Connect with us

నిజామాబాద్

ఏపీఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు

suresh sitharla

Published

on

హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం

ఏపీఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు

జనం వెలుగు, నిజామాబాద్:-    నిజామాబాద్ జిల్లాలో హరితహారం నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బందిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎడపల్లి, నిజామాబాద్ రూరల్ మండలాల ఏ.పీ.ఓ లు, టెక్నికల్ అసిస్టెంట్ లతో పాటు జానకంపేట్ ఫీల్డ్ అసిస్టెంట్, మల్కాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ హరితహారం, మన ఊరు – మన బడి, కంటి వెలుగు కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జానకంపేట్ నుండి అబ్బాపూర్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కల నిర్వహణను మెరుగుపర్చుకోవాలని పదేపదే సూచించినా, తీరు మార్చుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు సంబంధిత ఏపీఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లపై సస్పెన్షన్ వేటు వేశారు. హరితహారం నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని కలెక్టర్ కరాఖండీగా తేల్చి చెప్పారు. ఇప్పటివరకు సానుకూల ధోరణిలో చెబుతూ వచ్చానని, ఇకపై అలసత్వానికి తావు కల్పించే వారిపై తక్షణమే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీచోటా ఎవెన్యూ ప్లాంటేషన్లతో పాటు, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ నిర్వహణ సక్రమంగా కొనసాగాల్సిందేనని, ఎక్కడైనా తేడా వస్తే సంబంధిత అధికారులు, సిబ్బంది మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. మన ఊరు – మన బడి ప్రగతిపై సమీక్షిస్తూ, ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించి వెంటనే ఎఫ్.టీ.ఓ లు జెనరేట్ చేయాలని ఏ.ఈలను ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తి చేయని కారణంగా నిధులు సిద్ధంగా ఉన్నప్పటికీ పనులు చేసిన వారికి సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగడం లేదన్నారు. దీని వల్ల ప్రభుత్వ పనితీరుపై తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉన్నందున, ఏ.ఈలు వెంటదివెంట ఎఫ్.టీ.ఓ లు జెనరేట్ చేసేందుకు చొరవ చూపాలన్నారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యానికి తావిస్తే, ఏ.ఈలను సైతం సస్పెండ్ చేసేందుకు వెనుకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు. ఈ నెల 25 వ తేదీ నాటికి పూర్తయిన పనులన్నింటికీ ఎఫ్.టీ.ఓ లు సిద్ధం కావాలని గడువు విధించారు. అలాగే, ఉపాధి హామీ కింద మంజూరీ తెలిపిన పనులను మార్చి నెలాఖరు నాటికి అన్ని పాఠశాలల్లో పూర్తి చేయాలన్నారు. ప్రతి మండలానికి రెండు చొప్పున ఎంపిక చేసిన బడులలో మిగిలిఉన్న తుది దశ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎంపీడీఓలు గట్టి పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఇదిలాఉండగా, కంటివెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందని, ఈ మేరకు  అధికారులు, సిబ్బంది అందరూ అంకితభావంతో కృషి చేస్తున్నారని కలెక్టర్ అభినందించారు. ఇకముందు కూడా ఇదే స్పూర్తితో పని చేయాలని, శిబిరాలకు వచ్చే వారికి మెరుగైన రీతిలో నేత్ర పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులు, కంటి అద్దాలను అందించాలని కలెక్టర్ హితవు పలికారు. వీడియో కాన్ఫరెన్సులో జెడ్పి సీ ఈ ఓ గోవింద్, మెప్మా పీ.డీ రాములు, జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు దేవిదాస్, భావన్న, మురళి, ఆర్దీఓ లు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, ఏ.పీ.డి సంజీవ్, డీ ఏ.ఓ తిరుమల ప్రసాద్, డిప్యూటీ డీ ఎం హెచ్ ఓ తుకారాం రాథోడ్, డీటీడబ్ల్యుఓ నాగూరావు, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Crime

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి

janamvelugunews

Published

on

మండల కేంద్రంలో ఇనుపరాట్లతో వ్యక్తిపై దాడి….

