నిజామాబాద్
కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించిన కలెక్టర్


కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శించిన కలెక్టర్
జనంవెలుగు నిజామాబాద్:- ఎడపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ మైనార్టీ బాలికల విద్యాలయాన్ని, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్/జూనియర్ కళాశాలలను కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం సందర్శించారు.
పాఠశాలల పరిసరాలను, కిచెన్, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. కేజీబీవీ పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే పరిసరాలను శుభ్రం చేయించాలని, వర్షపు నీరు నిలువ ఉండకుండా చూడాలని అన్నారు.
సువిశాలమైన ఖాళీ స్థలం అందుబాటులో ఉన్నందున అన్ని వసతులతోకూడిన క్రీడా మైదానంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేసి, మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని, పాఠశాలల ప్రవేశ మార్గంలో ప్రధాన ద్వారం వద్ద అందరికీ కనిపించేలా మెనూ బోర్డును ప్రదర్శించాలని నిర్వాహకులను ఆదేశించారు.
కేజీబీవీ లో బాలికల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, ఇతర విద్యార్థినులకు ప్రవేశాలు కల్పించే విషయమై సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడతానని అన్నారు. పాఠశాలలో కొనసాగుతున్న ప్రహారీ గోడ నిర్మాణం పనుల నాణ్యతను పరిశీలించారు. ఆర్.ఓ వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్, జిల్లా వ్యాప్తంగా గల అన్ని కేజీబీవీలలో ఆర్.ఓ ప్లాంట్లు, సోలార్ హీటర్లు వినియోగంలోకి తెచ్చేందుకు మరమ్మత్తులు చేయించాలని అధికారులను ఆదేశించారు.
రెసిడెన్షియల్ కళాశాల ఆవరణలో వరి ధాన్యం, ఇతర కూరగాయలను సాగు చేస్తుండడాన్ని గమనించిన కలెక్టర్ నిర్వాహకులను అభినందించారు. బాలికల ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అనంతరం పదవ తరగతి క్లాస్ రూమ్ లను ను సందర్శించి, విద్యార్థినులకు ఆంగ్లం సబ్జెక్ట్ లో పాఠాలు బోధించారు. పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు.
తన వెంట తెచ్చిన బహుమతులను అందించారు. చక్కగా చదువుకోవాలని, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని విద్యార్థినులకు ప్రేరణ కల్పించారు.
కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ దత్తాత్రి, ఎంఈఓ గాలప్ప, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ దీపిక, రెసిడెన్షియల్ స్కూల్ సహాయ ప్రిన్సిపాల్ సురేఖ తదితరులు ఉన్నారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








