నిర్మల్
రోజురోజుకు పెరుగుతున్న వీడిసి ల ఆగడాలు


మాకు న్యాయం చేయండి అంటు బోరుమంటున్న రైతు
దళిత రైతు భూమిని పరిశీలించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం దళిత ప్రజా సంఘలు
జనం వెలుగు, లోకేశ్వరం:- లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలోని కొబ్బనోళ్లపెద్ద గంగన్న అనే దళిత రైతు భూమిని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. కొబ్బనోళ్ల పెద్ద గంగన్న సర్వేనంబర్ 328 /ఆ లో 5 ఎకరాలు కలిగి ఉన్నాడు. ఈ భూమి 1991లో పట్టా అయింది. 33 సంవత్సరాలుగా ఈ భూమి సాగులో ఉంది. వరి పంట పండిస్తున్నారు. రెండు బోర్లు వేసుకొని నీటి సౌకర్యాన్ని పొంది సొంతంగా ట్రాన్స్ఫారం పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి అబ్దుల్లాపూర్ గ్రామ సర్పంచ్, వీడిసి చైర్మన్ అట్లాగే వీడిసి వాళ్ళు కలిసి ఈ భూమిని 2022లో కబ్జా చేసి 2022 వర్షికాలం పంటను సాగు చేస్తే ధ్వంసం చేసి ఈ భూమిలో ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి ఈ భూమిని క్రికెట్ గ్రౌండ్ గా మార్చి ఈ భూమి మాది అని ఈ భూమి నుండి నువ్వు వెళ్లిపోవాలని చెప్పి వెళ్ళగొట్టడం జరిగింది. దీనిపై ఇప్పటికే కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు మండల తాసిల్దార్ కి ఫిర్యాదు చేసి ఉన్నారు. కానీ అధికారులు ఆ విడిసి వాళ్లకు వత్తాసు పలుకుతూ ఇక్కడున్నటువంటి పోలీసు వాళ్ళు వీడిస్ వాళ్లకు వత్తాసు పలుకుతూ దళిత పేద రైతుకు అన్యాయం చేశారు. ఈ భూమిని గురువారం సంఘ నాయకులు పరిశీలించారు. ఈ భూమి నేటికీ రికార్డులో ఉన్నది. 328 సర్వే నెంబరు ఆన్లైన్లో ధరణిలో కనబడుతున్నది. కానీ ఈ భూమి వాళ్ళది కాదని చెప్పి వాళ్ళు వాదిస్తూ ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి ఆ భూమి నుండి రైతులను వెళ్ళగొట్టారు. అంటే ఇక్కడ ఎంత భూస్వామ్య, పెత్తందారి అగ్రకుల పెత్తనం కొనసాగుతుంది. ఈ సమస్యపై దళిత ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, వాపక్షవాదులు స్పందించాలి. 6 తేదీనాడు సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయనున్నాట్లు తెలిపారు. కలెక్టర్ ఈ భూమిని సందర్శించాలని ఇక్కడ జరుగుతున్నటువంటి అగ్రకుల అహంభావ, భూస్వామ్య భావజాల, ధోరణిని అపడం కోసం చర్యలు తీసుకోవాలి. ఈ రైతు భూమిని ఈ రైతుకు ఇప్పించాలి. అబ్దుల్లాపూర్ గ్రామ విడిసి నుంచి ఈ రైతుకు ప్రాణభయం ఉంది. ప్రాణ భయం వల్లే ఆ భూమిలో ఏమి చేయలేక భూమిని వదులుకొని ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వెంటనే దీనిపై విచారణ కమిటీ వేసి ఎవరైతే ఈ భూమిపై కబ్జా చేసి దీనికి కారకులయ్యారు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని దళిత రైతుకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడుల ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా ముందుకు తీసుకుపోతాం. రైతుకు న్యాయం జరిగేంతవరకు దళితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తాం. అని దుర్గం నూతన్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ భూమిని సందర్శించిన వారిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, జిల్లా సహాయ కార్యదర్శి తిమ్మాపురంముత్తన్న, జిల్లా ఉపాధ్యక్షులు గైని మురళీమోహన్, మండల నాయకులు తిమ్మాపురం దేవేందర్, మోడపు జాన్ పాల్, కెవిపి ఎస్ జిల్లా కన్వీనర్ D. పోశెట్టి , గ్రామ అంబేద్కర్ సంఘం నాయకులు మద్దెనోళ్ల లింగన్న, నగరం పెద్ద గంగన్న, బొమ్మాయి పెద్ద సాయన్న, పొలుర్ బోజన్న, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం


జనం వెలుగు, చిలిపిచేడ్: చిలిపిచేడ్ మండలం పరిధిలోని చిట్కుల్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠశాల నిర్వహణ బాధ్యతలను చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
5వ తరగతి విద్యార్థులు తోటి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా అజూహ ఫాతిమా ప్రధానోపాధ్యాయురాలిగా, భార్గవ్ ప్రసాద్ డీఈఓగా, సాత్విక్ ఎంఈఓగా, శశాంత్ కాంప్లెక్స్ హెచ్ఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా ఆదర్శ్, ప్రణీత్, చరణ్య, తేజశ్రీ, నవ్య, యశ్వంత్ తదితరులు ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠశాల వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సత్యనారాయణ, అనిత ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థుల చురుకుదనం, ఆత్మవిశ్వాసం ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో ప్రతిబింబించిందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
నిర్మల్
| Nirmal ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన


ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన
నిర్మల్ పట్టణంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ తనిఖీ
జనంవెలుగు, నిర్మల్:- నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ సభకు సంబంధించి చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదిక, టెంట్ ఏర్పాటు, తగిన సంఖ్యలో కుర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు సభకు హాజరయ్యే ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు.
అలాగే, సభ నిర్వహణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ ఏర్పాట్ల పరిశీలన కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికిరణ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీవో రత్నకళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్
Nirmal | నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం


నిర్మల్ ట్యాంక్‌బండ్‌లో లేక్ వ్యూ పాయింట్ ప్రారంభం
జనంవెలుగు, నిర్మల్: నిర్మల్ మినీ ట్యాంక్‌బండ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన లేక్ వ్యూ పాయింట్ ను రాష్ట్ర అరణ్య, పర్యావరణ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి, పర్యాటక ప్రోత్సాహం, పచ్చదనం, సుందరీకరణ దిశగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. భవిష్యత్తులో సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








