నిర్మల్
త్రిబుల్ ఐటీలో కంప్యూటేషనల్ గణితంపై వర్క్ షాప్


జనం వెలుగు, బాసర:- రాజీవ్ గాంధీ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం బాసర త్రిబుల్ ఐటీలో గురువారం మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ పై ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించడం జరిగింది. ఈ వర్క్ షాప్ ను ఉద్దేశించి డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ ప్రారంభ ఉపన్యాసం చేస్తూ గత కొంతకాలం నుండి ఇంజనీరింగ్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ డిపార్ట్మెంటులలో ప్రతి విభాగంలో సెమినార్లు వర్క్ షాప్ లు నిర్వహించాలన్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, అందులో భాగంగానే నేడు ఈ వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంజనీరింగ్ కోర్సులలో కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. గణిత శాస్త్రంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించడానికి కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ మంచి పరిష్కార మార్గమని, లిబర్టీ, లిఫ్టింగ్ వంటి సేవలు అందుబాటులో రావడానికి ఈ పద్ధతి ఎంతో అవసరమవుతుందని తెలిపారు. ఇంజనీరింగ్ చేస్తున్న ప్రతి విద్యార్థికి గణిత శాస్త్రం అతి ముఖ్యమైనదని, గణిత శాస్త్రం లేకుంటే ఇంజనీరింగ్ ఉనికిలో లేదని ఆయన ప్రస్తావించారు. ఆర్జీయూకేటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ వెంకటరమణ గారు మాట్లాడుతూ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న వర్క్ షాపు విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, దీన్ని నిర్వహిస్తున్న అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నలుగురు ఆర్జీయూకేటీ అధ్యాపకులు వివిధ అంశాలపై మాట్లాడారు. అధ్యాపకులు సునీల్ మాట్లాడుతూ మాట్‌ప్లాట్‌లిబ్ అనేది పైథాన్‌లో స్టాటిక్, యానిమేటెడ్ ఇంటరాక్టివ్ విజువలైజేషన్‌లను రూపొందించడానికి ఒక సమగ్ర లైబ్రరీ. మాట్‌ప్లాట్‌లిబ్ సులభమైన విషయాలను సులభతరం చేస్తుంది. కష్టమైన విషయాలను సాధ్యం చేస్తుంది. ప్రచురణ నాణ్యత ప్లాట్లను సృష్టిం స్తుందని. జూమ్, పాన్, అప్‌డేట్ చేయగల ఇంటరాక్టివ్ ఫిగర్‌లను రూపొందిస్తుందని తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ వారి డేటా ప్రాతినిధ్య నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అధ్యాపకులు నగేష్ మాట్లాడుతూ “పైథాన్‌ని ఉపయోగించి సింపీతో సింబాలిక్ మ్యాథమెటిక్స్” ఈ సెషన్ పియుసి మరియు ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ కంప్యూటర్‌లో గణిత సమస్యలను సింబాలిక్‌గా పరిష్కరించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అధ్యాపకులు ప్రకాష్ మాట్లాడుతూ ఆప్టిమైజేషన్ పద్ధతులు దాని అప్లికేషన్‌లు పనిని షెడ్యూల్ చేయడం, ఆర్థిక గణితశాస్త్రం, రవాణా సమస్య అసైన్‌మెంట్ సమస్యలు వంటి వారి డొమైన్ సంబంధిత సమస్యలను ఆప్టిమైజ్ చేయడానికి ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. అధ్యాపకులు కుమార్ మాట్లాడుతూ మాట్ ల్యాబ్ అనేది అనేక ఇంజినీరింగ్ సైన్స్‌లో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అల్గారిథమ్ డెవలప్‌మెంట్, డేటా విజువలైజేషన్, డేటా అనాలిసిస్, న్యూమరికల్ కంప్యూటేషన్ కోసం ఇంటరాక్టివ్ వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ వర్క్ షాప్ లో పియుసి మొదటి సంవత్సరం రెండవ సంవత్సరము ఇంజనీరింగ్ మొదటి సంవత్సర విద్యార్థులు 800 మంది పాల్గొన్నారు. విద్యార్థులందరికీ సర్టిఫికెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ వర్క్ షాప్ సమన్వయకర్త డాక్టర్ దత్తు హల్లే, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి మధుసూదన్ ఆడేపు, అధ్యాపకులు తిరుపతిరావు, తారాబాయి, ప్రవీణ్ రావు, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








