ARTICLE'S
బెయిల్ అంటే ఏమిటి, రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంటుందా?
జనం వెలుగు:- భారతీయ న్యాయ శాస్త్రంలో మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో బెయిల్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బెయిల్ గురించి ప్రస్తావన చాప్టర్ 33 సెక్షన్ 436 నుండి 450 వరకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో పొందు పరచడం జరిగింది. బెయిల్ అనేది నేరస్తుడికి ఉండే ప్రాథమిక హక్కు.
ఏదైనా నేరానికి సంబంధించిన కేసులో పోలీసులు ఎవర్నైనా అరెస్టు చేసిన తరువాత.. ముందుగా వినిపించే పదం బెయిల్. నేరారోపణలు మోపిన వ్యక్తిపై విచారణ జరగుతున్నప్పుడు కొన్ని నిబంధనలకు లోబడి వారిని జైలు నుంచి విడుదల చేయవచ్చు.
అయితే విచారణ పూర్తవ్వడానికి ముందు లేదా కోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు మాత్రమే బెయిల్ పొందే అవకాశం ఉంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించకుండా, నిబంధనలకు లోబడి జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాన్ని బెయిల్ కల్పిస్తుంది. ఇందుకు అవసరమైనప్పుడు కోర్టులో హాజరవుతానని ప్రతివాది హామీ ఇవ్వాల్సి ఉంటుంది. బెయిల్ నిర్ణీత సమయానికి మాత్రమే ఇస్తారు.
బెయిల్ అంటే
క్రిమినల్ కేసులో నిందితులను తాత్కాలికంగా విడుదల చేయడానికి బెయిల్ వీలు కల్పిస్తుంది. కోర్టు విచారణ పెండింగ్‌లో ఉండి, సంబంధిత కేసుపై కోర్టు ఇంకా తీర్పు ఇవ్వనప్పుడు మాత్రమే బెయిల్ పొందే వీలుంటుంది.
బెయిల్ రకాలు
1.రెగ్యులర్ లేదా సాధారణ బెయిల్
2.మధ్యంతర బెయిల్
3.యాంటిసిపేటరీ లేదా ముందస్తు బెయిల్
4. డిఫాల్ట్ బెయిల్ లేదా చట్టబద్దమైన బెయిల్
రెగ్యులర్ లేదా సాధారణ బెయిల్
నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడినవారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. పోలీసు కస్టడీ ముగిసిన తరువాత, అవసరమైతే నిందితుడిని జైలుకు పంపుతారు. నిబంధనల ప్రకారం వీరు సాధారణ బెయిల్ పొందవచ్చు. క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ (సీఆర్పీసీ) లోని సెక్షన్ 437, 439 ప్రకారం.. విచారణకు హాజరవుతామనే హామీతో పోలీసు కస్టడీలో ఉన్నవారు విడుదల అయ్యేందుకు రెగ్యులర్ బెయిల్ అవకాశం కల్పిస్తుంది.
మధ్యంతర బెయిల్
మధ్యంతర బెయిల్‌ను తక్కువ కాలానికి మంజూరు చేస్తారు. సాధారణ లేదా ముందస్తు బెయిల్ కోసం విచారణ జరగడానికి ముందు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తారు.
ముందస్తు బెయిల్
బెయిల్‌కు అవకాశం లేని నేరానికి పాల్పడ్డ వ్యక్తులను అరెస్టు చేయవచ్చని భావించినప్పుడు ముందస్తు బెయిల్ తీసుకోవచ్చు. సీఆర్పీసీలోని సెక్షన్ 438 ప్రకారం.. ఒక కేసుకు సంబంధించి వ్యక్తులను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ రక్షణ కల్పిస్తుంది. సెషన్ కోర్టు లేదా హై కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
డిఫాల్ట్ బెయిల్ లేదా చట్టబద్దమైన బెయిల్
సెక్షన్ 167(2) CRPC ప్రకారంగా చార్జిషీట్ నిర్ణీత సమయం అనగా 60 లేదా 90 రోజుల్లో వెయ్యనట్టయీతే అప్పుడు మనకు ఈ బెయిల్ లభిస్తుంది. కోర్టు స్వయంగా గానీ, దోషి హక్కుగా కానీ దీని పొందవచ్చు.
