నిజామాబాద్
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, స్వాతంత్ర దినోత్సవ వేడుక ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష


స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, స్వాతంత్ర దినోత్సవ వేడుక ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష
జనం వెలుగు నిజామాబాద్:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ భవేష్ మిశ్రా గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ నెల 15న సంగారెడ్డిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టనుండగా, జిల్లా స్థాయిలో నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్ లో ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.
ప్రభుత్వ సలహాదారులు, ఎం.పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్లు, రేషన్ కార్డు లు కలిగిన లబ్దిదారులు హాజరు కానున్న దృష్ట్యా, పక్కాగా ఏర్పాట్లు ఉండాలన్నారు. వేదికను అందంగా ముస్తాబు చేయాలని, ప్రోటోకాల్ ను అనుసరిస్తూ ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎక్కడ కూడా గందరగోళానికి తావు లేకుండా ముందస్తుగానే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సీటింగ్ అరేంజ్మెంట్, పార్కింగ్ వంటి అన్ని ఏర్పాట్లు చక్కబెట్టుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు బాధ్యతలు పురమాయించారు.
అలాగే, ఈ నెల 15న ఉదయం వేళలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పురోగతిని సమగ్రంగా తెలిపేలా ముఖ్య అతిథి ప్రసంగం నివేదిక ఉండాలన్నారు.
ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి స్టాళ్ళను, శకటాలను ఏర్పాటు చేయాలన్నారు. దేశభక్తిని పెంపొందించేలా విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, స్వాతంత్ర్య సమరయోధులను, వారి కుటుంబీకులను ఘనంగా సత్కరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు, అనధికారులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, ప్రశంసా పత్రాల గ్రహీతలు, ప్రజలు వేడుకలను వీక్షించేందుకు వీలుగా సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలని అన్నారు.
ప్రశంసా పత్రాల పంపిణీ, పతాక ఆవిష్కరణ, వేదిక అలంకరణ, టెంట్, కుర్చీలు, సౌండ్ సిస్టం, మైక్, ప్రోటోకాల్ ప్రకారంగా ప్రముఖుల ఆహ్వానం, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యవసర ఏర్పాట్లు, అగ్నిమాపక, వైద్య సేవలు తదితర అన్ని ఏర్పాట్లను సరి చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ లో, పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే పంద్రాగస్టు వేడుకలకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, జిల్లా రెవెన్యూ అధికారి బి.గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ ఆర్డీఓ సందీప్, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డీఆర్డీఓ సాయన్న, సీ.పీ.ఓ కిషన్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిజామాబాద్
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు


విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు
రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి
జనంవెలుగు నిజామాబాద్:- విజయదశమి పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలు చేపట్టే ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, ఐకమత్యంతో జీవించాలని, అన్ని వర్గాల ప్రజలకు విజయదశమి శుభాలను అందించాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్
జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు


జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
జనంవెలుగు నిజామాబాద్ :– విజయ దశమి వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతీ కార్యం విజయవంతం కావాలని అభిలషించారు. విజయ దశమి వేళ అన్ని వర్గాల వారు సుభిక్షంగా, సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని ఆకాంక్షించారు.
నిజామాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…బంగారు గౌరమ్మ ఉయ్యాలో..
నగరంలో సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ వేడుకలు
బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) వద్ద మహిళల కోలాహలం.
జనంవెలుగు నిజామాబాద్ :- నిజామాబాద్ నగరంలో ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక ప్రతీకగా జరుపుకునె తంగేడు, గూనుగు పూలతో పాటు, రక రకాల పూలతో జరుపుకునే పువ్వుల పండగ.
భాద్రపద అమావాస్య నుండి తొమ్మిది రోజుల పాటు వైభవంగ జరుపుకునే మహిళల పండుగ.ప్రకృతిలో లభించే రకరకాల పూలను గోపురం లా అందమైన పొరలు గార్చి తయారు చేస్తారు,
పసుపుతో గౌరమ్మను చేసి దాని పై ప్రతిష్టిస్తారు. ప్రతి గల్లీలో మహిళలు ముస్తాబయి.. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి హుషారైనా బతుకమ్మ పాటలతో హోరేత్తించారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చిన్నారులకు తెలియచేయడానికి ఈ పండగ ఒక వేదిక అనుకోవచ్చు. చిన్నారులు చిట్టి, చిట్టి బతుకమ్మలను చేతిలో పట్టుకుని ఫోటోలకు,ఫోజులివ్వడం అందరిని ఆనంద డోలికల్లో ముంచెత్తింది.
బతుకమ్మ డి జె పాటలకు మహిళలు ఉత్సాహం తో, హుషారైనా స్టెప్పులు వేయడం అందరిని అలరించింది. ఈ సందర్బంగా బొడ్డెమ్మ చెరువు (మినీ ట్యాంక్ బండ్ ) దగ్గర మహిళలు మరొక్కసారి బతుకమ్మ పాటలకు సంగీతానికి తగ్గట్టుగా,ఒకేసారి కొట్టె చప్పట్ల సప్పుడుకు,ఒకేసారి వేసే స్టెప్పులతో చెరువు వాతావరణమంతా హోరేత్తింది.
ఈ సందర్బంగా ఖిల్లా రోడ్, గాజుల్ పేట్, బడా బజార్, శివాజినగర్, గాయత్రీనగర్, సీతారామ్ నగర్, వర్ని రోడ్, సాయి నగర్ ప్రాంతల లోని మహిళలు బొడ్డెమ్మ చెరువులో బతుకమ్మలను పోయిరా.. పోయిరా బతుకమ్మ అంటూ వదిలారు.








