Connect with us

నిర్మల్

వసంత పంచమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము

suresh sitharla

Published

on

బాసర ఆలయ ఈవో విజయరామరావు
అమ్మవార్లకు మంత్రి పట్టు వస్త్రాలు సమర్పణ
జనం వెలుగు :- బాసర భారతదేశంలో పవిత్ర పుణ్యక్షేత్రం చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవస్థానం, బాసర యందు 26-01-2023 గురువారం రోజున వసంత పంచమి వేడుకలు మూడు రోజులపాటు జరగనున్నాయి సోమవారం ఆలయ కార్యనిర్హణ అధికారి విజయ రామారావు ఆలయంలోని స్థానిక వేములవాడ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా దేవాలయమునకు వచ్చు భక్తులకు ఈ క్రింది సౌకర్యములు ఏర్పాటు చేయడమైనవి. వసంత పంచమి రోజున ప్రాతఃకాలం 02:00 గంలకు లకు అమ్మవార్లకు అభిషేకము అలంకరణ నిర్వహించి మూడు గంటల నుండి చిన్నారులకు అక్షర శ్రీకర పూజలు పూజారులు చేపడతారు భక్తులకు అభిషేకమునకు అనుమతి లేదు. లోక కళ్యాణార్ధము దేవస్థానము తరుపున నిర్వహించబడును. వసంత పంచమి పర్వదినాన్ని కులుసుకొని అమ్మవార్లకు ఆరోజు ఎటువంటి అర్జిత సేవలు ఉండవని రద్దు చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వము తరుపున సరస్వతీ లక్ష్మి మహాకాళి అమ్మవార్లకు రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు, ముధోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి దంపతులు అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలను 07:00 నుండి 08:00 మధ్యన సమర్పించబడును. అక్షరాభ్యాసములు ప్రాతఃకాలం 03:00 గం. ల నుండి సాయంత్రం 06:30 వరకు నిర్వహించబడును, దేవస్థానము తరపున ఉచిత పార్కింగ్ ఈ క్రింది స్థలములలో ఏర్పాటు చేయబడినవి. అన్నదానము బిల్డింగ్ ప్రక్కన ఖాళీ స్థలములో గోదావరి నుండి దేవస్థానమునకు వచ్చు దారిలో హరి హర కాటేజెస్ పపక్కన గల 08 ఏకరముల ఖాళీ స్థలములో శ్రీ రామ లాడ్జి ముందు గల ఖాళీ స్థలములో వసంత పంచమి సందర్భముగా విద్యుత్ దీపాలంకరణ, క్యూలైన్లు, పనులు కొనసాగుతున్నాయని, పందిళ్లు, పుష్పాలంకరణ ఏర్పాటు చేయనైనది. క్యూలైన్లలలో భక్తులకు పాలు, పండ్లు, మంచినీరు ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తుల సౌకర్యార్ధము కోటి గాజుల మండపము ముందు మరియు టీటీడీ ఖాళీ స్థలములో సేదతీరుటకు, నిద్రించుటకు తడకలు పందిళ్లు ఏర్పాటు చేయనైనది. కావున భక్తులు దేవస్థానమునకు ఈ సందర్భంగా గతంలో లేని విధంగా ఈ సంవత్సరం నూతనంగా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తో మాట్లాడి రెండు ఆర్టీసీ బేస్ బస్సులు అనగా భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు ఉంటాయని దీనితోపాటు జిల్లా వైద్యాధికారి తో మాట్లాడి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శరత్ ఫాతక్ ఏ ఈ ఓ సుదర్శన్ గౌడ్ స్థానాచార్యులు ప్రవీణ్ పూజారులు సూపర్డెంట్ సంజీవరావు శివరాజ్ నారాయణ పటేల్ సీనియర్ అసిస్టెంట్ సాయిలు తదితరులు ఉన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిర్మల్

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

janamvelugunews

Published

on

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

Continue Reading

నిర్మల్

| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

janamvelugunews

Published

on

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ

జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.

అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Continue Reading

నిర్మల్

Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

janamvelugunews

Published

on

నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం

జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Continue Reading