Connect with us

ARTICLE'S

బలహీనమవుతున్న ప్రజల బ్రహ్మాస్త్రం

janamvelugunews

Published

on

• ఘనంగా ఆర్టిఐ అమలు దినోత్సవం
• హాజరైన ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి ట్రైనర్ అష్రఫ్
• సహ రక్షణ చట్టం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కొండగుర్ల కమలాకర్

జనంవెలుగు, కొమరం బీమ్ ఆసిఫాబాద్:- కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల కేంద్రంలో సమాచార హక్కు చట్ట అమలు దినోత్సవాన్ని సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్టిఐ ఆక్టివిస్ట్లు ఎం.సి.ఆర్.హెచ్.ఆర్.డి ట్రైనర్ అష్రఫ్, సహ రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కొండగుర్ల కమలాకర్ హాజరై మాట్లాడుతూ ప్రజల చేతిలో శక్తివంతమైన ఆర్టిఐ అస్త్రం బలహీనమవుతుందని అన్నారు. సమాచారం పొందడం ప్రతి ఒక్క పౌరుని రాజ్యాంగబద్ధమైన హక్కు అని అన్నారు. సహ చట్టం ద్వారానే ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం సాధ్యమన్నారు కానీ సహ చట్టం దేశంలో అమలు నేటితో 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, సహ చట్టం అమలులో, చట్టబలోపేతంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుందన్నారు. గ్రామస్థాయి వరకు గల ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార బోర్డులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడం లేదన్నారు. సెక్షన్ 4 (1) (బి) ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన 17 అంశాలు సమాచారం అందుబాటులో ఉండడం లేదన్నారు. చట్ట నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులకు పిఐఓ, ఏపీఐవో లు సమాచారం అందించడం లేదన్నారు. దరఖాసుదారుల, ఆర్టిఐ కార్యకర్తల వివరాలు బహిర్గతం అవుతున్నాయని, దానితో వారిపై దాడులు మరియు ఇతరపరంగా నష్టాలు చేకూరుతున్నాయని అన్నారు. దరఖాస్తుదారుల రక్షణ కొరకు గల మెమో నెంబర్: 33086 ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.

రాష్ట్ర సమాచార కమిషన్ సెక్షన్ 20 ప్రకారం అనుసరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. రాష్ట్ర కమిషనర్ సుప్రీం కోర్టు తీర్పులు, కేంద్ర సమాచార కమిషన్ తీర్పులు, రాజ్యాంగబద్ధమైన ఇతర చట్టాలను ప్రమాణికం చేసుకొని రూల్ ఆఫ్ ల ప్రకారం ఏపీఐవో, పిఐఓ, ఏవో పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. సహ చట్టబలోపితం కొరకు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయవలసిన ఆర్టిఐ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఇట్టి కమిటీలలో సామాజిక కార్యకర్తలకు చోటు కల్పించి చట్ట బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. సహ చట్టం రక్షణ కొరకు, దరఖాస్తు దారుల, ఆర్టీఐ కార్యకర్తల పరి రక్షణ కొరకు, ప్రజల రాజ్యాంగ బద్దమైన హక్కుల కొరకు ప్రతి ఒక్క ఆర్టీఐ, సామాజిక కార్యకర్తలు, మేధావులు ఒకే వేదిక పైన వచ్చి కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

రోడ్ సేఫ్టీ కోసం ఆర్టిఐ కార్యకర్త అజీమ్ పేరుతో దరఖాస్తుల ఆవిష్కరణ

ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టిఐ కార్యకర్త అజీమ్ పేరుతో జాగృతి యువ మంచ్ ఆధ్వర్యంలో రూపొందించిన సమాచార హక్కు చట్ట దరఖాస్తు పత్రాలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జిల్లా అధ్యక్షులు కబీర్, జిల్లా కార్యదర్శి వంగారి ప్రవీణ్, జిల్లా అడ్వైజర్ రామ్టెంకి కృష్ణ, జిల్లా ప్రచార కార్యదర్శి దుర్గం శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి లింగన్న, డివిజన్ జాయిన్ సెక్రటరీ అఖిలేష్, ఆర్టీఐ కార్యకర్త శరత్ చంద్ర, మండల ఉపాధ్యక్షులు దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ARTICLE'S

పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలాధారం

janamvelugunews

Published

on

పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి మూలాధారం

పత్రికాస్వేచ్చా హరణంలో భారతదేశం 8వ స్థానంలో ఉంది.

