నిజామాబాద్
నందిపేటలో ఇప్ప సార వ్యాఖ్యల లొల్లి


Views: 4
నందిపేటలో ఇప్ప సార వ్యాఖ్యల లొల్లి
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పై వ్యాఖ్యలు సిగ్గుచేటు
జనంవెలుగు, నందిపేట్ :- ఇటీవల అసెంబ్లీలో దివంగత నేత ఇందిరాగాంధీ పేరును ప్రస్తావిస్తూ ఇప్పసారా పథకం పెట్టి దానిపై ఇందిరా గాంధీ పేరును పెట్టేరు. అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన వాక్యాలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిదానికి ఇందిరా గాంధీ పేరును పెడుతున్నారు అనే విధంగా అర్థం వచ్చేటట్టు
వ్యంగ్యాంగా మాట్లాడిన మాటలను ఖండిస్తూ నందిపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫినాయిల్ బాటిల్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మంద మహిపాల్ మాట్లాడుతూ…. దివంగత నేత ఇందిరా గాంధీ పేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా మాట్లాడిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెంటనే అదే అసెంబ్లీలో క్షమాపణలు కోరుతూ….
తాను మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసనసెగ తప్పకుండా తాకుతుందని హెచ్చరించారు. మీ బిజెపి పార్టీ అధినాయకులైన అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరా గాంధీని ఉక్కు మహిళతో పోల్చారని, భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ పేరును ఇప్పసార పథకానికి పెట్టేరు అంటూ ఎద్దేవ చేయడం ఎంత మటుకు సమంజసం అన్నారు.
నీ నోటికి ఏది వస్తే అది గల్లీ లీడర్ లాగా మాట్లాడుతూ, అసెంబ్లీలో వెనక ముందు ఆలోచించకుండా ఎవరిని పడితే వారిని విమర్శించడం నీకు పరిపాటి అయిపోయింది. ఖబర్దార్ రాకేష్ రెడ్డి ఇందిరా గాంధీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరుపేదల పార్టీ, నీకు చేతనైతే ఏదైనా అభివృద్ధి పై మాట్లాడు కానీ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న దివంగత నేత ఇందిరాగాంధీని విమర్శిస్తే ఊరుకునేది లేదని,
అందుకే శనివారం రోజు మండల కేంద్రంలో ఫినాయిల్ బాటిల్ పట్టుకొని నిరసన చేపడుతూ నీ మురికి నోరుని పినాయిల్ తో కడిగే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
నిజామాబాద్
అంబరాన్నంటిన హనుమాన్ జన్మోత్సవ సంబరాలు…


Views: 127
అంబరాన్నంటిన హనుమాన్ జన్మోత్సవ సంబరాలు..


జనంవెలుగు, నిజామాబాద్:- నిజామాబాద్ నగరంలో గురువారం హనుమాన్ జన్మోత్సవ వేడుకలు, భారీ ఊరేగింపు విశ్వ హిందూ పరిషద్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కంటేశ్వర్ నుండి ప్రారంభమైన ఊరేగింపు భక్త జన సందోహల మధ్య, భక్తి గీతాలతో, నృత్యాలతో భక్తి పారవాశ్యం తో ఆర్ ఆర్ చౌరస్తా వరకు చేరుకుంది. నగరం లోని అన్ని హనుమాన్ ఆలయాలలో పెద్ద ఎత్తున పూజలు,అన్న ప్రసాదాలు నిర్వహించారు. నగరమంతా రామ నామ,, హనుమాన్ నామ స్మరణ తో మార్మోగింది. వినాయక్ నగర్ లోని సంకట మోచన హనుమాన్ మందిరంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో భాగంగా ఆర్చేస్ట్రా తో భక్తి పాటలు అందరిని మంత్ర ముగ్దులను చేసాయి.ఆలయ పురోహితుల మంత్రోచ్చారనలు, హారతి పాటలు అందరిని ఆకట్టుకున్నాయి.శ్రీ నటరాజ నృత్య తరంగిని నాట్యాలయం ఆధ్వర్యంలో బంటు సుకన్య నేత్రుత్వంలో సహస్ర, నిహాన్వి, కె. ఆధ్య, టి. ఆద్య, పి. ఆధ్య, రూణి, ప్రేర్, తనిష్క, వేధిత చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి.ఆలయ ఆవరణలో సంసృతి సాంప్రదాయాలు రాబోయే తరానికి తెలియ చేయాలనే ఉద్దేశ్యం తో ప్రతి రోజు సాయంత్రం నృత్య తరగతులు తీసుకుంటున్నట్లు తెలిపారు.హనుమాన్ భారీ ర్యాలీ సందర్బంగా భక్తులు, వచ్చిన భక్తుల కోసం పులిహోర, బాదాం పాలు, జీరా అన్నం, రస్నా, శ్రీరామ రసం, లాంటివి అందించి భక్తుల మన్ననలు పొందారు. సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేసారు.
నిజామాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ ల్లో కొత్త రుసుముల అమలు


