Connect with us

నిజామాబాద్

అంబరాన్నంటిన ముదిరాజ్ పెద్దమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ సంబరాలు 

janamvelugunews

Published

on

అంబరాన్నంటిన ముదిరాజ్ పెద్దమ్మ తల్లి విగ్రహ ఆవిష్కరణ సంబరాలు 

జనంవెలుగు, నిజామాబాద్ : ముదిరాజ్ ల ఆరాధ్య దైవమైన పెద్దమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమ సంబరాలు అంబరాన్ని అంటాయి.

 నిజామాబాద్ పట్టణంలోని వెంగల్ రావు నగర్ కాలనీలో ముదిరాజ్ నగర కమిటి ఆధ్వర్యంలో ఈనెల 21నుండి 23 వరకు ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సావాలలో భాగంగా మంగళవారము ఉదయం 7 గంటలకు ఖిల్లా రోడ్ లోని మమ్మాదేవి ఆలయం నుండి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 22న బుదవారం అమ్మవారికి జలాభిషేకం, ధాన్యాభిషేకం, యజ్ఞం తదితర కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు జరుగాయి. అనంతరం మూడురోజుల పాటు అన్నప్రసాద వితరణ జరిగింది. గురువారం అమ్మవారి ప్రతిష్టాపనలో భాగంగా శ్రీ శ్రీ మల్లారం పిట్ల కృష్ణ స్వామి మహారాజ్ ఆధ్వర్యంలో యంత్రప్రతిష్ట పూజ, శిఖర ప్రతిష్టాపన, కుంభ ప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమరాణీ రమేష్ ముదిరాజ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మేల్యే బిగాల గణేష్ , లతో పాటు మైనారీటి ఉర్దు అకాడమీ ఛైర్మెన్ తాహేర్ బిన్

 హందాన్, మాజీ మేయర్ నీతుకిరణ్, మాజీ ఎమ్మేల్సి వి. జి గౌడ్ పలువురు ముఖ్య నేతలు హజరయ్యారు.

బోనాలు సమర్పించిన 28 సంఘాల ముదిరాజులు

 నగరంలో వివిధ ప్రాంతాల నుండి 28 నగర ముదిరాజ్ సంఘాల పెద్దలు, మహిళలు భక్తి శ్రద్దలతో బోనాలతో ఊరేగింపుగా వెంగల్ రావు నగర్ కాలనీకి తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ తో పాటు నగర కమిటీ పాల్గొన్నారు.

ఈకార్యక్రమంలో భాగంగా నగర మేయర్ కూరగాయల ఉమరాణి ముదిరాజ్, ఉత్సవ కమిటీ నిర్వహకులు , నగర కమిటీ అధ్యక్షులు పిడుగు రవిరాజ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కరాటే రమేష్ ముదిరాజ్, జలిగం గోపాల్ ముదిరాజ్, శివన్న ముదిరాజ్, నీలం రాంచదర్ ముదిరాజ్ వెల్డింగ్ నారాయణ ముదిరాజ్, ఎల్లన్న ముదిరాజ్, మఠం రేవతి భజరంగ్ ముదిరాజ్, నరేందర్ ముదిరాజ్, అంజనేయులు ముదిరాజ్, హన్మాండ్లు ముదిరాజ్, సత్యనారాయణ ముదిరాజ్, లక్ష్మీనారాయణ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

 జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

నగర, ఉత్సవ ముదిరాజ్ కమిటీకి , విగ్రహ దాత భజరంగ్ ను పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన ఉత్సవంలో భాగంగా జిల్లా ముదిరాజ్ జర్నలిస్ట్ ల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో అధ్యక్షులు అల్లురి సతీష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి అబ్బులు ముదిరాజ్, కోశాధికారి రంజిత్ ముదిరాజ్, నర్సింగ్ ముదిరాజ్ లతో పాటు మండల శ్రీనివాస్ ముదిరాజ్, భూషణ్ ముదిరాజ్, ఉప్పలయ్య ముదిరాజ్, మెతుకు రమేష్ ముదిరాజ్, మల్లేష్ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్, మండల రాజు ముదిరాజ్, మండల సత్యనారాయణ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్,, తదితరులు

 పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజామాబాద్

అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

janamvelugunews

Published

on

అమర పోలీసు కుటుంబానికి ప్రభుత్వోద్యోగం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం

సిపి సాయి చైతన్య.

జనం వెలుగు ఆర్మూర్:- 2025 సంవత్సరంలో విధి నిర్వాహణలో పోలీసు కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ 1923, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తు జారీ చేసిన నియామక ఉత్తర్వుల పత్రాన్ని ఆ కుటుంబానికి నిజామాబాద్ పోలీసు కమీషనర్ సాయి చైతన్య అందజేశాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమర వీరుల కుటుంబాలను ఆదుకునే చర్యలలో భాగంగా పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రమోద్ కుమార్ కుటుంబ (ప్రణిత) సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వుల పత్రాన్ని అందజేశాడు.

పోలీసు విధి నిర్వాహణలో అమరుడైన ప్రమోద్ కుమార్ చేసిన సేవలను స్మరించుకుంటూ, విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగాలను ఎప్పటికి మరువదని ఆయన అన్నాడు. అమర వీరులకు టుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తొందని ఆయన అన్నాడు. దేశం కోసం, ప్రజల కోసం తమ ప్రాణాలను సహితం లెక్క చేయ కుండా విధులను నిర్వహించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆయన వివరించాడు.

Continue Reading

నిజామాబాద్

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

Thammali Pandu

Published

on

ప్రజా సేవలో నిజామాబాద్ రీజియన్ టీజీఎస్‌ఆర్టీసీ

రీజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి 

జనంవెలుగు నిజామాబాద్ :– నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు, నగరాల నుంచి తిరిగి గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని ప్రాంతీయ మేనేజర్ ఎస్.వి.జి.కృష్ణ మూర్తి ప్రజలకు సూచించారు.

ప్రజలు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకోవడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది.

ప్రయాణికులు www.tgsrtcbus.in⁠ వెబ్‌సైట్‌ను, అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా తమ ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చు.

 ప్రయాణికులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రిజినల్ మేనేజర్ ఎస్ వి జి కృష్ణమూర్తి కోరారు.

Continue Reading

నిజామాబాద్

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

Thammali Pandu

Published

on

మద్యాహ్న భోజనం అమలులో నిర్లక్ష్యం..

కమలాపూర్ హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్.ఎంపై సస్పెన్షన్ వేటు 

జనంవెలుగు నిజామాబాద్:- నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అ పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు అమర్ సింగ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

2026 సెప్టెంబర్ 15 నుంచి 22వ తేదీ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో నిర్లక్ష్యం జరిగినట్లు పలు వార్తా పత్రికల్లో ప్రచురితమైన కథనాలతో పాటు సంబంధిత అధికారులకు అందిన ఫిర్యాదులపై స్పందించిన కలెక్టర్, ఈ ఉదంతంపై విచారణ జరిపించారు.

ఈ సందర్భంగా మద్యాహ్న భోజనం అమలులో అలసత్వం చోటుచేసుకున్నట్లు వెల్లడి కాగా, విచారణ నివేదిక ఆధారంగా, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఇంచార్జి హెచ్.ఎం అమర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, ప్రయోజనాల అమలులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు.

Continue Reading