నిర్మల్
బాసర మండలంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు


కిర్గుల్ బి గ్రామంలో శివాజీ విగ్రహన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
జనం వెలుగు, బాసర:- బాసర మండల కేంద్రంతో పాటు స్థానిక రైల్వే స్టేషన్ సమీపాన గల శివాజీ విగ్రహానికి వివిధ రకాల పూలతో నూతన హంగులతో అలంకరించి ఆదివారం 1093 వ జయంతి వేడుకలను హిందూ సోదరులు ఘనంగా జరుపుకున్నారు అంతకుముందు మండల పరిధిలోని గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలతో పాటు నూతన విగ్రహావిష్కరణ ఆవిష్కరణకు స్థానిక ముధోల్ ఎమ్మెల్యే శ్రీ విట్టల్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఓని కౌట గ్రామాలలో జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మారట సంఘం యువజన సంఘ సభ్యులు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు భగవ జెండాలతో గ్రామంలోని పురవీధుల గుండా చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తూ జై భవాని జై శివాజీ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు అనంతరం కొందరు భక్తులు మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని కున్భీ (బీసీ )కులంలో పుట్టిన శివాజీ ఏ సింహాసన వారసత్వం లేకుండా స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీకి పట్టాభిషేకం చెయ్యడానికి ఏ బ్రాహ్మణుడు ముందుకు రాలేదు, కారణం శివాజీ శూద్రుడు కాబట్టి. హిందు ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకి, క్షత్రియులకి మాత్రమే రాజయ్యే హక్కు ఉంది. దాంతో శివాజీ పట్టాభిషేక కార్యక్రమానికి కాశీ నుండి అప్పుడు గంగాభట్ అనే బ్రహ్మాణున్ని అతని బరువుకు సరితూగే బంగారం ఇస్తానని ఒప్పించి రాజ్యాభిషేకం చెయ్యడానికి పిలిపిస్తే కాలిబ్రొటన వేలుతో గంగాభటుడు శివాజీ నుదుటకు తిలకం దిద్ది రాజ్యాభిషేకం చేస్తాడు. వ్యక్తిగతంగా శివాజీకి బ్రాహ్మణులు అందరు వ్యతిరేకం కాకపోవచ్చు. కానీ బ్రాహ్మణ ధర్మం కులం పేరిట ఒక మహా చక్రవర్తిని అవమానించింది. శూద్రులు రాజులు కాకూడదని ధర్మం విధించింది. ముసల్మాన్ రాజు కావచ్చు కానీ శూద్రుడు కాలేడు. గడుపుకొనుటకు శివాజీని ముస్లిం వ్యతిరేకిగా కరుడుగట్టిన హిందూ మతాభిమానిగా చిత్రించి చరిత్రని వక్రీకరించింది. భవానీ మాత ఖడ్గం ప్రసాదించినట్లు మూఢవిశ్వాసాన్ని ప్రచారం చేసారు. నిజానికి అది అప్పుడు పోర్చుగల్ లో తయారు చేయించిన కత్తి. శివాజీ వాడిన ఆ ఖడ్గం ప్రస్తుతం సతారా మ్యూజియంలో ఉంది. దానిపై పోర్చుగీస్ లిపి ఉండి అవలంభిoచిండు. కానీ మత దురాభిమాని కాదు. అప్పటి మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా స్వరాజ్య స్థాపన కోసం పని చేసిండే తప్ప ముస్లిములకు వ్యతిరేకంగా కాదు. శివాజీని ముస్లిం మత వ్యతిరేకిగా ప్రచారం చేసి తప్పుడు జాతీయ వాదానికి ప్రతీకగా నిలబెట్టారు. శివాజీ ముస్లీం వ్యతిరేకి ఐతే తన సైన్యంలో మూడవ వంతు ముస్లీములెలా ఉంటారు? శివాజి ముస్లిం వ్యతిరేకి అయితే శివాజీ సాయుధ దళాలలో ముఖ్యమైన ఆయధాగార అధిపతిగా ఒక ముస్లింని నమ్మి ఇబ్రహీం ఖాన్ ను ఎలా నియమించుకుంటాడు? శివాజీ నౌకాదళాధిపతి దౌలత్ ఖాన్ ఒక ముస్లిం. శివాజీ అంగరక్షకుడు మదాని మెహతర్ ఒక ముస్లిం. ఈ మదాని మెహతర్ శివాజీని ఔరంగజేబ్ ఆగ్రాలో బంధించినపుడు మారు వేషంలో వెల్లి తన ప్రాణాలొడ్డి శివాజీ తప్పించుకొనుటకు సాయం చేసాడు. శివాజీకి సన్నిహితుడు, విదేశి వ్వవహరాల మంత్రి ముల్లా హైదర్ ఒక ముస్లిం. సలేది యుద్దం తర్వాత ఔరంగజేబు సైన్యాధికార్లతో సత్సంబంధాల కోసం శివాజీ తన తరపున దూతగా కాజీ హైదర్ అనే ముస్లీముని పంపిస్తాడు. శివాజీ తన రాజభవనం ముందర ప్రార్థన కొరకు దర్గాని కట్టించాడు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








