Connect with us

Helth

జనవరి 19న ఉదయం 9.00 గంటల నుంచి జిల్లాలలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం.

Published

on

జనవరి 19 నుంచి జిల్లాలలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం – రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

ప్రణాళికబద్దంగా కంటిపరీక్షలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలి :
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.

జనం వెలుగు నిర్మల్ బ్యూరో:-  జనవరి 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు.

ప్రతి ఇంటికి కంటి వెలుగు ఆహ్వాన పత్రిక అందేలా చర్యలు

వాట్సాప్ గ్రూపుల ద్వారా సకాలంలో క్యాంపులు ప్రారంభించేలా పర్యవేక్షణ

కంటి వెలుగు క్యాంపులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకుని రావాలి.

జనవరి 19న ఉదయం 9.00 గంటల నుంచి జిల్లాలలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం.

సోమవారం మంత్రి హరీష్ రావు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి , హైదరాబాద్ నుండి రాష్ట్ర సీఎస్ శాంతికుమారి , డీజిపి అంజనీ కుమార్ వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేతలు బీఆర్కె భవన్ నుంచి కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పై అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఇది చాలా సున్నితమైన కార్యక్రమం అని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరపున తగిన భద్రత కల్పించాలని మంత్రి తెలిపారు. జనవరి 18న ఖమ్మం లో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారని, జిల్లాలలో జనవరి 19న ఉదయం 9.00 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు,జడ్పీ చైర్మన్లు జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు వారి పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు.

జిల్లాలలో కలెక్టర్, డిఎంహెచ్ఒ వాట్సాప్ ద్వారా ప్రతి బృందం సకాలంలో క్యాంపులు ప్రారంభించేలా పర్యవేక్షణ చేయాలని, జిల్లాలో ఉన్న వైద్య బృందాలు సమీప పట్టణాలు,మండల హెడ్ క్వార్టర్ లో నైట్ హాల్ట్ చేసేలా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని, ఉదయం 8-45 వరకు తప్పనిసరిగా బృందాల సభ్యులు క్యాంపు లోకేషన్ చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

కంటి వెలుగు క్యాంపులు విజయవంతం అయ్యేందుకు పంచాయతీ కార్యదర్శుల, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్.పి లు, విఒఏలను భాగస్వామ్యం చేయాలని, క్యాంపు నిర్వహణ ముందస్తు సమాచారం ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక అందించాలని, ప్రజలు ఉదయం , మధ్యాహ్న సమయాల్లో వచ్చే విధంగా షెడ్యూల్ చేయాలని మంత్రి సూచించారు.

ప్రతి వైద్య బృందానికి క్యాంపు నిర్వహణ కోసం అవసరమైన సామాగ్రి, మందులు, కళ్ళద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలని
కంటి వెలుగు శిబిరాలకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకుని వచ్చే విధంగా అవగాహన కల్పించాలని, గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ కంటే ముందుగా సంబంధిత ఆశా, ఎఎన్ఎం లు పర్యటించి షెడ్యూల్ వివరాలు తెలియజేస్తూ కంటి వెలుగు పై అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో ఉన్న ఎంపిఒ, ఎంపిడిఓ లు, తహసిల్దార్ లు, మండల ప్రత్యేక అధికారి ప్రతి రోజూ వారిపరిధిలో గలక్యాంపులను తనిఖీ చేయాలని, జిల్లా స్థాయిలో డిఎంహెచ్ఓ, ఇతర ప్రోగ్రాం అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ క్యాంపుల నిర్వహణను తనిఖీ చేయాలని సూచించారు.

సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, ప్రణాళిక బద్ధంగా ప్రజలు క్యాంపులో పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గతంలో కంటే బృందాల సంఖ్యను రెట్టింపు చేసినందున అధికంగా ప్రజలకు కంటి వెలుగు క్యాంపులు అందుబాటులో వచ్చే విధంగా అధికారులు పనిచేయాలని, ప్రజలకు సౌకర్యార్థంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని , చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.

జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ మాట్లాడుతూ కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
ప్రతిరోజు ఉదయం 8.00 గంటల వరకు తప్పనిసరిగా కంటి వెలుగు బృంద సభ్యులు క్యాంపు ప్రదేశానికి చేరుకోవాలని సమావేశాలు నిర్వహించి తెలియజేయడం జరిగిందని, 30 వేల కళ్లద్దాలు వచ్చాయని పేర్కొన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు
కలెక్టర్ హేమంత్ బోర్కడే , DSP జీవన్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా,, ధన్ రాజ్ , జిల్లా పంచాయతి అధికారి శ్రీలత , మున్సిపల్ కమిషనర్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Helth

జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు వెల్నెస్ ఆసుపత్రి హెల్త్ కార్డులు

janamvelugunews

Published

on

జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు వెల్నెస్ ఆసుపత్రి హెల్త్ కార్డులు

జనం వెలుగు, నిజామాబాద్:- జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కోసం వెల్నెస్ ఆసుపత్రి యజమాన్యం పూర్తి భరోసా ఇస్తూ హెల్త్ కార్డు జారీ చేస్తామని ముందుకు రావడం ఎంతో ఆనందకరమని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి డాక్టర్ సుభాష్ అన్నారు.

మంగళవారం నగరంలోని వెల్నెస్ ఆసుపత్రి యాజమాన్యం, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతనంగా ఎన్నికైన కమిటీని ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఆధునిక హంగులతో అన్ని రకాల నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వెల్నెస్ ఆసుపత్రి యజమాన్యం ముందుకు రావడం జర్నలిస్టు మిత్రులకు శుభపరిణామమని పేర్కొన్నారు.

వెల్నెస్ ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు అందేలా ప్రత్యేక హెల్త్ కార్డు రూపంలో ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఈ హెల్త్ కార్డు ఆన్లైన్ ప్రక్రియలో అమలవుతూ, జర్నలిస్టులతో పాటు వారి తల్లిదండ్రులు, పిల్లలకు కూడా చికిత్స పొందే అవకాశం కల్పిస్తుందని వివరించారు. ఉచిత హెల్త్ కార్డు ద్వారా లక్షల రూపాయలు ఖర్చయ్యే శస్త్ర చికిత్సలతో పాటు ఇతర వైద్య సేవలను కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

జర్నలిస్టు మిత్రులు ఈ వైద్య సేవలను పూర్తిగా వినియోగించుకొని, ఆసుపత్రి యజమాన్యానికి సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. హెల్త్ కార్డు విషయంలో జర్నలిస్టుల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, పూర్తి భరోసా కల్పించేందుకు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులు పూర్తిస్థాయిలో సహకరిస్తారని హామీ ఇచ్చారు.

అనంతరం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులతో పాటు జర్నలిస్టుల పక్షాన నిలిచిన వెల్నెస్ ఆసుపత్రి డైరెక్టర్లు అసద్ ఖాన్, సుమన్‌లను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజు, ఉపాధ్యక్షులు, జాయింట్ సెక్రటరీలు ఆంజనేయులు, సతీష్ గౌడ్, గోవిందరాజు, సందీప్ దేశ్ముఖ్, నరేందర్ స్వామి, ఈసీ సభ్యులు సితారే కృష్ణ, పొద్దుటూరు ప్రీతం రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు పాపా ఖాన్, నయీమ్ కమర్ బాయ్, మహమ్మద్ గౌస్ బాయ్, వెల్నెస్ ఆసుపత్రి మేనేజర్ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

