నిజామాబాద్
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుత విజయాలు సొంతం


మహిళా సాధికారత అవగాహన కార్యక్రమంలో కలెక్టర్
ఉన్నత ఉద్యోగాల దిశగా కృషి చేయాలని పిలుపు
రాష్ట్ర హైకోర్టు జడ్జికి ఘన స్వాగతం
జనం వెలుగు, నిజామాబాద్:- ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుత విజయాలు సొంతం అవుతాయని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మహిళా సాధికారతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర హైకోర్టు జడ్జి పీ.శ్రీసుధ ముందుగా ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్దకు చేరుకుని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కే.ఆర్.నాగరాజు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఇదివరకు సమాజంలో మహిళల పట్ల వివక్షత నెలకొని ఉండేదని అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా నేడు చాలా వరకు ఆ వివక్షత దూరం అయ్యిందని అన్నారు. ఆకాశంలో సగభాగంగా ఉన్న మహిళలు, పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవిధంగా చెప్పాలంటే మహిళలు వారికి కేటాయించిన బాధ్యతలు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తూ, విధులకు పూర్తి న్యాయం చేస్తున్నారని కలెక్టర్ కొనియాడారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఆదర్శంగా తీసుకుని, విద్యార్థినులు, యువతులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వం టీ ఎస్ పీ ఎస్ సీ గ్రూప్స్ తో పాటు వివిధ శాఖలలో సుమారు లక్ష ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ లు జారీ చేస్తోందని అన్నారు. ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని హితవు పలికారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా, పట్టుదలతో శ్రమిస్తే తప్పనిసరిగా విజయం సాధించగల్గుతారని మార్గనిర్దేశం చేశారు. లక్ష్య సాధనకు అడ్డంకిగా నిలిచే సెల్ ఫోన్ వంటి వ్యాపకాలను పక్కనపెట్టి, పూర్తిగా లక్ష్యంపైనే గురిపెట్టాలని సూచించారు. కష్టపడి లక్ష్యాన్ని సాధించినప్పుడు దాని తాలూకు విజయం అందించే ఆనందం, అనుభూతి అనిర్వచనీయంగా ఉంటుందన్నారు. జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడేందుకు యువతకు ఇదే సరైన సమయమని, దానిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, అదనపు డీ సీ పీ అరవింద్ బాబు, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, న్యాయశాఖ అధికారులు, విద్యార్థినులు, వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారిణులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలు


ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాన ప్రోత్సహికుడికి రాష్ట్ర గవర్నర్ అవార్డు – కలెక్టర్ అభినందనలు
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని లోక్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లచే ప్రదానం చేసిన వ్యక్తిగత అత్యధిక రక్తదాన ప్రోత్సహికుడు (Individual Highest Blood Donor Motivator) అవార్డును రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి ప్రశాంత్ అందుకున్నారు. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు లోక రమణ రెడ్డి తరఫున ఈ అవార్డును ఆయన స్వీకరించారు.
ఈ సందర్భంగా నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు ఇలా త్రిపాఠి, ఐఏఎస్ అవార్డు గ్రహీత ప్రశాంత్‌ను అభినందించారు. జిల్లాలో తలసేమియా బాధిత చిన్నారులకు నిరంతరాయంగా రక్తం అందుబాటులో ఉండేందుకు వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు క్రమం తప్పకుండా రక్తదాన శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని, సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం పట్ల అవగాహన పెంపొందించుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి సాయాగౌడ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కరిపే రవీందర్, జిల్లా కార్యదర్శి గోక అరుణ్ బాబు, మోపాల్ మండల చైర్మన్ వెంకటేశ్వర్లు, పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్
ప్రజావాణికి 135 ఫిర్యాదులు


ప్రజావాణికి 135 ఫిర్యాదులు
నిజామాబాద్, జూన్ 15 : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 135 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, ట్రైనీ కలెక్టర్ పి.సురేష్, డీఆర్ఓ గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
ప్రజావాణి అనంతరం కలెక్టర్ అధికారులకు పలు అంశాలపై సూచనలు చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయినందున అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. జిల్లా అధికారులతో పాటు మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్.సీ.ఓలు విధిగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. బాలికల పాఠశాలల్లో ఎక్కడైనా టాయిలెట్స్ అవసరం ఉన్న పక్షంలో తక్షణమే ప్రతిపాదనలు పంపాలని అన్నారు. కాగా, ఈ నెల 25 నుండి జూలై 24 వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగనుందని, ఈ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు అందరూ బీ.ఎల్.ఓ లను సంప్రదించి మ్యాపింగ్ ను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Crime
మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి


మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….
నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,
చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,
వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.








