నిర్మల్
గ్రేడ్-2 భాషా పండితుల సహాయ నిరాకరణ


9, 10 తరగతులకు పాఠాలు బోధించకుండా నిరసన
జనం వెలుగు, బాసర:- పదోన్నతుల్లో మొండిచేయి చూపడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా హిందీ భాష ఉపాధ్యాయులు యోగేశ్వర రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గ్రేడ్-2 భాషా పండితులు బుధవారం సహాయ నిరాకరణ చేపట్టగా తాము పనిచేస్తున్న ఉన్నత పాఠశాలల్లోని 9, 10 తరగతి విద్యార్థుల నుంచి విద్యా బోధన చేయబోమని పండిత జేఏసీ ప్రకటించింది. రాష్ట్రంలో పండితులకు దక్కాల్సిన పదోననతులను కోర్టు కేసులు అంటూ మొండిచేయి చూపించి ఇతర ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం, అధికారులు యుద్ధప్రాతిపదికన పనులను వేగవంతం చేయడంతో తాము రాష్ట్ర వ్యాప్తంగా సహాయనిరాకరణ చేయాలని నిర్ణయించినట్టు పండిత జేఏసీ నాయకులు పిలుపుమేరకు ఈ విషయాన్ని పండిత జేఏసీ నాయకుల ఇప్పటికే విద్యాశాఖ మంత్రి, విద్యా శాఖ కార్యం దర్శి, పాఠశాల విద్య డైరక్టర్ తోపాటు జిల్లా విద్యాశాఖాధికారులకు తెలియ జేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భాషలను, సంస్కృతిని గౌరవిస్తూ చారిత్ర “కంగా ఇచ్చిన మాట, వెలువరించిన జీవోలు 2, 3, 9, 10 అలా ఉండగానే వాటిని అమలు చేయకుండా గ్రేడ్-2 భాషా పండితులకు పదోన్నతుల్లో నెలకొన్న సందిగ్ధతను తేల్చకుండా కోర్టు కేసులను త్వరగా పరష్కరించకుండా గ్రేడ్-2 పండితులకు పదోన్నతుల ముచ్చట లేకుండానే ఇతర సంఘాల ఒత్తిడితో ముందుకు వెళ్లడానికి అధికారులు నిర్ణయించడాన్ని పండిత జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వారు తెలిపారు. అందులో బాగంగానే తమ జాబ్చార్ట్ ఉన్నత పాఠశాలల్లోని 6, 7, 8 తరగతుల విద్యార్థులకు మాత్రమే బోధన చేస్తామని, 9, 10 తరగతుల వారికి చేయ బోమని గ్రేడ్-2 తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులు, పీఈటీలు స్పష్టం చేశారు. తమ అప్గ్రేడేషన్ వ్యవహారం కోర్టులో ఉన్నందున తమకు పదో న్నతులు ఇవ్వకుండా పక్కన బెట్టిన నేపథ్యంలో అందుకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పండిత జేఏసీ స్పష్టం చేసింది. జాబ్ చార్ట్ మేరకు తాము పనిచేయాల్సిన 6,7,8 తరగతుల వారికి మాత్ర మే బోధన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వంలోని పెద్దలు ఈ సమస్యపై దృష్టి సారించి సమస్య పరిష్కారానికి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడం, కోర్టు తుది తీర్పుకు లోబడి పదోన్నతులు కల్పించడం ద్వారా సమస్యను పరిష్కరించాలని పండిత ఐక్యవేదిక కోరింది. బాసర మండల కౌట బాసర కిరగుల్. ప్రధానోపాధ్యాయులు గీతా గోవిందరాజు నరసయ్య ల కు మండల భాష పండితులు పి శంకర్ తెలుగు శ్రీనివాస్ హిందీ శ్రీనివాస్ తెలుగు యోగేష్ హిందీ పద్మజ్యోతి తెలుగు పోసాని హిందీ ప్రధానోపాధ్యాయులకు వినతిపత్రం అందజేశారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















