Uncategorized
భవిష్యత్తులో మానవ వినియోగానికి జీవన ఇంధనం మార్పిడి ఎంతో అవసరం*


- జనం వెలుగు :-బాసర
రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీ లో బుధవారం మనిషి జీవితంలో మానవ వినియోగానికి ఇంధనం మార్పిడి ఎంతో అవసరమని ప్రొఫెసర్ కల్లూరి విశ్వనాథన్ పేర్కొన్నారు మెటీరియల్ అండ్ మెట్లర్జీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నానోటెక్నాలజీ రంగంలో ప్రముఖ ప్రొఫెసర్ ప్రొఫెసర్ కల్లూరి V. S. రంగనాథ్, బనారస్ హిందీ విశ్వవిద్యాలయం నుండి జీవ ఇంధనాలు అభివృద్ధి చెందుతున్న అంశంపై అతిథి ప్రసంగం నిర్వహించబడింది. ఇంజనీరింగ్ విద్యార్థులతో తమ పరిశోధనా అనుభవాన్ని పంచుకోవడం ద్వారా బయో ఫ్యూయల్ అప్లికేషన్‌ల కోసం కార్బోహైడ్రేట్‌లను బయోమాస్‌గా మార్చడంలో అడ్వాన్స్‌డ్ ఫంక్షనల్ మెటీరియల్స్ పాత్ర గురించి ఆయన వివరించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ మరియు కెమికల్ ఇంజినీరింగ్ విద్యార్థుల నుండి సుమారు 300 మంది విద్యార్థులు ప్రసంగానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేసి అర్జీయూకేటీ విద్యార్థులకు ఉన్నత విద్య వైపు వెళ్లే విధంగా ఇలాంటి ఉపన్యాసాలు ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. వక్త ప్రొఫెసర్ కెవిఎస్ రంగనాథ్ తన ప్రసంగంలో మాట్లాడుతూ- భవిష్యత్తులో మానవ వినియోగానికి లేదా జీవ ఇంధనాల మార్పిడికి కార్బోహైడ్రేట్ ఆహారానికి డిమాండ్ పెరుగుతోందని మరియు ‘భవిష్యత్తులో డిమాండ్ సరఫరాకు వృధా లేకుండా ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం’, ప్రతి జీవికి ఆహారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ కన్వీనర్ శ్రీ కిరణ్ , డాక్టర్ అజయ్ HoD, డాక్టర్ శాస్త్రి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అజయ్, అశోక్,వివిధ విభాగాల అధ్యాపకులు, అరుణ్, హరిబాబు, వినోద్ (కెమికల్ ఇంజినీరింగ్ నుండి) డాక్టర్ వినోద్ (సివిల్ ఇంజనీరింగ్ నుండి), డాక్టర్ కస్సన (కెమిస్ట్రీ విభాగం నుండి) మరియు రాకేష్ టిపి రెడ్డి, శ్రీనివాస్ (బయోసైన్స్ విభాగం నుండి) విద్యార్థులు పాల్గొన్నారు.
Uncategorized
ప్రభుత్వ వైఫల్యంపై ధర్మోరా, అబ్దుల్లాపూర్ రైతుల నిరసన


ప్రభుత్వ వైఫల్యంపై ధర్మోరా, అబ్దుల్లాపూర్ రైతుల నిరసన
జనంవెలుగు, లోకేశ్వరం, నవంబర్ 12: లోకేశ్వరం మండలం పరిధిలోని ధర్మోరా, అబ్దుల్లాపూర్ గ్రామాల రైతులు వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, మంగళవారం వారు సమగ్ర కుటుంబ సర్వేను బహిష్కరించారు. రైతులు మాట్లాడుతూ, ఈ వానాకాలం సీజన్‌లో పండించిన వరి పంటను కొనుగోలు చేయడానికి తగిన కేంద్రాలు అందుబాటులో లేకపోవడం తమను తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందని చెప్పారు. పండిన పంటతోనే నిలిచి ఉండాల్సిన పరిస్థితులు కల్పించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కాలంలో పంట సకాలంలో కొనుగోలు చేయకపోతే రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, పంట నష్టపోయే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. “సర్కారు ఇలాగే కొనసాగితే, గ్రామస్థులు తమ హక్కుల కోసం మరింత గట్టిగా నిరసన తెలిపే ప్రయత్నం చేస్తారు. సమగ్ర సర్వేకు మేము సహకరించేందుకు సిద్ధంగా లేము,” అని గ్రామస్థులు హెచ్చరించారు. ఈ సమస్యకు త్వరితగతిన పరిష్కారం లేకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. గ్రామస్థుల నిరసన నేపథ్యంలో అధికారులు త్వరగా స్పందించి, రైతుల సంక్షేమం కోసం పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని రైతులు ఆశిస్తున్నారు.
Uncategorized
ఉచిత బస్సు ప్రయాణం-ప్రజలకు ప్రాణ సంకటం


Uncategorized
రేపు జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి


రేపు జర్నలిస్టులకు ముఖ్యమంత్రిచే నివాస స్థలాల పంపిణి
38 ఎకరాల భూమి అందచేయనున్న సీఎం
మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు అందచేత
జనం వెలుగు, హైదరాబాద్:- సుదీర్ఘకాలంగా జర్నలిస్టులు తమ నివాస స్థలాలకై ఎదురుచూస్తున్న శుభ ముహూర్తం ఖరారైంది. రేపు (8 . 9 .2024 ) న ఉదయం 10 హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై జవహర్ లాల్ నెహ్రు హోసింగ్ సొసైటీ కి 38 ఎకరాల భూమిని అందచేయనున్నారు.
ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం అనే పేరుతొ నిర్వహిస్తున్న ఈ జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌరసంబందాలు, రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస రెడ్డిలతో పాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు..
రాష్ట్రంలో విధినిర్వహణలో, వివిధ కారణాల వల్ల మరణించిన 36 మంది జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈ సమావేశంలో అందించనున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొనే ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్టులను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ ఎం. హనుమంత రావు విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని సమాచార శాఖ తరపున లైవ్ కవరేజి ఇస్తున్నందున ప్రెస్ ఫోటో, వీడియో గ్రాఫ్ చేయడానికి అనుమతించడంలేదని, ఇందుకు సహకరించాల్సిందిగా తెలిపారు.