వీటితో పాటు నేరం రుజువు అయి శిక్ష ఖరారు అయితే అప్పీల్ కోర్టు మరియు రివిజన్ కోర్టుకు కూడా శిక్ష సస్పెండ్ చేస్తూ బెయిల్ ఇచ్చే అధికారం ఉంటుంది.
బెయిల్ దరఖాస్తు చేసుకునే కోర్టులు
1. మేజిస్ట్రేట్ కోర్టు
2. సెషన్ కోర్టు
3. హై కోర్టు
4. సుప్రీం కోర్టు
ఇందులో ముందస్తు బెయిల్ కేవలం సెషన్ కోర్టు లేదా హై కోర్టు లో సెక్షన్ 438 CRPC అనుసరించి మాత్రమే వేసుకోవాలి. కేవలం సెక్షన్ 437 లో మాత్రమే మేజిస్ట్రేట్ కోర్టు కు అధికారం ఉంటుంది. సెక్షన్ 439 CRPC ప్రకారం కేవలం సెషన్ మరియు హై కోర్టు లకు మాత్రమే అధికారాలు ఉంటాయి.
ఐపీసీ ప్రకారం ఏ యొక్క నేరం 7 సంవత్సారాల లోపల శిక్ష వేస్తారో ఆ కేస్‌లో సెక్షన్ 41A నోటీస్ ఇస్తారు. దీనిని 2010 క్రిమినల్ అమెండ్మెంట్ ద్వారా పొందు పరచారు, సుప్రీం కోర్టు అర్నేశ్ కుమార్ VS స్టేట్ ఆఫ్ బీహార్ లో ఇదే విషయం మీద తీర్పు ఇచ్చింది. సెక్షన్ 41A నోటీసులను స్టేషన్ బెయిల్ అంటారు, కానీ వీటిని స్టేషన్ బెయిల్ అనకూడదు
సెక్షన్ 436 CRPC ఏ నేరాల్లో మనం బెయిల్ నేరం చేసిన పొంద గలమో అనేది అది నేర తీవ్రత మరియు షెడ్యూల్ లో తెలిపారు. బెయిల్‌కు అవకాశం ఉండే నేరాలకు పాల్పడ్డవారు కచ్చితంగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలా అంటే అవును అనే సమాధానం వస్తుంది. బెయిలబుల్ నేరానికి పాల్పడ్డవారు కచ్చితంగా బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి. అయితే ఇందుకు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు. దీన్ని పోలీసులు ఇస్తారు.
ముందస్తు బెయిల్ ఉన్నవారు సాధారణ బెయిల్ తీసుకోవాలా…
ముందస్తు బెయిల్ తీసుకున్న వారు రెగ్యులర్ బెయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కోర్టు దాన్ని రద్దు చేయకపోతే, కేసు విచారణ ప్రక్రియ ముగిసే వరకు ముందస్తు బెయిల్ చెల్లుతుంది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు ముందస్తు బెయిల్‌ను సాధారణ బెయిల్‌గా మార్చవచ్చు.
అండర్ ట్రయల్ ఖైదీని ఎన్ని రోజుల వరకు అదుపులోకి తీసుకోవచ్చు?
వ్యక్తులపై మోపిన ఆరోపణలు నిజమేనని తేలితే కోర్టులు శిక్ష విధిస్తాయి. కానీ విచారణ పూర్తి కాకుండా పోలీసుల అదుపులో ఉండేవారికి, నేరం రుజువైనప్పుడు కోర్టులు విధించే శిక్షలో సగం శిక్షను అనుభవించిన తరువాత బెయిల్ మంజూరు చేయాలి. సెక్షన్ 436A CRPC ప్రకారం వారికి బెయిల్ మంజూరు చేస్తారు.
నాన్ బెయిలబుల్ నేరానికి పాల్పడినవారు బెయిల్ పొందవచ్చా?
నాన్ బెయిలబుల్ నేరాలకు పాల్పడ్డవారు కూడా బెయిల్ పొందవచ్చు. అయితే ఇది నేరం తీవ్రత, కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
బెయిల్ రద్దు
బెయిల్ మంజూరు చేసిన తరువాత, దాన్ని రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంటుంది. సీఆర్పీసీలోని సెక్షన్ 437 (5), సెక్షన్ 439 (2) ప్రకారం కోర్టులకు ఈ అధికారం ఉంది. బెయిల్ రద్దు చేయడానికి కారణాలను గుర్తించి, ఇప్పటికే ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసి, ఆ వ్యక్తిని అరెస్టు చేయాలని పోలీసులకు కోర్టులు ఆదేశాలు ఇవ్వవచ్చు.
ముందస్తు బెయిల్‌ను రద్దు
ముందస్తు బెయిల్‌ను రద్దు చేసే అధికారం కోర్టులకు ఉంది. సాధారణంగా ముందస్తు బెయిల్ మంజూరు చేసే సమయంలోనే, కోర్టు కొన్ని నిబంధనలు, షరతులను విధిస్తుంది. వీటిని ఉల్లంఘించిన సందర్భాల్లో కోర్టు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయవచ్చు. ఈ విషయంపై ఫిర్యాదుదారులు లేదా ప్రాసిక్యూషన్ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిగిన తరువాత అవసరమైతే కోర్టు ముందస్తు బెయిల్‌ను రద్దు చేయవచ్చు.
బెయిల్ ఇవ్వడానికి లేదా తిరస్కరించడానికి కోర్టులు పరిశీలించే అంశాలు
1. నేరం యెక్క స్వభావం మరియు దాని తీవ్రత
2. నేరం రుజువునకు సంబధించిన నమోదైన అంశాలు వాటిని చూడగానే కోర్టు నమ్మదగినది లేదా అనేది భావించినప్పుడు
3. చేసిన నేరంనకు సంబధించిన శిక్ష మరణ శిక్ష, జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల పై బడి ఉండటం
4. నేరస్తుడు తప్పించుకునే అవకాశం ఉందని కోర్టు భావించినప్పుడు
5. నేరస్తుడు సాక్షులను భయ బ్రంతులు గురి చేస్తారు లేదా సాక్ష్యాలను తరమరు చేస్తారని భావిస్తే
6. నేరస్తుడి స్వభావం, ప్రవర్తన, గుణం, హోదా మీద కోర్టు దృష్టి సారిస్తుంది.
7. నేరాలను మళ్ళీ పునరావృతం చేసే అవకాశం ఉన్నప్పుడు
8. అలవాటైన నేరస్తుడు అయి ఉండటం
9. నేరస్తుడు వయస్సు, ఆరోగ్య నిలకడ, సెక్స్
10. సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని
బెయిల్ మీద బయటకు వచ్చే ముందు పూచీకత్తు మీద వదిలి పెడతారు, అలా బెయిల్ మీద వదిలే ముందు కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టడం జరుగుతుంది.
