రైతు తెల్వెద అబ్బి గంగారం మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ విధానం సరైన రీతిలో చేయట్లేదని, రైతుకు యూరియా కావాల్సి వస్తే యాప్ లో బుకింగ్ చేసుకున్న వాళ్లకే యూరియా సరఫరా చేయడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నామని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే సొసైటీలో యూరియా మాయమైపోతుందని, అసలు నిజమైన లబ్ధిదారులకు యూరియా బస్తాలు అందడం లేదని, ఈ సమయంలో రైతు పొలానికి యూరియా వేయనట్లయితే వరి రైతు తీవ్రంగా నష్టపోతారని, యూరియా దొరకకపోతే రైతుకు ఉరే గతి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆప్ విధానంపై అవగాహన కల్పించ కుండా… సరఫరా చేయడం సరైనది కాదని, అంతేకాకుండా నిమిషాల వ్యవధిలోనే యూరియా అయిపోవడం ఏంటని, చదువుకోని వారికి యూరియా బుకింగ్ చేసుకోవడం ఇబ్బంది కలుగుతుందని, ఆప్ విధానం కాకుండా ప్రత్యామ్నాయం చూడాలని అధికారులను కోరారు.
నిజామాబాద్
|nandipet ఘనంగా చత్రపతి శివాజీ జయంతి


Views: 90
ఘనంగా చత్రపతి శివాజీ జయంతి
జనంవెలుగు, నందిపేట్:- నందిపేట మండలం షాపూర్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని యువత పెద్ద ఎత్తున జై శివాజీ జై భవాని అంటూ నినాదాలు చేస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించి ప్రధాన కూడలి వద్ద శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రం హన్మండ్లు మాట్లాడుతూ అఖండ భారతావనిలో హిందూ ధర్మాన్ని కాపాడిన ఏకైక మహావీరుడు శివాజీ అని, ఆయన ధైర్య సాహసాలను ఎంత పొగిడిన తక్కువేనని, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే మొగలుల ప్రయత్నాన్ని తిప్పికొడుతూ ధర్మరక్షణకై యుద్ధ రంగంలో కదం తొక్కిన మహావీరుడని, ఎన్నో విజయాలు సాధించి హిందూ ధర్మాన్ని కాపాడిన ధైర్యశాలి ఆశంబుజీ మహారాజ్ అని కొనియాడారు. నేటి యువత ఆయనని స్ఫూర్తిగా తీసుకొని హిందూ ధర్మాన్ని కాపాడేందుకు తమ వంతుగా కృషి చేయాలని హితవు పలికారు. ఉప సర్పంచ్ నీరడి రాములు, దత్తపురం భోజన్న, ఆమందు వంశీ, దినేష్ గౌడ్, పుల్ల మహేష్, ఉద్గిరి అరవింద్, పిట్ల మోహన్, గ్రామ యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








