నిర్మల్
భారతదేశం అమెరికా కంటే ధనిక దేశం


మహారాష్ట్ర ప్రజలకు మంత్రి ప్రత్యేక హామీలు
గులాబీ మాయమైన నాందేడ్ పట్టణం
బహిరంగ సభకుభారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు రైతులు
జనం వెలుగు :- భారతదేశం అమెరికా కంటే ధనిక దేశం అని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు హైదరాబాద్ బేగంపేట నుండి ప్రత్యేక విమానంలోవెళ్లిగా నాందేడ్ కు చేరుకోగా అక్కడ మహారాష్ట్ర ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు అందించి ప్రత్యేక స్వాగతం పలికా దు అనంతరం నాందేడ్‌లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురుద్వారా ఆలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రత్యేక పూజలు చేయగా నేరుగా నాందేడ్ పట్టణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సభను గురుద్వారా మైదానంలో ఏర్పాటు చేయగా నాందేడ్ జిల్లా మహారాష్ట్ర ప్రజలు స్వాగతం పలికారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు తలపెట్టిన కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం మహారాష్ట్ర ప్రజాప్రతినిధులకు కార్యకర్తలకు ముందుగా మంత్రి గులాబి కాండవ కప్పి స్వాగతించారు అనంతరం సభను ఉద్దేశించ మాట్లాడుతూ దేశ స్థితిగతులు చూసి దేశ సేవ చేయడానికి పార్టీ ఉందని దేశంలో మంచి స్పందన లభిస్తుందని స్వతంత్రం వచ్చాక 75 సంవత్సరాలు గడిచిన నేతలు ఎందరో వచ్చారు పోయారు కానీ మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు చేసుకోవడం చాలా బాధాకరమని అన్నదాతకు అహర్నిశలు కష్టపడి వారికి రైతులు అహర్నిశలు కష్టపడిన వారికి కనీస మద్దతు ధర లేకపోవడం సోషల్య కారణమని అన్నారు. కొందరు నాయకులు జాతి కులమత పేరిట విదేశపురంగా మనకు విభజిస్తున్నారని వారిని తరిమించే కాలం వచ్చిందని ఒకటి పాయింట్ 40 వర్షపాతం మనదేశంలో ఉందని గంగా యమునా కృష్ణ గోదావరి పెనుగంగా మంజీరా ప్రాణహిత ఎన్నో నదులు మహారాష్ట్రలో ఉండగా అవి సముద్రంలో కలుస్తున్నాయని రైతులకు ఎటువంటి లాభం చేకూరడం లేదని తెలిపారు లౌకికవాదం కాదు మన భారతదేశం రాజ్యాంగం కల్పించినటువంటి ప్రతి పౌరుడికి రైతుకు స్వచ్ఛ సౌరభత్వం కలిగి ఉన్న మన దేశం ఎంతో గొప్పదని తెలిపారు ఇప్పటికే జింబాబ్వే దేశంలో 16 టీఎంసీ నీరు నైలు నది నుండి రిజర్వాయర్ ద్వారా ప్రవహిస్తుందని అక్కడ రైతులు ఆ నీటితో ఎంతో పంటలు తీస్తున్నారని తెలిపారు ఇకనుండి మహారాష్ట్రలో టిఆర్ఎస్ వాహనం పది రోజుల్లో మండల గ్రామాల్లో తిరుగుతుందని మహారాష్ట్ర టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ ఏకమై నన్ను నమ్మి టిఆర్ఎస్ పార్టీని గెలిపించే విధంగా చూడాలని ఇది ఒక పార్టీ మీటింగ్ కాకుండా జీవనశైలి అన్నదాత యొక్క కన్నీరు చూసి రావడం జరిగిందని ఇక నుండి నెలలో ప్రతి వారంలో వచ్చి పోతానని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడుతూ భారత దేశంలో రాష్ట్రాల్లో చీకటిగా ఉందని తెలిపారు 16 కోట్ల పైతీలుకు రైతులు ఉండగా వారికి ఎన్నో కష్టాలు ఉన్నాయని భారత దేశంలో ప్రతి రైతు పండిస్తున్న పంటను మనం ఆస్వాదిస్తూ వారికి మెరుగైన ధరలు కల్పించాలని కొన్ని పార్టీలు రంగులు బదలైస్తూ రైతులను మోసం చేస్తున్నారని అయితే బీఆర్ఎస్ పార్టీ వస్తే మహారాష్ట్రలో తెలంగాణ తరహా 24 గంటలు ఉచిత కరెంటు తో పాటు రైతుబంధు ఎకరానికి 5000 చొప్పున ప్రతి రైతుకు అందేలా చూస్తూ రైతు బీమా తో పాటు తెలంగాణలో ఉన్న ప్రతి పథకాన్ని మహారాష్ట్రలో అమలు చేస్తామని వారు తెలిపారు కొందరు మరాఠీలు మరాటి వాడ సపరేటు చేయాలని కోరగా వారి వందనాల మేరకు నేను కూడా తెలంగాణ కోసం ఎంతో పోరాడానని టిఆర్ఎస్ పార్టీ ఆధీనంలోకి వస్తే తప్పకుండా మరకవాడ ఏర్పాటు చేయడం జరుగుతుందని అదేవిధంగా అంతకుముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జ్యోతిబాపూలే సావిత్రిబాయి చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులు అర్పించారు రైతు అల్లం పట్టినట్టు కాదు కలం కూడా పట్టాల్సిన అవసరం ఉందని ఇకనుండి దిగులు చెందకుండా ప్రతి రైతే కాకుండా పార్టీ ప్రతినిధుల కోసం అహర్నిశలు కష్టపడ్డ వారికి ప్రత్యేక అవకాశాలు కల్పిస్తామని అటు రైతులు కాకుండా పేద నిరుపేద కుటుంబాలు ఉన్నాయని ఇప్పటికే మహారాష్ట్రలో త్రాగటానికి మంచినీరు లేదని అంతేకాకుండా పంటలు పండిస్తున్న రైతన్నలకు కనీస కరెంటుతో పాటు వారికి నీటి సౌకర్యం లేకపోవడంతో అల్లడిల్లుతున్నారని ఎద్దేవా చేశారు. వస్తే బీఆర్ఎస్ పార్టీ ఆ దినంలోకి వస్తే తమ కష్టాలు దూరమవుతాయని పేర్కొన్నారు. దీనితో సభ ప్రారంభంలో పాల్గొన్న ప్రజలు చెప్పట్లతో గోరెత్తారు ఏక్ బార్ కిసాన్ సర్కార్ అంటూ మంత్రి చెప్పగా అందరూ ఏక ముక్తకంఠంతో ఏక్ బార్ కిషన్ సర్కార్ అంటూ కార్యకర్తలు ప్రజలు నినాదాలు చేశారు దీనితో నాందేడ్ పట్టణ ప్రాంతమంతా ప్రత్యేక ఫ్లెక్సీలతో గులాబీ మాయమై ఎక్కడ చూసినా గులాబీ కటౌట్స్ లో కనబడ్డాయి అంతకుముందు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సభ ఏర్పాటు కోసం ఎంతో ఆహర్నిశలు చేశారని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీగాల గణేష్ గుప్తా, బాల్క సుమన్ తో పాటు మన రాష్ట్రం నుండి కాకుండా మహారాష్ట్ర నుండి భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని తిలకించి విజయవంతం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు అనంతరం సభ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మీ యొక్క అనుకున్న ఎజెండా ప్రకారం అన్ని పనులు పూర్తి చేస్తామని అందరి ముందర ముక్తకంఠంతో హామీ ఇచ్చారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