Views: 24
రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ ల్లో కొత్త రుసుముల అమలు
జనంవెలుగు, నిజామాబాద్:- రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుండి మీ సేవ సేవలపై కొత్త చార్జీలు అమల్లోకి వచ్చాయని, కొత్త రేట్లు పాత ఛార్జిలతో పోల్చవద్దని, వినియోగదారులు ఈ విషయం లో మీ సేవ నిర్వాహకులకు సహకరించాలని జిల్లా మీ సేవ అధ్యక్ష, కార్యదర్శులు కోరారు. గతం లో కంటే ప్రస్తుతం మీ సేవల రుసుముల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.వినియోగదారులుపాత ఛార్జిలతో పోల్చి సందేహాలు వ్యక్తం చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన తాజా రుసుములను చెల్లించి సహకరించాలని జిల్లా మీ సేవ అధ్యక్షుడు సితారే క్షేవిన్ (రాజ్) విజ్ఞప్తి చేసారు. మేము నిన్ననే దరఖాస్తు చేసుకున్నాం, ఇంత చార్జీలు లేకుండే మీరేంటి బాగా ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నారు లాంటి అపోహాలు, వాదనలకు పోకుండా తాజా చార్జీలు చెల్లించి మీ సేవ సేవలు వినియోగించు కోవాలని సూచించారు.ఇన్నేళ్లుగా యూసర్ ఛార్జిల్లో పెంపు లేకుండా ఉన్న మీ సేవల ఛార్జిలను పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మీ సేవా కేంద్రాలతరపున ధన్యవాదాలు తెలియ చేసారు. వినియోగ దారులు ఎటువంటి ఆటంకం లేకుండా మీ సేవ సేవలను వినియోగించు కోవాలన్నారు.
నిజామాబాద్
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భారీ లాభం


Views: 110
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు భారీ లాభం నిజామాబాద్‌లో ప్రత్యేక కార్యక్రమం


జనంవెలుగు, నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్ స్టేషన్ ఆవరణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.10 వేల కోట్ల ఆదా జరిగిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఉమారాణి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల కుటుంబాల ఆర్థిక భారం గణనీయంగా తగ్గిందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 8.58 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 290 కోట్ల మహిళా ప్రయాణికులు ప్రయాణించగా, మొత్తం రూ.10 వేల కోట్ల ఆదా జరిగిందని, నిజామాబాద్ జిల్లాలో మాత్రమే రూ.365.50 కోట్ల ఆదా నమోదైందని వివరించారు.
ఈ పథకాన్ని మహిళలు విస్తృతంగా వినియోగించుకుని ఆర్థికంగా మరింత బలపడాలని ఆమె ఆకాంక్షించారు.
ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోలలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి డిపోలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, ఆర్మూర్ డిపోలో మున్సిపల్ చైర్మన్ లహరి రఘు, బాన్స్‌వాడ డిపోలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బోధన్ డిపోలో మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి పాల్గొన్నారు.
నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయగౌడ్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత, జిల్లా కార్యదర్శి మమత, సంధ్యారాణి, సరిత, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు ఆనంద్, ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ జానాబాయి, బస్ స్టేషన్ మేనేజర్ శివరాజవ్వ తదితరులు పాల్గొన్నారు.
మహిళా కండక్టర్లు సరళ, నాగకుమారి, జ్యోతి మరియు మహిళా ప్రయాణికులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