Helth

మెగా వైద్య శిబిరం, రక్తదాన

janamvelugunews

Published

on

మెగా వైద్య శిబిరం, రక్తదాన

జనం వెలుగు, రుద్రూర్:- రుద్రూర్ మండల కేంద్రంలోని రాయకూరు, గ్రామంలో సోమవారం ఫుడ్ సైన్స్ కాలేజ్, లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో రాయకూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించరు. ఈ కార్యక్రమంలో 246 మంది రోగులను పరీక్షలు జరిపి అందరికీ బిపి షుగర్ టెస్టులతో పాటు అవసరమైన వారికి ఈసీజీ టెస్ట్లు, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఫుడ్ సైన్స్ కాలేజ్ వారి ఎన్ ఎస్ ఎస్ ఏడు రోజుల క్యాంప్ లో భాగంగా నిర్వహించడం జరిగిందాని. ఈ కార్యక్రమంలో ప్రతిభ హాస్పటల్ నిజామాబాద్ డాక్టర్ జ్యోష్ణ, లైఫ్ కేర్ హాస్పిటల్ బోధన్ డాక్టర్ ఇర్ఫాన్ అలి, లైన్స్ కంటి ఆసుపత్రి డాక్టర్ తహసీన్ తదితరులు పాల్గొన్ని ఉచితంగా చికిత్సలను అందించారు. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ వారిచే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అందులోభాగంగా 21 మంది విద్యార్థులు, ఫుడ్ సైన్స్ కాలేజ్ సిబ్బంది వారి రక్తాన్ని దానం చేసారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రుద్రూర్ డాక్టర్ కల్పన అసోసియేట్ డీన్, డాక్టర్ వెంకట్ రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ జె సాయి ప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ సంరీన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, వారి సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ అధ్యక్షులు లయన్ డాక్టర్ శ్యాంసుందర్ పహాడే సభ్యులు లయన్ తుక్కి మహేందర్ గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Continue Reading

Helth

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

janamvelugunews

Published

on

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

జనంవెలుగు, నిజామాబాద్ ఏప్రిల్ 25 : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీ సిపిఎన్డిటి ఆక్ట్ (గర్భస్తపూర్వ గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం) జిల్లాస్థాయి సలహా సంఘం సమావేశం డిఎంహెచ్ఓ కార్యాలయం లోని డిఎం అండ్ హెచ్ ఓ చాంబర్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుదర్శనం మాట్లాడుతూ, లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్ లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్కానింగ్ సెంటర్లను సీజ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. జిల్లాలో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాలో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించడమే కాకుండా మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సమాఖ్య మొదలగు వారి ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని సమావేశాల్లో లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టంపై, లింగ సమానత్వము, లింగ వివక్ష , బేటి బచావో బేటి పడావో పై అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా మహిళల కి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం ల ద్వారా గృహ సందర్శనలో అమ్మఒడి కార్యక్రమంలో ఆడపిల్ల ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం జరుగుతుంది. గత మీటింగ్ నుండి ఇప్పటివరకు వైద్య సిబ్బందికి, పర్యవేక్షక సిబ్బందికి డివిజన్ల వారీగా అవగాహన నిర్వహించడమే కాకుండా డిగ్రీ స్థాయిలో మహిళా కళాశాలలో పిసిపి ఎన్ డి టి ఆక్ట్ పై భేటీ బచావో భేటీ పడావో పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కన్వర్జేన్సీ లో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎమ్స్, వివో ప్రసిడెంట్లకు అన్ని మండలాల్లో భేటీ బచావో బేటి పడావో, లింగ వివక్ష, లింగసమానత్వంపై ఒకరోజు అవగాహన వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. న్యూ స్కానింగ్ సెంటర్స్ రిజిస్ట్రేషన్ కోసం మనకు మూడు, అదేవిధంగా రెన్యువల్ రిజిస్ట్రేషన్ కోసం 11, అదేవిధంగా క్యాన్సలేషన్ ఆఫ్ స్కానింగ్ సెంటర్స్ గా మూడు చేయడం జరిగిందని, కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారి వారి అభిప్రాయాలని తెలియజేయడమే కాకుండా కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్స్ రోహిణి, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ శరణ్య, రేడియాలజిస్ట్ డాక్టర్ శ్రావణి, పి ఓ డాక్టర్ వెంకటేష్, డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రాధా, స్వచ్ఛంద సేవా సంస్థ, ఆరోగ్య చైతన్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ఘన్పూర్ వెంకటేశ్వర్లు, మెప్మా కల్పన, ఐసిడిఎస్ సౌమ్య, డెమో గంగాధర్, ఏవో చందర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading