నిజామాబాద్
కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే


కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే
* రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలి..
* పీసీ ఘోష్ కమిషన్ పేరుతో కాలయాపన..
* అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…
ఇందూరు: కాలేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలో రెండు ఒకటేనని స్పష్టమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం పిసి గోష్ కమిషన్ పేరుతో రెండేళ్లపాటు కాలయాపన చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావును, కేటీఆర్ ను అరెస్ట్ చేస్తామని ప్రకటించిందన్నారు. కానీ ఇప్పటి వాకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ప్రాజెక్టు వ్యవహారంలో లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని స్వయంగా కాంగ్రెస్ ఆరోపించి, ఇప్పుడేమో కోర్టులో 9 వేల కోట్లు అవినీతి జరిగిందంటూ పిటిషన్ వేయడం వెనక ఆంతర్యం ఏమిటో తెలపాలన్నారు. అవినీతి పరులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని చట్టపరంగా కోర్టు ముందు సమర్థవంతంగా ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీబీఐ దర్యాప్తుకు కేంద్రానికి లేఖ రాయాలన్నారు. అలాగే హై కోర్టు స్టే ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు లో అప్పీల్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పాలన అధ్వానంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. అర్బన్ లో పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. సిడీపీ ఫండ్ లేక పనులు ముందుకు సాగడం లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇందూరుకు వచ్చిన ప్రతిసారి అభివృద్ధి అంటారు, కానీ నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాయన్నారు. అలాగే మహిళా బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం దారుణమన్నారు. సమావేశంలో ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, మల్కాయి మహేందర్, సీనియర్ నాయకులు న్యాలం రాజు, ఇప్పకాయల కిషోర్, సత్యపాల్, పుట్ట వీరేందర్, మండల అధ్యక్షుడు పడాల భూపతి, పిల్లి శ్రీకాంత్, అమంద్ విజయ్, మారావార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం


అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
సిపి సాయి చైతన్య.
జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.
పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.
నిజామాబాద్
ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ


ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్ఆర్టీసీ
రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి
జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.
ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.
ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్సైట్ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ప్రయాణికులు ముందుగానే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.
ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.
నిజామాబాద్
మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..


మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..
కమలాపూర్ హైస్కూల్ ఇన్చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు
జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.
ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.