నందిపేట జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల కేంద్ర వివేకానంద చౌరస్తా సురేష్ నగర్ కాలనీ ఎదురుగా ఉన్న ఆర్డర్ మెస్ ప్రాంతంలో నందిపేట రాజనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన నయిం అనే వ్యక్తిపై కొందరు వ్యక్తులు కారుపై వచ్చి ఇనుపరాట్లతో దాడి చేయడంతో నయిం తలకు,

  చెయ్యికి, పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నయిం, కయ్యులు అన్నదమ్ములని, వీరి బంధువులైన షేక్ తాలిబ్, షేక్ తాహెర్, సాజిద్, షాహెద్, గాలిబ్ మరి కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి రాడ్లతో నయీంపై దాడి చేయడం జరిగిందని,

   వీరి ఇరువురి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నామని, నయీమ్ చికిత్స పొందుతున్నాడని, బాధితుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు, దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.

Continue Reading

Crime

పసిపాపను చంపిన హంతకుల జాడేది

janamvelugunews

Published

on

పసిపాపను చంపిన హంతకుల జాడేది.,

నందిపేట జూన్ 14 జనం వెలుగు; నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో దాదాపు 20 రోజుల కిందట మెయిన్ రోడ్డు పాత హనీ రెస్టారెంట్ వెనకాల ఖాళీ స్థలంలో అప్పుడే పుట్టిన పసికందును ఎండలో పడేయడంతో పసికందు మృతి చెందిన ఘటన అందరికీ తెలిసిందే…

కానీ పాప చనిపోయి 20 రోజులు గడిచిన ఆ పసి గుడ్డు నెత్తుటి మరకలు అంటిన అదాంతకుల యాడ మాత్రం తెలిసి రాలేదు. బేటి బచావో… బేటి పడావో…. అనే నినాదాలు పేపర్లకే పరిమితమైనట్టు ఉంది ఈ సంఘటన.. తరతరాల నుండి ఆడపిల్లల పైన ఎన్నో అఘైత్యాలు, ఆడపిల్ల అంటే అలుసే… మగాడు అంటే మురుపమే..

   ఈ తారతమ్యాలను రూపుమాపేందుకు ప్రభుత్వాలు ఎన్నో చర్యలు చేపట్టిన క్షేత్రస్థాయిలో మాత్రం ఆ లక్ష్యాలను చేదిదిండం లేదు. వెంటనే ఈ దుశ్చర్యలకు పాల్పడిన, ఆ నెత్తుటి మరకల చేతులకు సంకెళ్లు వేస్తేనే మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Continue Reading

నిజామాబాద్

ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి

janamvelugunews

Published

on

ప్రతి ఒక్కరికి అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలి

నందిపేట్ జూన్ 14 జనం వెలుగు: నందిపేట మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై వినయ్ కుమార్ వస్తూ వస్తూనే తన మార్కును చూపిస్తున్నాడు. తన ఠాణా పరిధిలోని ప్రజలందరికీ ఎక్కడికక్కడ సమావేశాలను ఏర్పరుస్తూ మత్తుపదార్థాలపై, అగ్ని ప్రమాదాల నివారణపై, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, దొంగతనాలపై, మరి ముఖ్యంగా యువత డ్రగ్స్ కు బానిస కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా విధి నిబద్ధతతో సమాచారం అందుకున్న వెంబటనే పేకాట స్థావరం పై దాడి చేసి అసాంఘిక కార్యక్రమాలు చేసే వారికి దడ పుట్టిస్తున్నాడు. శనివారం స్థానిక బస్టాండ్ ఆవరణలో ఫైర్ సిబ్బందితో కలిసి ఇంటిలో వినియోగించే ఎల్పిజి గ్యాస్ లీకేజీ, ఫైర్ సేఫ్టీ పైన మహిళలకు అవగాహన కల్పించారు. అనుకోకుండా సిలిండర్ లీకేజీ అయి మంటలు సంభవిస్తే భయపడకుండా ధైర్యంగా చిన్న చిట్కాతో ఎలా మంటలను ఆర్పేయవచ్చో ప్రత్యక్షంగా చూయించారు. వచ్చి రాగానే తమ ప్రజలకు ఆర్థిక నేరాలపై, ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలతో అవేర్నెస్ కల్పిస్తున్న ఎస్సై వినయ్ కుమార్ ను ప్రజలు అభినందిస్తున్నారు.

Continue Reading