Connect with us

నిజామాబాద్

| nandipet రగిలిన రజక జాతి

janamvelugunews

Published

on

రగిలిన రజక జాతి

జనంవెలుగు, నందిపేట్:- నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామ మల్లన్న జాతరలో రెడ్డి సామాజిక వర్గం వివక్ష చూపుతూ రజక కుటుంబంపై దాడి చేయడంతో రెండునెళ్ల పసిప మృతి చెందిన ఘటనను ఖండిస్తూ నందిపేట, డొంకేశ్వర్ రజక ఐక్య కమిటీ ఆధ్వర్యంలో రజకులంతా కదం తొక్కారు. ఈ నిరసన ర్యాలీకి డీఎస్పీ పార్టీ జిల్లా నాయకులు మద్దతు తెలిపారు.

సామాజికంగా వెనుకబాటులో ఉన్న మమ్మల్ని కనీసం ఆదరించకపోగా మా రజక కుటుంబం పై జాతి వివక్ష చూపుతూ… సోయి మరిచి రెండునెళ్ల పసిపాపను తన్ని చంపడం సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ఖబర్దార్ అగ్రవర్ణల్లారా ఖబర్దార్… ఖబర్దార్ అంటూ మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి వెంటనే బాధ్యులపై చర్య తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని, బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా రజక సంఘం జిల్లా అధ్యక్షులు గూపన్పల్లి శంకర్ మాట్లాడుతూ…. కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటన చాలా నీచమైన ఘటన అని, సవ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే రోజు అని, అగ్రవర్ణాల అహంకారానికి ఈ చర్యే ఉదాహరణని, డీఎస్పీ పార్టీ అధినాయకులు విశారదన్ మహారాజ్ జోక్యం చేసుకొని ఈ అన్యాయాన్ని ఖండిస్తూ రోడ్డుపై బైఠాయించి సమాజానికి ఈ విషయం తెలిసేందుకు చాలా కృషి చేశారని, మా రజక జాతి తరపున విశారదన్ కు చేతులెత్తి నమస్కరిస్తున్నామని, అన్నారు. ఏ పార్టీ కూడా ఇప్పటివరకు మా రజక బిడ్డకు జరిగిన అన్యాయాన్ని ఖండించక పోవడం సిగ్గుచేటని ఎద్దేవ చేశారు. మండల రజక సంఘం అధ్యక్షులు కుంటాల గవస్కర్ మాట్లాడుతూ సమాజంలో రజకుల పట్ల ఎంతో ఆదరణ ఉంటుందని, కానీ కొంతమంది అగ్రవర్ణాల అహంకారులు ఇటువంటి ఘటనలకు పాల్పడడం బాధగా ఉందని అన్నారు.

తల్లి గర్భం నుండి పుట్టిన పసిపాపకు మైల గోర్లు తీసేది మేమేనని, మీ పెళ్లిళ్లకు పేరంటాలకు సేవలు చేసేది మేమేనని, చివరకు నీవు సచ్చినప్పుడు 11వ దినకర్మ గూడా మేమే కావాలి కదా…. అటువంటి జాతిపై ఇంత క్రూరత్వం దేనికని ప్రశ్నించారు. రజకులను ఇంటి ఆడబిడ్డతో పోలుస్తారు కదా మరి ఏమైంది రా మీ సోయి, కనీసం పసిపాపను చూసైనా మీకు కనికరం రాలేదా. ఆ పాపను తన్ని చంపడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా నాయకురాలు రేఖా రాణి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వారసులం ఖబర్దార్… అగ్రవర్ణల్లారా ఐలమ్మ చరితను మరిచారా దేశ్ ముఖ్, దొరలను మట్టికరిపించిన మా ఐలమ్మ వారసులం మేం ఖబర్దార్ అంటూ హెచ్చరించారు.

ఆ దాడిలో జరిగిన ప్రతి ఒక్కరిని పట్టుకొని శిక్షించకపోతే పోరాటం ఉదృతం చేస్తామన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి సుమన్, జిల్లా కో కన్వీనర్ ప్రేమ్, డీఎస్పీ జిల్లా అధ్యక్షులు మహిపాల్ మహారాజ్ లు మాట్లాడుతూ…. కుమ్మెర గ్రామంలో జరిగిన ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని, అణగారిన వర్గాలపై ఇంకా పైశాచిక, కుల పిచ్చి, అగ్రవర్ణాల అహంకారాలు జరుగుతూనే.. ఉన్నాయడానికి ఈ ఘటనే నిలువెత్తు సాక్ష్యం అన్నారు.

ఆర్థికంగా సామాజికంగా అనగదొక్కడమే కాకుండా రెండునెళ్ల పసి గుడ్డును కులగజ్జి అహంకారంతో కళ్లకు పొరలెక్కి కాలితో తన్ని చంపడం సిగ్గుచేటని, ఈ జరిగినా అన్యాయాన్ని ఏ ఒక్క అగ్రవర్ణ నాయకులకు ఖండించేందుకు మనసు రాలేదని, అణగారిన వర్గాల నాయకులైన విషాదరన్ మహారాజ్ సంఘటన స్థలానికి వెళ్లి బాధితులకు అండగా నిలిచి తన గలాన్ని వినిపించడంతో ఈ ఘటన గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారని తెలిపారు.