1. స్వయం పూచీకత్తు
2. జామీను పూచీకత్తు (2)
3. విచారణకు పోలీస్ వారికి సహకరించాలని
4. విచారణ ముగిసే వరకు రాష్ట్రం లేదా దేశం వదిలి పెట్టరాదు అని
5. సాక్షి లేదా సాక్ష్యాలను మర్చరదు అని
6. కొన్ని నేరాల్లో వారంలో రెండు లేదా మూడు రోజులు పోలీస్ స్టేషన్ లో సంతకం పెట్టమని (చార్జిషీట్ ఫైల్ చేసే వరకు)
7. కోర్టు నుండి సమానులు అందక కోర్టు కు హాజరు అవ్వాలని
ఇలా కోర్టు విచక్షణ అధికారాలను ఉపయోగించి బెయిల్ మంజూరు చేస్తుంది. కోర్టు బెయిల్ అంగీకారం తెలుపడానికి లేదా తిరస్కరించడానికి కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టమైన కారణాలు పేర్కొనాలి. సెక్షన్ 438 లేదా 439 CRPC ప్రకారం జిల్లా కోర్ట్ ఆశ్రయించిన తర్వాత హై కోర్టు నకు వెళ్ళాలి అలా కాకుండా ముందు పై కోర్టు వెల్లినట్లైతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
పాటిల్ అసోసియేట్స్
జి. శ్యామ్ రావు
జి. దినేష్ పాటిల్
జి. ఉమేష్ పాటిల్
9014988555
ARTICLE'S
గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి


రుద్రూర్ జనం వెలుగు న్యూస్ 30 అక్టోబర్ :- రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేయించాలని తద్వారా పశువులకు వ్యాధి సోకకుండా ఉంటుందని రుద్రూర్ పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం రుద్రూర్ మండలకేద్రంలోని బొప్పాపూర్ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ రైతులను ఉదేశించి మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ప్రమాదకరమైనదని పశువులకు ఒకదాని నుండి ఒకదానికి సంక్రమిస్తుందని అన్నారు. గాలికుంటు వ్యాధి సోకకముందే టీకాలు వేయించి నివారణ చేపట్టాలని గాలికుంటు వ్యాధి సోకిన పశువులను ఇతర పశువుల నుండి దూరంగా ఉంచాలని లేనట్లయితే అన్ని పశువులకు వ్యాధి సోకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సూచించారు. ప్రభుత్వం జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా పశువైద్య శాఖ ద్వారా ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతాంగం సద్వినియోగం చేసుకుని గాలికుంటు వ్యాధి టీకాలు వేయించి తమ పశువులను వ్యాధి పడకుండా రక్షించుకోవాలని బారిన సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సంతోష్ పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ARTICLE'S
మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలి


జనం వెలుగు న్యూస్ రుద్రూర్ 29- అక్టోబర్ : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం పాటు కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని మైచర్ మిషన్ వడ్లలోని తేమ శాతం 25 చూపిస్తే రైస్ మిల్లలోని మైచర్ మిషన్ తేమ శాతం 16 చూపిస్తున్నట్లు ఆరోపించారు అదేవిదంగా కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలించకపోవడం వలన కొంతమంది రైతుల ధాన్యం బస్తాలు అడుగుభాగం తడిచినట్లు సకాలంలో రైస్ మిల్ కు ధాన్యం తరలించి ఉంటే రైతులకు నష్టం జరిగేది కాదని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్ వెంటనే సాంక్షన్ చేయాలని చేయాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లులు అన్నిటికీ అలాట్మెంట్ ఇచ్చి సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని రుద్రూర్ బీజేపీ మండల కమిటీ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ గూడూరి ప్రశాంత్ గౌడ్, నియోజవర్గ సీనియర్ నాయకులు పార్వతీ మురళి, మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి గజేందర్, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు, ఎర్రోళ్ల గంగాధర్, యువ మోర్చా మండల అధ్యక్షుడు కుమ్మరి గణేష్, శివప్రసాద్, వరప్రసాద్, వినోద్ కుమార్, మాధవ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ARTICLE'S
వర్ని అంగల్లో తైబజార్ అధిక వాసుళ్లు…


జనం వెలుగు న్యూస్ : వర్ని మండల కేంద్రంలో ప్రతి మంగళవారం వారం వారపు సంత జరుగుతుంది. అందులోనే మేకల అంగడి కూడా జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుండి మేకలు అమ్మడానికి వ్యాపారులు వస్తారు.










