నిజామాబాద్
తమ్మలి సామాజిక వర్గ వార్డ్ సభ్యులకు ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహణ


తమ్మలి సామాజిక వర్గ వార్డ్ సభ్యులకు ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహణ


జనంవెలుగు, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో గెలిచిన తమ్మలి సామాజిక వర్గానికి చెందిన వార్డ్ సభ్యులు, అలాగే గత సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారికి ఘనంగా సత్కారం నిర్వహించారు. బి.సి టైమ్స్, బి.సి సమాజ్, తెలంగాణ తమ్మలి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లి తెలుగు వర్సిటీలోని నందమూరి తారక రామారావు కళామందిరంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బి.సి సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు, బి.సి కమిషన్ చైర్మన్ నిరంజన్ హాజరై విజేతలను సత్కరించారు.
ఈ సందర్భంగా సంగెం సూర్యారావు మాట్లాడుతూ బి.సిలకు రాజ్యాధికారం దూరంలో లేదని, సమాజంలో చైతన్యం పెరిగి బి.సిలంతా ఏకతాటిపైకి వచ్చి తమ ఓటును తమకే వినియోగించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు.
బి.సి కమిషన్ చైర్మన్ నిరంజన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వార్డ్ సభ్యులను, ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిని అభినందించడం ఆనందంగా ఉందన్నారు. తమ్మలి కుల ధ్రువీకరణ పత్రంలో “నాన్ బ్రాహ్మిన్, శూద్ర” అనే పదాలు వారి జీవన విధానానికి ఆటంకంగా మారాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా బి.సి కమిషన్ పర్యటనల సమయంలో ఈ పదాల తొలగింపుపై అనేక వినతులు అందాయని తెలిపారు. జిల్లాల తమ్మలి సంఘాల అభ్యర్థన మేరకు ఈ పదాలను త్వరలోనే తొలగించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తమ్మలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వటపత్ర సాయి మాట్లాడుతూ “నాన్ బ్రాహ్మిన్, శూద్ర” అనే పదాలు తమ సమాజ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ్మలి వృత్తి అయిన బాజా వాయించడం, పూలు అల్లడం వంటి పవిత్ర సేవలను అందించే తమ కులానికి ఈ పదాల వల్ల సామాజికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి బి.సి కమిషన్ చైర్మన్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బి.సి సమాజ్ గౌరవ అధ్యక్షుడు విజయకుమార్ శివార్చక, రాష్ట్ర కార్యదర్శి మోడల శ్రీనివాస్ యాదవ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మల్లికార్జున్, ఎం.బి.సి నాయకులు బడే సాబ్, తమ్మలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, కోశాధికారి ఆంజనేయులు, రాష్ట్ర కన్వినర్ రామకృష్ణ, మెదక్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బాబన్న, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు విఠల్, ప్రధాన కార్యదర్శి పాండు, వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు విఠల్, నిర్మల్ జిల్లా నాయకులు నరేందర్, ప్రమోద్, యోగేష్, మహిళా సభ్యులు వీణాదరి, హైమవతి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నిజామాబాద్
అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం


అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
సిపి సాయి చైతన్య.
జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.
పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.
నిజామాబాద్
ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ


ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ
రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి
జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.
ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.
ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.
నిజామాబాద్
మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..


మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..
కమలాపూర్ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు
జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.
ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.








