Connect with us

Entertainment

మాట నెగ్గించుకుని మేకర్స్ ని ఇరుకున పెట్టిన బాలయ్య!

janamvelugunews

Published

on

Views: 0

నందమూరి బాలకృష్ణ మొత్తానికి తన పంతం నెగ్గించుకున్నారు. డిసెంబర్ సెంటిమెంట్ ప్రకారం తన తాజా చిత్రం విడుదలవుతుందని అంతా భావించారు కానీ ఊహించని విధంగా బాలకృష్ణ నటిస్తున్న `వీర సింహారెడ్డి` సంక్రాంతికి బరిలో దిగుతున్నట్టుగా తేలిపోవడంతో బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటుంటే మేకర్స్ మాత్రం ఇబ్బందికరంగా ఫీలవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. నందమూరి బాలకృష్ణ డిసెంబర్ 2న విడుదలై `అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు.ఈ మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేశారు. అదే జోష్ తో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నారు. ఈ మూవీని ప్రారంభం నుంచి బాలయ్యకు హిట్ ని అందించి సెంటిమెంట్ నెలగా మారిన డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని ప్రచారం జరిగింది. అయితే బాలయ్య మాత్రం సంక్రాంతికే రావాలని ఫిక్స్ అయ్యాడని కానీ మేకర్స్ మాత్రం డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి.

ఈ వార్తల నేపథ్యంలో శుక్రవారం టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తించింది. బాలయ్య ఫ్యాన్స్ ఊహించినట్టుగానే ఈ మూవీకి `వీర సింమారెడ్డి` అనే టైటిల్ ని ఫైనల్ చేసిన మేకర్స్ ఈ మూవీని బాలయ్య పట్టు మేరకు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇదే ఇప్పడు మైత్రీ మూవీ మేకర్స్ వారికి పెద్ద చిక్కు తెచ్చిపెట్టిందని తెలుస్తోంది.

ఇదే నిర్మాణ సంస్థ మెగాస్టార్ చిరంజీవి – బాబిల కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా `వాల్తేరు వీరయ్య`ని నిర్మిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ.. చిరుకు సోదరుడిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా  కీలక అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీని మేకర్స్ సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించింది. ఈ సినిమాతో బాలయ్యతో చేస్తున్న `వీర సింహారెడ్డి` సంక్రాంతికి రిలీజ్ చేస్తే క్లాష్ అవుతుందని భావించిన మేకర్స్ ఈ మూవీని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

కానీ బాలకృష్ణ సంక్రాంతికే వస్తానంటే బెట్టుచేయడంతో చివరికి ఏమీ చేయలేక బాలయ్య మాటకు సై అనక తప్పలేదు. అయితే ఇదే మైత్రీ వారిని ఇరకాటంలో పడేసి ఇబ్బందికి గురిచేయడం ఖాయం అని చెబుతున్నారు. గతంలో చిరంజీవి బాలకృష్ణ సంక్రాంతి బరిలో పోటీపడిన సందర్భాలు వున్నాయి. అయితే ఒకే సంస్థ నిర్మించిన సినిమాలతో పోటీపడటం మాత్రం ఇదే తొలిసారి. ప్రమోషన్స్ దగ్గరి నుంచి మెయిన్ థియేటర్స్ ని కేటాయించే వరకు మైత్రీ వారికి ఈ రెండు సినిమాలు పెద్ద చిక్కునే తెచ్చిపెట్టాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇక బాలయ్య టైటిల్ తో పాటు రిలీజ్ టైమ్ పై కూడా క్లారిటీ ఇవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమా టైటిల్ తో పాటు టీజర్ ని కూడా దీవావళికి రిలీజ్ చేసేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీజర్ లో ఈ సారి పక్కాగా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది. దిలా వుంటే ఈ రెండు సినిమాలతో పాటు వచ్చే సంక్రాంతికి ప్రభాస్ `ఆదిపురుష్` విజయ్ `వారసుడు` అజిత్ `తునీవు` కూడా పోటీపడబోతున్నాయి. వీటన్నింటికి థియేటర్స్ కేటాయించడం ఒకెత్తయితే మైత్రీ వారు చిరు బాలయ్య సినిమాలకు థియేటర్స్ ని కేటాయించడం ఒకెత్తుగా మారనుందని.. బాలయ్య కారణంగా ఇరకున పడ్డ మైత్రీ వారు ఈ టాస్క్ నుంచి ఎలా బయటపడతారన్నది వేచి చూడాల్సిందే.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Entertainment

బరాబర్ ప్రేమిస్తా సినిమాను ఆదరించండి సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర 

janamvelugunews

Published

on

Views: 4077

బరాబర్ ప్రేమిస్తా సినిమాను ఆదరించండి సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర 

జనంవెలుగు, నిజామాబాద్:- బరాబర్ ప్రేమిస్తా సినిమాను ఆదరించండి అని సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర అన్నారు. బుధవారం నగరంలోని ప్రెస్ క్లబ్లో బరాబర్ ప్రేమిస్తా సినిమా టీం డైరెక్టర్ సంపత్ రుద్ర, హీరో చంద్రహాస్, హీరోయిన్ మేఘన ముఖర్జీ, ఇంద్రకరణ్ లు విలేకర్ల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదివరకు వచ్చిన ప్రేమ కథలకు భిన్నంగా అన్ని ఎమోషన్లతో కూడిన అందమైన ప్రేమ కథ చిత్రాన్ని నిర్మించి త్వరలో తమ చిత్రం విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుందని కావున తమ చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ఈ చిత్రం పూర్తిగా దాదాపు తెలంగాణలోని ముఖ్యమైన జిల్లాలలో ఆయన వివరించారు.