ఈ రజక జాతికి న్యాయం జరిగేంతవరకు మా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఐక్యవేదిక తోడుంటామని తెలిపారు. అలాగే వెల్మల్ గ్రామానికి చెందిన రజక సభ్యులు, గాయకులు శ్రావణ్ పాట రూపంలో పాటను పాడుతూ మా ఆడబిడ్డకు జరిగిన అన్యాయంకు మరో ఐలమ్మ రూపంలో తిరిగి వచ్చేవరకు పోరాడుతం అంటూ అగ్రవర్ణాల దురాహంకారాన్ని ఎండగట్టారు.

జిల్లా నాయకులు ఎండ్రాల గంగాధర్, ఆర్మూర్ నియోజకవర్గ రజక సంఘం నాయకులు కొండూరు సంతు, డొంకేశ్వర్ రజక సంఘం అధ్యక్షులు నడ్కుడ సంతోష్, నందిపేట మండల రజక సంఘం ఉపాధ్యక్షులు బద్గుణ సాగర్, నందిపేట, డొంకేశ్వర్ మండలాల రజక సంఘం నాయకులు, సభ్యులు, జిల్లా రజక సంఘం నాయకులు, మహిళా నాయకురాలు, డి.ఎస్.పి నాయకులు, మండల నాయకులు యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

janamvelugunews

Published

on

మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు

జనంవెలుగు, ఆర్మూర్: జిల్లా కేంద్ర ఆర్మూర్ మున్సిపల్ పరిధి లో గల శ్రీ నవనాథ సిద్ధుల గుట్ట అయ్యప్ప దేవాలయంలో ప్రతి నెల మొదటి బుధవారం పురస్కరించు కొని శ్రీ నగేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ గణపతి శ్రీసుబ్రహ్మణ్యం శ్రీ అయ్యప్ప స్వామి వార్లకు ప్రత్యేక పూజలు హారతి మంత్రపుష్పం, మధ్యాహ్నం 12.30 నిముషాలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించబడినది.

 మణికంఠ సేవా సమితి అధ్యక్షులు: చెపూర్ ధనుంజయ్

 ఈ సందర్భంగా మణికంఠ సేవా సమితి అధ్యక్షులు చేపూరు దనంజయ్ మాట్లాడుతూ ఇట్టి కార్యక్రమానికి వి. అయ్యప్ప శ్రీనివాస్ అయ్యప్ప ఆలయం నిర్మాణ కర్త సహాయ సహకారం అందిస్తున్నందుకు నవనాథ సిద్ధుల గుట్ట ఆలయ కమిటీ దాతలకు . పాల్గొన్న అయ్యప్ప స్వామి భక్తులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆ మణికంఠుడు యొక్క ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.

 ఈ కార్యక్రమంలో మణికంఠ సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఉపాధ్యక్షులు కౌటికేవిజయ్, కోశాధికారి సురేష్ చారి, ప్రచార కార్యదర్శి గంగా మోహన్, కార్యవర్గ సభ్యులు ఒడ్డేన్న, సలహదారులు శ్రీహరి, నవనాథ సిద్ధుల గుట్ట కమిటీ సభ్యులు దత్తు గురు స్వామి, కొండవీటి శ్యామ్ గురు స్వామి, మోహన్ రావు గురు స్వామి, గ్యాస్ ప్రభాకర్ గురు స్వామి,నవీన్ రెడ్డి గురు స్వామి, నర్సారెడ్డి గురు స్వామి గోవింద్ పేట్, అయ్యప్ప భక్తులకు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

janamvelugunews

Published

on

ప్రెస్ క్లబ్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్:- ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ను పురస్కరించుకొని మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల ఎన్నో ఏండ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అని, టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సైతం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేలా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత జర్నలిస్టుల ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు వచ్చేవరకు జర్నలిస్టుల పోరాటాలు, ధర్నాలు నిరసనలు ఉంటాయని తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి వాగ్మారే సుభాష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం స్పందించి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని లేనియెడల ఇళ్ల స్థలాలు వచ్చేవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

నిజామాబాద్

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

janamvelugunews

Published

on

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి,

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన నగర జర్నలిస్టులు

నిజామాబాద్:- నగర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ తో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో నగర జర్నలిస్టులు కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచ రెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి నీ కలిసి మొదట వినతి పత్రాన్ని అందజేశామన్నారు. సానుకూలంగా స్పందించి ఇళ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత ఆర్డీవోకు ఫోన్ చేసి తక్షణమే జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వ స్థలం ఎక్కడైతే ఉందో చూడాలని ఆదేశించడం జరిగిందన్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలవగా ఇళ్లస్థలాల అంశంపై క్షుణ్ణంగా చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని నగరంలో ఎక్కడ ఇళ్లస్థలాలు లేవని అందుకోసం కేశపూర్, బర్దిపూర్ ప్రాంతాలలో ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని నిజామాబాద్ ఆర్డిఓ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు అని తెలిపారు. ఇళ్ల స్థలాల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించినందుకు ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున నగర జర్నలిస్టుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.

Continue Reading