నిర్మల్
జగదాద్రి దేవి బ్రహ్మోత్సవాలు ప్రారంభం


14వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్న భక్తులు
జనం వెలుగు:- శ్రీ ఓం పంచశక్తి పీఠం (ట్రస్ట్) – యంచ. మం|| నవీపేట్, జి॥ నిజామాబాద్, తెలంగాణ ఎందు ఘనంగా 14వ వార్షికోత్సవములు జరుపుకుంటున్నారు. భగవత్ భక్త మహాశయులకు! కలియుగంలో దేవతలు జన్మించి సద్గురువుల రూపంలో భక్తులకు జ్ఞానాన్ని, మోక్షము ప్రసాదిస్తారు. అని నానుడి. ప్రస్తుత ఈ తరుణంలో మన దేశ ద్రావిడ, తమిళ సాంప్రదాయంలో జన్మించి ఉన్నత విద్యలను అభ్యసించి కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో, కోడశాద్రి, చిత్రమూలా పర్వత శ్రేణులలో శ్రీ మూఖాంబికదేవి పాదాల చెంత శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు తపస్సు చేసిన ప్రాంతములో తపస్సు చేసి శ్రీ ఓం జగదాద్రి దేవినే గురువుగా పొంది అమ్మవారి ఆజ్ఞతో శ్రీ ఓం జగద్గురువుగా కీర్తించబడి, శ్రీ ఓం జగద్గురువు శ్రీ ఓం ఆదిశక్తియేంద్ర స్వామీజీగా 33 కోట్ల దేవతలచే ఆశీర్వదించబడి, కాశీలోని పవిత్ర గంగానది సంగమంలో జల తపస్సు చేసి, జగద్గురు శ్రీ ఓం ఆదిశక్తేంద్ర స్వామి వారు తమిళనాడులోని కాంచిపురం దగ్గర అవలూర్ (మద్రాస్, బెంగళూర్ జాతీయ రహదారి) ప్రక్కన శ్రీ ఓం పంచశక్తి పీఠాన్ని స్థాపించి ఒకే గర్భగుడిలో పంచ మహా శక్తులైన మహాలక్ష్మి మహాకాళి, మహాదుర్గ, గాయత్రి, లలితాదేవీ దేవతలను ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే ఇక్కడ అనేక దేవతల, గురువుల దేవాలయాలను ఎక్కడ లేని విధంగా కల్పవృక్షము, కామదేనువును కూడా ప్రతిష్ఠించబడి ప్రతి నిత్యము దేవి దేవతలకు, గురువులకు యజ్ఞాలు, నైవేద్యాలు, నిత్య హారతులు షోడషోపచార పూజలు ఘనముగా నిర్వహించుచున్నారు. శ్రీ ఓం ఆదిశక్తేంద్ర స్వామి వారు తన గురువైన శ్రీ ఓం జగదాద్రి దేవి ఆజ్ఞమేరకు తమిళనాడులోని అటవి ప్రాంతంలో అగ్ని తపస్సు చేసినారు. వారు దేశ విదేశాలలో పర్యటనలు చేసి అనేక పవిత్ర స్థలాలను కూడా పర్యటించినారు, అపర్ణాదేవి వ్రతము కూడా నిర్వహించారు. ఈ విధముగా తన గురువైన శ్రీ ఓం జగదాద్రి దేవి ఆజ్ఞ మేరకు శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మిగా అవతారమెత్తి భూలోక లక్ష్మీదేవతగా కీర్తించబడుతు స్వయంగా శ్రీ మహా విష్ణువుని వివాహం చేసుకున్నారు. శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మి అమ్మవారు దేశ విదేశాల్లో శ్రీ ఓం పంచశక్తి పీఠాలను నెలకొల్పినారు. వీటి ద్వారా ఎన్నో ప్రజా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలో నెలకొల్పిన శ్రీ ఓం పంచశక్తి పీఠం సేవా సంస్థ అయిన శ్రీఓం కేర్ ట్రస్టీ కి అక్కడ చేస్తున్న సేవా కార్యక్రమాలకు 2022 సం||లో ఆస్ట్రేలియా దేశపు అత్యున్నత సేవా పురస్కారాన్ని శ్రీ శ్రీ ఓం స్వర్ణకమల లక్ష్మి అమ్మవారికి ప్రధానం చేస్తూ గౌరవించడం జరిగింది. శ్రీ ఓం జగదాద్రి దేవి ఆదేశానుసారం యంచలో 33 కోట్ల దేవతల అభీష్టం మేరకు శ్రీఓం జగదాద్రి దేవి ప్రియ మానస పుత్రిక అయిన మన పూజ్య స్వర్ణకమల లక్ష్మి (శ్రీ ఓం దేవి) అమ్మవారు శ్రీఓం జగదాద్రి దేవి ఆలయం నిర్మించి ప్రపంచంలోని 1008 జీవనదుల పవిత్ర జలాలతో కుంభాభిషేకం చేసినారు. ప్రతి సంవత్సరం మన దేశంలోని అతి పవిత్ర పంచ జీవ నదులైన గంగా, నర్మదా, గోదావరి, బ్రహ్మపుత్ర, యమున నదులలో పుణ్య స్నానాములు నిర్వహించి ఆ పవిత్ర జలాలతో ప్రతి మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బృహత్తరమైన కార్యక్రమము శ్రీ ఓం జగదాద్రి దేవి ప్రియ మానస పుత్రిక అష్టాదశ శక్తుల మెలికలయిక, కలియుగ లక్ష్మిదేవత అయిన శ్రీఓం స్వర్ణ కమల లక్ష్మి (శ్రీఓం దేవి) అమ్మ గారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించబడును. కాబట్టి ఇట్టి మహోత్తర కార్యక్రమానికి మీరందరు బంధుమిత్రులతో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆహ్వానించువారు: శ్రీ ఓం పంచశక్తి పీఠం (ట్రస్ట్) భక్తబృంధం, గ్రామ ప్రజలు
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








