Connect with us

నిజామాబాద్

|nandipet రజకులకు అట్రాసిటీ హక్కు కల్పించాలి

janamvelugunews

Published

on

రజకులకు అట్రాసిటీ హక్కు కల్పించాలి

జనంవెలుగు, నందిపేట్:- నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామ రజక కుటుంబం పై జరిగిన దాడిలో రెండు నెలల పసికందు చనిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ రజక సంఘాల ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు.

అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో బీసీ ఐక్యవేదిక, సర్పంచ్ సిలిండర్ లింగం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ నుండి ఐలమ్మ విగ్రహం వరకు పెద్ద ఎత్తున యువకులంతా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ర్యాలీగా బయలుదేరిన యువకులు ఐలమ్మ విగ్రహం వద్ద చేరుకొని ఆ ఘటనలో చనిపోయిన ఆ పసికందుకు ఘన నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమానికి బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు నరాల సుధాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ ఘటన బలహీన వర్గాల పై అగ్రవర్ణాల దాడికి నిదర్శనమని, అంతేకాకుండా రజక కుటుంబంపై దైవ సన్నిధిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మదమెక్కి విచక్షణారహితంగా కొట్టి చంటిపాపను కూడా చంపడం గోరాతి ఘోరమైన చర్య అని, అడవిలో వేటాడే జంతువు కూడా సాటి జంతువుపై కనికరం చూపుతోందని, కానీ ఆ నీచులు సంటి పాపను ముందట పెడితే తన్ని చంపేశారని, అటువంటి వారికి సమాజంలో జీవించే హక్కు కూడా లేదని ఘాటుగా విమర్శించారు, అందుకే ఎస్సీ ఎస్టి కులాలకు రక్షణ కవచమైన అట్రాసిటీ హక్కును రజకులకు కూడ కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

సర్పంచ్ సిలిండర్ లింగం మాట్లాడుతూ ఆధునికంగా మనిషి రాకెట్ యుగంలో పరిగెడుతుంటే నేడు ఇటువంటి జాతీ అహంకార ఘటనలు సమాజమంతా సిగ్గుపడేటట్టు చేస్తున్నాయని ఎద్దేవ చేశారు. ఏది ఏమైనా బడుగులపై జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాల్సిందేనని, బాధితులకు న్యాయం చేసి బాధ్యులకు కఠినమైన శిక్ష పడేటట్టు చూస్తేనే మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు.

బీసీ యువజన సంఘం రాష్ట్ర నాయకులు బసవ సాయి, కోయడ శంకర్, ఆర్మూర్ నియోజకవర్గ రజక సంఘం ఇంచార్జ్ కొండూరు సంతు, సీనియర్ నాయకులు దారం సురేష్, మండల కేంద్ర రజక సంఘం అధ్యక్షులు బాద్గుణ సాగర్, కొత్తూరు గణేష్, మండల కేంద్ర యువ నాయకులు ఎడ్డిగారి దినేష్, త్రివేద్, వినయ్ నరేందర్ గౌడ్ మహేష్, అశోక్, రాకేష్, నరేందర్, చరణ్, సంతోష్, నవీన్, కార్తీక్, బాద్గుణసాగర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు

రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి

జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Continue Reading

నిజామాబాద్

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

Thammali Pandu

Published

on

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.

Continue Reading

నిజామాబాద్

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో

Thammali Pandu

Published

on

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు 

బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.

జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.

భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,

పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.

బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.

ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.

Continue Reading