నేడు ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం

పత్రికారంగం‌లో శ్రమిస్తున్న పాత్రికేయులకు శుభాకాంక్షలు

జనంవెలుగు, వెబ్డేస్క్:- ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం పత్రికారంగం. ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవాన్ని మే 3 వ తేదీన యునెస్కో నిర్వహిస్తుంది. ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశపు విండ హాక్ నగరంలో 1991 ఏప్రిల్ 29 నుండి మే 3 వ తేదీవరకు యునెస్కో నిర్వహించిన సమావేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పలు తీర్మానాలు చేశారు. స్వేచ్ఛాయుతమైన, స్వాతంత్ర్యమైన, ప్రపంచవ్యాప్తంగా బహుళ జాతుల సమన్వయానికి మాధ్యమంగా, ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి, ఆర్ధీకాభివృధ్ధికీ, పౌరుల ప్రాధమిక హక్కుయైన పత్రికా స్వేచ్చ పరిఢవిళ్లడం అవసరం. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం ప్రపంచ పత్రికా దినోత్సవాన్ని డిసెంబర్ 1993 లో ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి 19వ ఆర్టికల్ లోనే పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన మూలాలు ఇమిడి ఉన్నాయి. “భావ స్వేచ్చ, ప్రకటన, స్వేచ్ఛగా అభిప్రాయాలను కల్గియుండటం ప్రపంచంలోని ప్రతీ పౌరుని ప్రాధమిక హక్కు. ఈ హక్కుల ఇతరుల దయా దాక్షిణ్యాలతో వచ్చినవి కావు. జన్మతో స్వతఃసిధ్ధంగా సంక్రమించినవి. (మన రాజ్యాంగం‌లో కూడా ప్రాధమిక హక్కులను చర్చించింది 19అధికరణం‌లోనే) రాజకీయాలలోనూ, పరిపాలనలోనూ స్వచ్ఛత విలసిల్లడానికీ, పరుగెత్తేకాలంతో సమాంతరంగా ప్రజల ముంగిటికి వార్తలు అందించే విలేకరులు ప్రతీ దినం ఎన్నో దాడులను, బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. కొందరు జైళ్ల పాలవుతున్నారు, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొందరి వివరాలు తెలియకుండ పోతున్నాయి. పత్రికాస్వేచ్చా హరణంలో ఇరాక్ ప్రధమ స్థానాన్ని సంపాదిస్తే భారతదేశం 8వ స్థానంలో ఉంది.

పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. ఆ దేశంలోకానీ, సమాజంలోకానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమే. పత్రికా స్వేచ్చా పారదర్శకతను తద్వారా సుపరిపాలనను పెంపొందిస్తుంది. పత్రీకా స్వేచ్చ అవగాహన, విజ్ఞానాలను అనుసంధానం చేసే వారధి వంటిది. జాతులు, సంస్కృతుల మధ్య భావ మార్పిడికి, వాటి అభివృధ్ధికి పత్రికలు, పత్రికా స్వేచ్చా తప్పనిసరి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రమాదపుటంచుల్లో వార్తలు సేకరించే విలేకరులకు (లేదా మరిణించిన విలేకరులకు) యునెస్కో/ గ్యూలెర్మో కనో ప్రపంచ పత్రికా స్వేచ్చా బహుమతిని ప్రదానం చేస్తారు. కొలంబియాకు చెందిన గ్యూలెర్మో కనో అనే విలేకరి డ్రగ్ మాఫియాను ఎండగడుతూ 1986లో తన పత్రికా కార్యాలయం ఎదుటనే హత్యకు గురయ్యాడు. గ్యూలెర్మో కనో సంస్మరణార్ధం ఏర్పాటుచేసిన ఈ బహుమతి విలువ $25000 (అమెరికా డాలర్లు) ప్రజలకోసం, పత్రికా స్వేచ్ఛాకోసం కృషిచేస్తున మన పాత్రికేయ మిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ, అసువులు బాసిన సంపాదకులకు, విలేకరులకు ఈ రోజున నివాళులర్పించడం మన కనీస ధర్మం.

