నిర్మల్
శివ నామస్మరణతో మార్మోగిన బాసర క్షేత్రం


కిర్ఘుల్ బీ గ్రామంలో లింగలగుట్టలో శివునికి ప్రత్యేక పూజలు
జనం వెలుగు బాసర:– అలంకార ప్రియుడు, శంభో.. అనివచనాలు ఋషులకు, రాక్షసులకు, మనష్యుల లేకుండా కోరిన కోరికలను తీర్చే భోలాశంకరుని మహాశివా రాత్రీ కిర్గుల గ్రామంలో లింగాల గుట్టలో ఆయా గ్రామాలలోని శివాలయాలతో పాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర భక్తుల హరనామస్మరణతో కిటకిటలాడాయి. కన్నుల పండువగా శివపార్వతుల కళ్యాణం ఆదివారం ఉదయం ప్రాతకాలనుప్రభాతం, కర్మణ పుణ్యాహవ చనం, అభిషేకం, అలంకారం పాపిట దేవతా హవానాలు, రుద్ర హో మం, సూక్తహోమం, ఛండీ హోమం, తదితర కార్యక్రమాలు నిర్వ హించిన అనంతరం సాయంత్రం గోధూళి సమయంలో శివపార్వ తుల ఉత్సవ మూర్తులను రథంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుం డా ఊరేగింపు నిర్వహించి సాయంత్రం 5 గంటల నుండి 6.02 మ ధ్య కాలంలో కర్కాటక లగ్నంలో గురుని యొక్క శుభదృష్టి, శుక్రహో రాలో ఎదుర్కొళ్లు శివపార్వతుల కళ్యాణం, ముత్యాల తలంబ్రాలు, రాత్రి 10 గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం 12 గంటల లింగోద్భవం, బిల్వ దళార్చన, పుష్పార్చన, పలార్చన, హారతి, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలను కన్నుల పండువగా అంగ రంగవైభవంగా నిర్వహించి మహిళలకు, భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమ యంలో పూజ అభిషేకం అర్చన, పుష్పయాగం, బిల్వార్చన అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు గ్రామస్తులు, యువతీ యువకులు, పిల్లలు పెద్దలు పాల్గొన్నారు. ఆదివారం ఘనంగా మహా శివరాత్రి వేడుకలను నిర్వహించారు ఆలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహిం చారు. భక్తులు అధిక సంఖ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓలా శివాలయంలోని శివునికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం నుండి శివునికి పాలాభిషేకం జలాభిషేకం, పుష్పాభిషేకం తో పాటు తదితర కార్యక్రమాలను చేపట్టారు. మండల నుండా కాకుండా నియోజకవ ర్గంలోని ఆయా మండలాల ప్రజలు వచ్చి రాజరాజేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా బాసర ఎస్ఐ మహేష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనం తరం నది ఒడ్డున గల సూర్వేశ్వర శివాలయంలో అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికా రులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గోదావరి నదిలోపలికి వెళ్ల కుండా ఆలయ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అనంతరం అమ్మవారి ఆలయంలో అర్చకుల చేత తల్లితండ్రులు తమ చిన్నారు లకు కుంకుమ్చాన, అక్షర శ్రీకార పూజలు జరిపించారు. శ్రీ వేద భారతి ఆధ్వర్యంలో పూజారులు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. బాసర మండల తహసీల్దార్ కార్యాలయ ఆర్ఎస్ఐ నారాయణ పటేల్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