ఇదే బ్యానర్ పైన తమ తదుపరి చిత్రం కూడా ఉంటుందని ఆ చిత్రం దాదాపు 40 శాతం వరకు నిజామాబాద్ జిల్లాలోని అందమైన లోకేషన్లను ఎంపిక చేసుకుని రాబోయే తమ చిత్రానికి రూపకల్పన చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. బరాబర్ ప్రేమిస్తా చిత్రంలో యువతకు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా సినిమాను నిర్మించామన్నారు.

సినిమాను తెలంగాణలో తీయడం జరిగిందన్నారు. తాను నెక్స్ట్ నిర్మించే సినిమాను నిజామాబాద్ లో చేసే ప్రయత్నం చేస్తామన్నారు. సి సి క్రియేషన్స్ లో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని కోరారు.

Continue Reading

Entertainment

ఫుల్లుగా మందేసి కరెంట్ తీగలపై పడుకున్న మందుబాబు

janamvelugunews

Published

on

Views: 0

ఫుల్లుగా మందేసి కరెంట్ తీగలపై పడుకున్న మందుబాబు

జనంవెలుగు, మన్యం:- పాలకొండ మండలం ఎం. సింగిపురం అనే గ్రామంలో ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగనిదే అతడికి పూట గడవదు. మద్యం తాగపోతే అతడు అడుగు కూడా బయటికి వేయలేడు. చేతులు వణుకుతాయి. మనిషి మొత్తం షేక్ అవుతుంటాడు. అలాంటి వ్యక్తి పీకలదాకా మద్యం తాగాడు. పైగా నూతన సంవత్సరం కావడంతో మరింతగా మద్యం తాగాడు. దీంతో అతడి శరీరం వణికి పోవడం మొదలుపెట్టింది. కాళ్లు తడబడటం ప్రారంభమైంది. ఆ మైకం నుంచి తట్టుకోలేక అతడు బయటికి వచ్చాడు. వచ్చి రావడంతోనే పక్కన ఉన్నవాళ్లను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దుర్భాషలాడటం ప్రారంభించాడు. ఇదే మైకంలో ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కాడు. చుట్టుపక్కల వాళ్ళు వారించినప్పటికీ అతడు ఒప్పుకోలేదు. అదే మైకంలో అలానే స్తంభం ఎక్కాడు. దీంతో వెంటనే స్థానికులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సరఫరాను నిలిపివేయించారు. విద్యుత్ స్తంభం పెట్టిన అతడు తీగలపై పడుకున్నాడు. అక్కడ చాలాసార్లు తనదైన విన్యాసాలు చేశాడు. ఆ తర్వాత స్థానికులు స్తంభం పైకి ఎక్కి అతడిని కిందికి దింపారు.

సోషల్ మీడియాలో సంచలనం

ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు అతడి తీరుపై మండిపడుతున్నారు.

Continue Reading

Entertainment

ఆత్మీయ సమ్మేళనం..

janamvelugunews

Published

on

Views: 0

ఆత్మీయ సమ్మేళనం..

ఉప్పొంగిన ఉత్సహం

జనంవెలుగు, వెబ్ డెస్క్:- వారంతా ఒకే పాఠశాలలో చదివారు. కానీ ఇప్పుడు వారి మధ్య పలకరింపులు లేవు.. కనీసం ఫోన్ చేసి మాట్లాడే అవకాశం లేదు.. కలుసుకోవాలని ఉన్న కుదరని పరిస్థితులు.. ప్రస్తుతం వారంతా ఎక్కడెక్కడో ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. తామంత ఒకే చోట కలవాలన్న ఆలోచన కొందరిలో కలిగింది. ఆలోచన కార్యరూపం దాల్చడానికి ఐదు నెలల సమయం పట్టింది… ఎంతో ఓర్పుతో తమతో కలిసి చదివిన వారి వివరాలు సేకరించారు. 33 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. మంగళవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ సమ్మేళనానికి మోర్తాడ్ లోని
దేవి చెట్టు వేదిక అయింది.

మోర్తాడ్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన 1990-91పూర్వ విద్యార్థుల బ్యాచ్, మళ్లీ కలుసుకున్నారు. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారంతా కుటుంబ సమేతంగా ఇక్కడికి తరలి వచ్చారు.

గుర్తుకొస్తునాయీ….. !

33 ఏళ్ల క్రితం హై స్కూల్ విద్యార్థులు ఇప్పుడు వారి పిల్లలు ఇంటర్మీడియట్, పదో తరగతిలో చదువుతున్నారు. ఆ రోజుల్లో కలిసి ఉండే కొంతమంది స్నేహితులు మినహా మిగతా వారెవరు ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితులు ఉండేవి కాదు. ఇప్పుడు ఆకస్మ త్తుగా కలుసుకోవడం వారిలో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేసింది. ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘ఒరేయ్…. నన్ను గుర్తుపట్టావా…? నేను నీ ఫ్రెండ్ సురేష్ గౌడ్ ని అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయారు. ఇలా ప్రతి ఒక్కరూ పూర్వ మిత్రులతో కలిసి ముచ్చటించుకున్నారు. గత అనుభూతులను నెమరు వేసుకున్నారు. మధుర స్మృతులు, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వయస్సుతో ప్రమేయం లేకుండా డ్యాన్సులుచేశారు. విందు వినోదాలతో కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా సాగింది.

Continue Reading