Continue Reading

ARTICLE'S

 story ఇంద్రవెల్లి గాయానికి నేటితో 44ఏళ్ళు

janamvelugunews

Published

on

ఇంద్రవెల్లి గాయానికి నేటితో 44ఏళ్ళు
 -1981 ఏప్రిల్ 20 న జరిగిన యధార్థ ఘటన
-నేడు ఇంద్రాదేవికి పూజలు చేసి అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఆదివాసీ సాంప్రదయాలతో నివాళులర్పించనున్న ఆదివాసీలు
story
janam velugu:– ఇంద్రవెల్లి గాయానికి నేటితో 44 ఏళ్ళు .. 1981 ఏప్రిల్ 20 న జరిగిన యధార్థ ఘటన..నేడు ఇంద్రాదేవికి పూజలు చేసి అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఆదివాసీ సాంప్రదయాలతో  ఆదివాసీలు నివాళులుఅర్పిస్తారు.
అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది.?
1981ఏప్రిల్ 20 ఆరోజు సోమవారం ఇంద్రవెల్లిలో వారసంత…. తమ భూములను అక్రమంగా ధనికులు బాడ బాబులు  దోచుకుంటున్నారు, ఎలాగైనా  తమ భూములను రక్షించుకోవాలాని  రైతుకూలి సంఘంతో సభ ఏర్పాటు చెయటంతో ఈ సభను 144 సెక్షన్ పెట్టి  పోలిసులు అనుమతించక పోవటంతో పోలిసులకు ఆదివాసీలకు జరిగిన తోపులాటలో  ఓ పోలీసు ఆదివాసీ మహిళపై చేయివేయడంతో తనపై చేయివేసాడని  తన మానాన్ని రక్షించుకోవలనుకున్న ఆ మహిళ పోలీసు పై చెయి చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న వారంతా తమ ఆదివాసీ మహిళపై చేయివేస్తారా అని కేకలు వేయడంతో వారిద్దరి మధ్య ఘర్షణ నెలకొల్పడంపై పోలీసులు లాటి చార్జ్ చేసారు. దీంతో భాయాందోళనకు గురైన ఆదివాసీలు తమ వ్యవసాయ పనిముట్లతో పోలీసులపై తిరగబడ్డారు ఈ కోణంలోనే ఆ పోలీసు మహిళ ఒంటి పై చేయి వేయడంతో ఆమె తన మానాన్ని రక్షించుకునేందుకు పొలం నుండి తన వెంట తెచ్చుకున్న  కోడవలితో ఆ పోలీసును కొట్టడంతో పోలీసులు కాల్పులు జరిపారు  ఇలా ఈ ఘటనలో వందలాది మంది అక్కడిక్కడే పోలిసుల కాల్పుల్లో అసువులు బాసారు..కొందరు తీవ్ర గాయాలతో బయటపడి ప్రాణాలను దక్కించుకున్నారు…. ఇందుకు నిదర్శనంగా ఈ అమరవీరుల స్తూపం నిర్మించారు….కానీ నేటికీ వారికి స్వేచ్ఛగా నివాళులర్పించటానికి అనుమతి ఇవ్వకుండా 144 సెక్షన్ పెట్టి షరతులతో కూడిన అనుమతివ్వడం సమంజసం కాదని అంటున్నారు..నేటికి భూముల  సమస్యల వలయంలోనే ఉన్నారు  ఆదివాసులు.

Continue Reading

ARTICLE'S

సామాజిక అసమానత, అస్పృశ్యత లపై సమరం చేసిన సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే

janamvelugunews

Published

on

సామాజిక అసమానత, అస్పృశ్యత లపై సమరం చేసిన సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే
-నేడు ఆయన జయంతి

జనంవెలుగు, వెబ్డేస్క్:- కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు. స్త్రీలు చదువుకోవాల్సిందే అని పట్టుబట్టి ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త. బడుగు, బలహీన, పీడిత వర్గాలకు అండగా నిలిచిన పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే. భౌతికంగా ప్రపంచాన్ని వదిలి 129 ఏళ్లయినా బడుగుల మేలు కోసం పూలే పడిన ఆరాటం ఇప్పటికీ స్ఫూర్తిని పంచుతోంది. ఇవాళ ఆ మహనీయుడి వర్థంతి సందర్భంగా పూలే సేవలను దేశం స్మరించుకుంటోంది.
మహాత్మా జ్యోతిరావు ఫూలే. సమాజంలో అన్ని వర్గాలకూ సమాన హక్కులు ఉండాలనీ స్త్రీలు సంఘంలో భాగం కావాల్సిందే అని పోరాటం చేసి దేశాన్నే మేల్కొలిపిన మహనీయుడు. అగ్రవర్ణాల నుంచి కుల వివక్షను ఎదుర్కొన్నా ఆఖరికి చదువుకునేందుకు పరిస్థితులు సహకరించకున్నా అన్నీ తట్టుకుని అందరి కోసం జీవితం అంకింతం చేశారు ఫూలే. వెనకబడిన కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదుర్కొన్న ఫూలే సత్య శోధక్ సమాజ్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. బలహీన వర్గాల తరఫున పోరాడారు. వారికి అన్ని హక్కులూ అందాలని గొంతెత్తారు.

