నిర్మల్
మహాశివుని ఉత్సవాలకు ముస్తాబైన ఆలాయాలు


దీప కాంతులతో శోభాయ మానంగా లోకేశ్వరాలయం
జనం వెలుగు, లోకేశ్వరం:- శంభో అంటే చాలు వరాలను కురిపించే భోలాశంకరునికి ఇష్టమైన మహాశివరాత్రి ఉత్సవాలను జరిపేందుకు లోకేశ్వరం మండలంలోని ఆయా గ్రామాల ఆలయాలతోపాటు లోకేశ్వరం మండల కేంద్రంలోని లోకేశ్వరాలయాన్ని రంగురంగుల పుష్పాలు, విద్యుత్ దీపకాంతులతో, దేదోప్యమానంగా అందంగా అలంకరించి ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, ఆలయ కమిటీ, వీడీసీ, సభ్యులు మాట్లాడుతూ మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం నుండి ఆదివారం వరకు వేద పండితులచే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు, మొదటి రోజైన శుక్రవారం రోజున శాంతి పాఠం, దేవతా ఆజ్ఞ, మహాసంకల్పం గణపతి-గౌరీ పూజ, స్వస్తిపుణ్యాహవాచనం, ఆలయశుద్ధి, ఋత్వి గ్వరణం, అఖండ దీపారాధన, గోపూజ, అంకురారోపనం, తులసి పూజ, నివేదన హారతి మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం, యాగశాల ప్రవేశం నవగ్రహ, వాస్తు, యోగిని, భద్ర మండలం, క్షేత్ర పాల మండప ఆవాహన పూజలు, అగ్నిప్రతిష్ట, స్థాపిత, దేవతాహవనములు, సాయంకాల ప్రదోష పూజ, నిత్యబలి, హారతి, మంత్రపుష్పం, నివేదన, తదితర కార్యక్రమాలను నిర్వహించామని, శనివారం రోజున ప్రాతః కాల, సుప్రభాతం, కర్మణ పుణ్యాహవచనం, అలంకారం స్థాపిత దేవతాహావణములు, రుద్రహోమం, సూక్తహోమం, చండీ హోమం, సాయంత్రం గోధూళి సమయంలో 05:45నుండి 06-02, ని” కర్కటలగ్నం గురుని యొక్క శుభదృష్టి మరియు శుక్రహోరాలతో శివపార్వతులకళ్యాణం, నిత్య బలి,హారతి, మంత్రపుష్పం,ప్రసాద వితరణ, రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ పూజ, అభిషేకం అర్చన పుష్పయాగం అర్చన బిల్వార్చన హారతి నివేదన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని, మూడవ రోజైన ఆదివారం రోజున ప్రాతఃకాల సుప్రభాతం, పూజ, అభిషేకము, అలంకారము, దేవతల హోమాలు, జయాదులు, పూర్ణాహుతి,త్రిశూల స్నానం, తదితర కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం 11 గంటల నుండి అన్నదానం, సాయంత్రం 3-00 గంటలకు రథోత్సవం 7-00 గంటలకు కుంకుమార్చన 9-00గంటలకు ఏకాంత సేవ, ద్వజారోహణం ఆశీర్వచనం, పండిత సన్మానం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని, మహిళలు, యువకులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొని మహాశివుని కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








