ARTICLE'S
అరెస్ట్, పోలీస్ అరెస్ట్ తెలుసుకోవాలని ఉందా
జనం వెలుగు:- అరెస్ట్ అనే పదం ఫ్రెంచ్ భాష ద్వారా తీసుకోవడం జరిగింది. దీని అర్థం ఏమనగా అపడం, అడ్డగింపు, అభ్యంతరం, ఆటంకం, పట్టుకోవడం లేదా అపి ఉంచడం. న్యాయ బద్ధంగా అరెస్ట్ అంటే చట్ట బద్దత కలిగిన వ్యవస్థ ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొని, ఇతరులను విఘాతం లేదా ఎదుటి మనిషి ఇబ్బందులు పెట్టే ఒక మనిషిని అదుపులోకి తీసుకోవడం.
అరెస్ట్ ఎవరు అయినా చెయ్యొచ్చు, పోలీస్, మనిషి, జడ్జ్, కలెక్టర్ ఎవరైనా ఎక్కడైతే మనిషి చట్ట వ్యతిరేక కలపాలకూ పాటు పడే వ్యక్తి నియంత్రించడం.
అరెస్ట్ ఎలా ఎవరు చేస్తారు అనే విషయం చాప్టర్ 5 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో సెక్షన్ 41 నుండి 60 వరకు చెప్పడం జరిగింది.
అరెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏమనగా చట్టాన్ని గౌరవించేలా చూడడటం మరియు జరిగిన నేరం మళ్ళీ జరగకుండా నియంత్రించడం.
అరెస్ట్ అనేది క్రిమినల్ మరియు సివిల్ case లో ఉంటుంది. అరెస్ట్ వారెంట్ అనేది జడ్జ్ గారు ఇస్తారు, కొన్ని కేసుల్లో జడ్జ్ గారి అనుమతి లేకుండా కూడా పోలీస్ వారు అరెస్ట్ చెయ్యొచ్చు.
పోలీసుల అరెస్టు అంటే ఏమిటి?
(What is the Police Arrest)
అరెస్టు అనేది సామాన్యంగా మనిషిని నిర్బంధించడం కోసం పట్టుకొనడం. అందుకు అతని మీద చెయ్యివేసి పట్టుకోవడం అంటే అతను ఎటూ తప్పించుకోడానికి వీలు లేకుండా చేయడం. ఈ ఆరెస్టు ఒకోసారి మాటలతో కూడా చేస్తారు. అంటే “నిన్ను అరెస్టు చేస్తున్నాం” అని అనడం ద్వారా. ఈ అరెస్టును ‘వారంట్’ (న్యాయస్థానం అధికారంతో ఇచ్చిన ఆదేశం)తో గాని లేకుండా గాని చేస్తారు.
పాత నేరస్థులు కనపడినపుడు గాని, ఎవరైనా నేరం చేసి తప్పించుకు తిరుగు తున్నపుడుగాని, తెలిస్తే పారిపోయే ప్రమాదం ఉందనుకొనేటపుడు గాని, లేదా ఏదైనా ప్రమాదం ముంచుకొస్తుంది అని అనుమానించినపుడు గాని వారంట్ లేకుండానే ఆరెస్టు చేస్తారు.
అతనిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో సామాన్యంగా అరెస్టు అవుతున్న వ్యక్తికి పోలీసులు చెప్పాలి. మీరెందుకు అరెస్టు అవుతున్నారో తెలుసుకునే హక్కు మీకున్నది.
కస్టడీ’లోకి తీసుకోవడం అంటే ఏమిటి?
‘కస్టడీ’ అంటే అదుపు. కస్టడీలోకి తీసుకున్నారు అంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అర్థం. అంటే ఏమిటి? ఆరెస్టుకు కస్టడీకు తేడా ఏమిటి? అరెస్టు అంటే మీపై ఏదైనా అభియోగం వచ్చినపుడు అంటే నేరం చేశారని మీపై ఫిర్యాదు వచ్చి నపుడు పోలీసులు మిమ్మల్ని తమ అధీనంలోకి తీసుకుంటారు. మరి “కస్టడీ’ అంటే? ఒకోసారి ‘అక్కడికక్కడే పోలీసులు నేరం చేస్తున్న వారిని లేదా నేరంతో సంబంధం ఉన్న వారిని వెంటనే తమ అధీనంలోకి తీసుకుంటారు. అంటే అప్పటికి మీపై అభి యోగం ఏదీ ఉండనవసరంలేదు, నేరారోపణ జరిగి ఉండనవసరం లేదు. తాత్కాలికంగా మిమ్మల్ని తమ అధీనంలోకి తీసుకొని, మీ అవసరం ఏమీలేకుంటే విడిచి పెట్టేస్తారు. లేదా మీరు ఇక నేరం ఏమీ చేయలేరని, నేరం చేసే సమయం దాటి పోయిందని పోలీసులు భావించినపుడు మిమ్మల్ని విడుదల చేస్తారు. దీనికి నేరం ఏదీ జరిగి ఉండ నవసరం లేదు.
అదుపులోకి తీసుకోవడం అనేది మరో విధానం ఉంది. మీపై ఏదైనా అత్యా చారం ఇతరులు ఎవరూ చేయకుండా పోలీసులు మిమ్మల్ని తమ అదుపులోకి తీసుకొని మీకు రక్షణ కల్పిస్తారు. ఏదైనా హత్య జరిగింది అనుకోండి. లేదా ప్రమాదకరమైన నేరమే జరిగిందనుకోండి. అక్కడి ప్రజలుగాని చనిపోయిన వారి బంధువులు గాని రెచ్చిపోయి నేరం చేసినవారిని పట్టుకొని కొట్టవచ్చు, లేదా ఆవేశంలో చంపేయవచ్చు. అలా చేయడానికి వారికి హక్కు లేదు. ఆ కోపాన్నుంచి తప్పించ డానికి పోలీసులు నేరం చేసిన వారిని తమ అదుపులోకి తీసుకొని చట్టరీత్యా వారి మీద చర్య తీసుకొనే ఏర్పాట్లు చేస్తారు. ఆ విధంగా అదుపులోకి తీసుకున్న వ్యక్తికి రక్షణ కల్పించాలి పోలీసులు.
పాటిల్ అసోసియేట్స్
జి. శ్యామ్ రావు
జి. దినేష్ పాటిల్
జి. ఉమేష్ పాటిల్
9014988555
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