ఫూలే బాల్యం కష్టాలతో మొదలైంది. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో 1827 ఏప్రిల్ 11న ఫూలే పుట్టారు. 9 నెలల వయసులోనే ఫూలే తల్లి చిమన చనిపోయారు. తండ్రి గోవిందరావు ఇంకో పెళ్లి వద్దనుకోవడంతో నర్సు సంరక్షణలో పెరిగారు. ఇబ్బందుల మధ్యే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. చివరికి చదువు మానేసి తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడ్డారు. 12 ఏళ్ల వయసులోనే సావిత్రీబాయితో పూలే వివాహం జరిగింది. అప్పటి వరకు బలహీన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ పెరిగిన పూలే పెళ్లి తర్వాత అందరి సంక్షేమం కోసం ఇంటి నుంచే కార్యాచరణ మొదలు పెట్టారు.

సమాజంలో మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా ఫూలే పని చేశారు. భార్య సావిత్రీబాయికి చదువు చెబుతూ మహిళా విద్య కోసం పోరాటం మొదలు పెట్టారు. ఆమె కూడా సహకరించడంతో పూలే మరింతగా జనాల్లోకి వెళ్లారు. 1848లో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా ఓ స్కూల్ ను ఏర్పాటు చేశారు. ఇలాంటిది. దేశంలో ఇదే మొదటిదని కొందరంటారు. ఇక.. అగ్రవర్ణానికి చెందిన స్నేహితుడి ఇంట్లో పెళ్లికి వెళ్లి అవమానానికి గురైన పూలే ఆ సందర్భం నుంచి బలహీన వర్గాల తరఫున పోరాటానికి సిద్ధమయ్యారు. కుల, మతాకు అతీతంగా ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలంటూ గొంతెత్తారు.

ఫూలే పోరాటానికి సమాజంలోని అన్ని వర్గాలనుంచి మెల్లగా మద్దతు పెరిగింది. ఇదే ఉత్సాహంతో 1851లో అమ్మాయిల కోసం పెద్ద స్కూల్ ఏర్పాటు చేశారు. గణితం, చరిత్ర, జాగ్రఫీ బోధిస్తూ ప్రపంచంపై అవగాహన కల్పించారు. ఇలాంటివే మరిన్ని స్కూళ్లు ఏర్పాటు చేసి బాలికల విద్య కోసం వీలైనంతగా కృషి చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన ఫూలే వితంతువుల పెళ్లిళ్లకు అండగా నిలిచారు. గర్భవతులుగా ఉన్న వితంతువుల కోసం ప్రత్యేక సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. భార్య సావిత్రీబాయితో కలిసి అంటరానితనం రూపుమాపేందుకు జనంలో చైతన్యం పెంచారు.

జీవితాన్ని పూర్తిగా బడుగుల పోరాటానికే అంకితం చేసిన ఫూలే దంపతులకు పిల్లలు లేరు. వితంతువుల కోసం ఏర్పాటు చేసిన సేవా కేంద్రం నుంచే ఓ శిశువును దత్తత తీసుకున్నారు. ఆ బాబు డాక్టర్ చదువు పూర్తి చేసి ఫూలే దంపతులు చూపిన మార్గంలోనే సమాజ సేవ చేశారు. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పేదల సంక్షేమానికి పాటుపడిన మహాత్మా ఫూలే 1888 జూలైలో అనారోగ్యంతో మంచాన పడ్డారు. రెండేళ్ల తర్వాత ఆరోగ్యం విషమించడంతో 1890 నవంబర్ 28న కన్నుమూశారు.

Continue Reading